గణతంత్ర దినోత్సవం అంటే ఏమిటి – What is Republic Day in Telugu?

గణతంత్ర దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం 26 జనవరి రోజున జరుపుకుంటారు. 26 జనవరి 1950లో మొదటి సారి భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది.

ఈ కొత్త రాజ్యాంగం బ్రిటిష్ ప్రభుత్వం చే నిర్మించ బడ్డ Government of India Act 1935 చట్టాన్ని తొలగించింది. ఫలితంగా భారతదేశం గణతంత్ర రాజ్యంగా మారింది.

భారత రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని 26 నవంబర్ 1949న ఆమోదించింది మరియు 26 జనవరి 1950న అమలులోకి తీసుకువచ్చింది.

1930 జనవరి 26 రోజున ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ భారత స్వాతంత్ర ప్రకటన చేసింది. అందుకే అదే రోజును గణతంత్ర దినోత్సవంగా ఎన్నుకోవటం జరిగింది.

Independance vs Republic day difference:

స్వాతంత్ర దినోత్సవంను బ్రిటీష్ పాలన నుండి విముక్తి లభించినందుకు, గణతంత్ర దినోత్సవంను రాజ్యాంగం అమలు లోకి వచ్చినందుకు జరుపుకుంటారు.

చరిత్ర :

బ్రిటిష్ ప్రభుత్వం నుంచి భారతదేశానికి 15 ఆగస్టు 1947 సంవత్సరంలో లభించింది.

స్వాతంత్రం లభించిన తరవాత కూడా భారతదేశానికి అంటూ ఒక రాజ్యాంగం లేదు. ఆ సమయంలో కూడా బ్రిటిష్ ప్రభుత్వానికి చెందిన చట్టాలనే ఉపయోగించేవారు.

29 ఆగస్టు 1947లో రాజ్యాంగాన్ని రూపొందించటానికి ఒక డ్రాఫ్టింగ్ కమీటీ నియమాకం కోసం తీర్మానం ఆమోదించబడింది.

4 నవంబర్ 1947 లో రాజ్యాగానికి సంబంచిన ఒక డ్రాఫ్ట్ ను రాజ్యాంగ సభ కు సమర్పించబడింది.

రెండు సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు జరిగిన అసెంబ్లీ సమావేశాల తరవాత రాజ్యాంగాన్ని ఆమోదించటం జరిగింది.

24 జనవరి 1950 లో అసెంబ్లీకి చెందిన 308 సభ్యులు చేతి ద్వారా రాసిన రెండు కాపీలపై సంతకాలు చేసారు.

చాలా చర్చలు మరియు మార్పులు చేసిన తరవాత రెండు రోజుల తరవాత 26 జనవరి 1950 లో రాజ్యాంగం అమలులోకి వచ్చింది.

భారతదేశంలో మొట్టమొదటి సారి గణతంత్ర దినోత్సవాన్ని (republic day) 26 జనవరి 1950 సంవత్సరంలో జరుపుకున్నారు.

ఇదే రోజు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ భారత దేశం యొక్క మొట్ట మొదటి రాష్ట్రపతిగా ఎన్నుకోబడ్డారు.

ప్రత్యేకతలు:

గణతంత్ర దినోత్సవాన్ని భారత దేశ యొక్క రాజధాని ఢిల్లీ లోని రాజ్‌పథ్ వద్ద ప్రెసిడెంట్ ముందు చేయటం జరుగుతుంది.

ఈ రోజు రాజ్‌పథ్ వద్ద పరేడ్ (కవాతు) చేయటం జరుగుతుంది, ఈ పరేడ్ లను దేశానికి అంకితం చేయటం జరుగుతుంది మరియు భిన్నత్వంలో దాని ఏకత్వం ను సాటుతుంది.

ఈ రోజు భారత దేశ రాష్ట్రపతి అర్హులకు పద్మ విభూషణ్, పద్మ భూషణ్ మరియు పద్మ శ్రీ అవార్డు లను అందజేస్తారు.

ఇవి భారతరత్న తర్వాత భారతదేశంలో రెండవ అత్యున్నత పౌర పురస్కారాలు.

2023:

2023 సంవత్సరంలో మనం 74 వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోబోతున్నాము.

ఈ సంవత్సరం 74 వ గణతంత్ర దినోత్సవానికి చీఫ్ గెస్ట్ గా భారతదేశానికి ఈజిప్ట్ ప్రెసిడెంట్ అబ్దెల్ ఫత్తా అల్ సిసి వస్తున్నారు.

Also read: అబ్దెల్ ఫత్తా ఎల్-సి సి జీవిత చరిత్ర – Abdel Fattah el-Sisi biography in Telugu భారతదేశ త్రివర్ణ పతాక చరిత్ర ఏమిటి – What is the history of the Indian flag in Telugu?

Source: Republic Day (India) – Wikipedia

Leave a Comment