నిక్ వుజిసిక్ జీవిత చరిత్ర – Nick Vujicic biography in Telugu

నిక్ వుజిసిక్ యొక్క పూర్తి పేరు నికోలస్ జేమ్స్ వుజిసిక్. ఈయన సెర్బియన్ సంతతికి చెందిన ఒక ఆస్ట్రేలియన్-అమెరికన్ క్రైస్తవ మత ప్రచారకుడు మరియు మోటివేషనల్ స్పీకర్.

బాల్యం:

నిక్ వుజిసిక్ 1982 వ సంవత్సరంలో ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో సెర్బియా నుంచి వలస వచ్చిన దుసంక మరియు బోరిస్ వుజిసిక్ దంపతులకు జన్మించాడు.

నిక్ వుజిసిక్ చర్చి లో పాస్టర్ గా పనిచేసేవాడు, ఈయన పుట్టుకతో టెట్రా-అమేలియా సిండ్రోమ్ అనే జబ్బు తో జన్మించారు. ఈ జబ్బు కారణంగా పిల్లలు కాళ్లు మరియు చేతులు లేకుండా పుడతారు.

నిక్ పుట్టినప్పుడు చేతులు మరియు కాళ్లు లేకుండా ఉండటం చూసి తల్లి చూడటానికి మరియు ఎత్తుకోవటానికి నిరాకరించారు. ఇదే కాకుండా తల్లి తండ్రులు హాస్పిటల్ వదిలేసి వెళ్లిపోయారు.

స్కూల్ లో చదివేటప్పుడు నిక్ ను తోటి విద్యార్థులు ఇతనిని వేధించేవారు. ఒకసారి నిక్ సూసైడ్ చేసుకోవాలని నీళ్లలో కూడా దూకారు కానీ వేరే వారిచే కాపాడబడ్డారు. జీవితంలో ఎల్లప్పుడు పాజిటివ్ గా ఉండాలని తల్లి తండ్రులు నిక్ కి నచ్చ చెప్పేవారు.

చిన్న తనంలో తల్లితండ్రులు నిక్ ను ఎలా పెంచాలో అర్థం కాక భాధ పడేవారు మరియు అయోమయానికి గురయ్యేవారు.

17 సంవత్సరాల వయస్సు నుంచి నిక్ స్కూల్ లో మరియు చర్చి ఈవెంట్ లలో ఇన్స్పిరేషనల్ స్పీచెస్ ఇవ్వటం ప్రారంభించారు.

21 సంవత్సరాల వయస్సులో నిక్ గ్రిఫిత్ విశ్వవిద్యాలయం (Griffith University) నుంచి బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ డిగ్రీ ను పొందారు.

పేరు నిక్ వుజిసిక్
వృత్తి మోటివేషనల్ స్పీకర్
పుట్టిన తేదీ 1982
పుట్టిన స్థలం మెల్‌బోర్న్‌,ఆస్ట్రేలియా
తల్లి దుసంక
తండ్రి బోరిస్ వుజిసిక్
భార్య కానే మియహర ​(పెళ్లి  2012) 
పిల్లలు 4

క్రైస్తవ మత ప్రచారం:

నిక్ క్రైస్తవ మత ప్రచారం చేయటానికి వేరు వేరు ప్రదేశాలకు వెళ్లేవారు. Life Without Limbs అనే నినాదం తో తన ప్రచారాం చేసేవారు. 2008 వ సంవత్సరంలో ABC టెలివిజన్ షో 20/20 లో కనిపించారు.

మోటివేషనల్ స్పీచ్ లతో పాటు నిక్ 2009 లో The Butterfly Circus అనే షార్ట్ ఫిలిం లో నటించారు.

2010 లో మెథడ్ ఫెస్ట్ ఇండిపెండెంట్ ఫిల్మ్ ఫెస్టివల్ లో బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా లభించింది. నిక్ పలు పుస్తకాలను రాసి పబ్లిష్ చేసారు.

వ్యక్తిగత జీవితం:

నిక్ 2012 వ సంవత్సరం ఫిబ్రవరి 12 న కనాయి మియహార (Kanae Miyahara) అనే అమ్మాయి ని పెళ్లి చేసుకున్నారు. ఈ ఇద్దరి దంపతులకు 2 కుమారులు మరియు 2 కూతుళ్లు ఉన్నారు.

నిక్ అబార్షన్ (గర్భస్రావం) కి వ్యతికేకంగా ఉంటారు. 2021 వ సంవత్సరంలో Prolife Bank ను కూడా స్థాపించారు.

చేతులు లేకుండా, నిక్ కంప్యూటర్‌లో నిమిషానికి 43 పదాలను టైప్ చేయగలడు. ప్రొఫెషనల్ కాని టైపిస్టుల సగటు కంటే కొంచెం ఎక్కువ.

నిక్ వుజిసిక్ మరియు భార్య కానే మియహర ​

నిక్ వుజిసిక్ మరియు పిల్లలు ​

Reference: Nick Vujicic – Wikipedia

Leave a Comment