ఊర్మిళా మటోండ్కర్ జీవిత చరిత్ర – Urmila Matondkar biography in Telugu

ఊర్మిళా మటోండ్కర్ భారతదేశానికి చెందిన నటి మరియు రాజకీయ నాయకురాలు. ఈమె ప్రధానంగా హిందీ సినిమాలలో పనిచేస్తారు. హిందీ తో పాటు తెలుగు, మలయాళం, మరాఠీ మరియు తమిళ సినిమాలలో నటిస్తారు. 

బాల్యం: ఊర్మిళ ఫిబ్రవరి 4, 1974 వ సంవత్సరంలో ముంబైలో శ్రీకాంత్ మరియు సునీతా మటోండ్కర్ అనే దంపతులకు జన్మించారు. 

ఊర్మిళ తన చదువును ముంబై లోని డిజి రూపారెల్ కాలేజి నుంచి పూర్తి చేసుకున్నారు. 

పేరు ఊర్మిళా మటోండ్కర్
వృత్తి నటి 
పుట్టిన తేదీ ఫిబ్రవరి 4, 1974
పుట్టిన స్థలం ముంబై
తల్లి సునీతా మటోండ్కర్
తండ్రి శ్రీకాంత్ మటోండ్కర్
పార్టీశివ సేన 
భర్త మొహ్సిన్ అక్తర్ మీర్ (పెళ్లి  2016)

సినిమా కెరీర్ : 

ఊర్మిళ 1977 నుంచి 1989 వరకు పలు సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు. 

1977 లో ఊర్మిళ Karm అనే హిందీ సినిమాలో నటించి సినీ  ప్రపంచంలో డెబ్యూ చేసారు. 

1989 వ సంవత్సరంలో మలయాళం బ్లాక్ బస్టర్ చాణక్యన్ సినిమాలో కమల్ హాసన్ సరసన నటించి లీడ్ రోల్ లో నటించటం ప్రారంభించారు. 

1991 లో నర్సింహా అనే హిందీ సినిమాలో నటించి బాలీవుడ్ లో డెబ్యూ చేసారు 

1992 వ సంవత్సరంలో అంతం అనే తెలుగు సినిమాలో నటించి టాలీవుడ్ లో డెబ్యూ చేసారు. ఇదే సినిమా హిందీ భాషలో ద్రోహి పేరుతో విడుదల అయ్యింది. 

1993 లో విడుదల అయిన పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా గాయం లో నటించారు. ఈ సినిమా కి మంచి స్పందన లభించింది. బాక్స్ ఆఫీస్ లో కూడా సూపర్ హిట్ సినిమా గా నిలిచింది. ఈ సినిమాకు 6 నంది అవార్డులు లభించాయి. ఊర్మిళాకు కూడా తన నటనకు గాను బెస్ట్ సపోర్టింగ్ నటి కేటగిరీ లో నంది అవార్డు లభించింది.            

1994 వ సంవత్సరంలో రొమాంటిక్ డ్రామా సినిమా అయిన ఆ గలే లాగ్ జా (Aa Gale Lag Ja) సినిమా తరవాత ఊర్మిళాకు మంచి గుర్తింపు లభించింది. 

1995 వ సంవత్సరంలో రామ్ గోపాల్ వర్మ నిర్మించిన మరియు దర్శకత్వం వహించిన రంగీలా సినిమా లో ఊర్మిళ నటించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ లో మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమా తరవాత ఊర్మిళ బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ ల లిస్ట్ లో చేరింది. 

1996 వ సంవత్సరంలో ఇండియన్ (Indian) అనే తమిళ సినిమాలో నటించి కోలీవడ్ లో డెబ్యూ చేసారు. ఈ సినిమా హిందీ లో హిందుస్తానీ (Hindustani) అనే పేరు తో విడుదల చేసారు. 

1998 లో రామ్ గోపాల్ వర్మ సినిమా సత్య లో జెడి చక్రవర్తి సరసన నటించారు. ఈ సినిమా కూడా  బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్ సినిమాగా నిలిచింది. 

1999 వ సంవత్సరంలో ఊర్మిళ చేసిన 6 సినిమాలలో 4 సినిమాలు (జానం సంఝా కరో, హమ్ తుమ్ పే మార్తే హై, మస్త్ మరియు దిల్లగీ) కమర్షియల్ గా ఫెయిల్ అయ్యాయి. 

మిగతా రెండు సినిమాలు  కౌన్ (Kaun) మరియు ఖూబ్సూరత్(Khoobsurat)  హిట్ సినిమాలుగా నిలిచాయి. 

2003 లోఊర్మిళ హిందీ సినిమా భూత్ లో నటించారు. ఈ సినిమాలో ఊర్మిళ నటనకు గాను పలు అవార్డులు లభించాయి. 

2004 నుంచి ప్రస్తుతం వరకు ఊర్మిళ ఏక్ హసీనా థీ, నైనా మరియు బ్లాక్ మెయిల్ లాంటి పలు సినిమాలలో నటించారు. 

ఊర్మిళ తన భర్త తో కలిసి దిగిన ఫోటో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసారు.

పొలిటికల్ కెరీర్: 

27 మార్చ్ 2019వ సంవత్సరంలో ఊర్మిళ కాంగ్రెస్ పార్టీ లో చేరారు. 2019 లో జరిగిన ఎన్నికలలో ముంబై నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 

10 సెప్టెంబర్, 2019 వ సంవత్సరంలో పార్టీ లో ఉండే అంతర్గత రాజకీయాల కారణంగా పార్టీ నుంచి రాజీనామా చేసారు. 

డిసెంబర్ 1 2020 వ సంవత్సరంలో ఊర్మిళ  పార్టీ ప్రెసిడెంట్ ఉద్ధవ్ ఠాక్రే సమక్షంలో శివ సేన పార్టీ లో చేరారు.  

ఊర్మిళ హిందీ సినిమా ఇండస్ట్రీ లో పాపులర్ హీరోయిన్ అవ్వటం మరియు మరాఠీ, హిందీ మరియు ఇంగ్లీష్ భాషాలు కూడా రావటం పార్టీ కి మంచి గుర్తింపు తీసుకువస్తాయి అని అనుకున్నారు.  

వ్యక్తిగత జీవితం: 

ఊర్మిళ కాశ్మీర్ కు చెందిన వ్యాపారవేత్త మొహ్సిన్ అక్తర్ మీర్ ను 2016 వ సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు.     

                  

Reference: Urmila Matondkar – Wikipedia

Leave a Comment