ఫిబ్రవరి 15వ తారీకు 2024 న, సుప్రీంకోర్టు ఎలక్టోరల్ బాండ్ ను రద్దు చేస్తూ తీర్పును ఇచ్చింది.
అసలు ఎలక్టోరల్ బాండ్ అంటే ఏమిటి ? సుప్రీంకోర్టు ఎందుకని వీటిని రద్దు చేసింది ?
ఎన్నికలకు ముందు సాధారణ ప్రజలు మరియు వ్యాపారవేత్తలు తమకు నచ్చిన రాజకీయ పార్టీలకు తమ స్తోమతకు తగినంతగా ఫండింగ్ చేస్తారు. ఇలా ఫండింగ్ చేయటంలో ఎవరు ఏ పార్టీ కి సపోర్ట్ చేస్తున్నారో సులువుగా తెలిసిపోయేది.
బహుశా ప్రభుత్వానికి ఈ పద్దతి నచ్చలేదు, ఎవరు ఎంత మొత్తాన్ని ఏ పార్టీ కి ఇస్తున్నారు అనే దాన్ని గోప్యంగా ఉంచాలి అనే ఒక కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టాలనుకున్నారు. ఇలా బాండ్స్ రూపం లో ఫండింగ్ చేయటం వల్ల పొలిటికల్ పార్టీలకు మాత్రమే ఫండింగ్ చేసిన వారి గురించి తెలుస్తుంది.
2017 వ సంవత్సరంలో జరిగిన Union Budget లో ఫైనాన్స్ మినిస్టర్ అరుణ్ జైట్లీ ఫైనాన్స్ యాక్ట్ లో మార్పులు చేసి మనీ బిల్ ను ప్రవేశ పెట్టారు.
అరుణ్ జైట్లీ రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా యాక్ట్ లో మార్పులు చేసి Electoral బాండ్ ను ప్రవేశ పెట్టారు.
బ్లాక్ మనీ ను అరికట్టడమే ఈ Electoral బాండ్స్ ను ప్రవేశ పెట్టడానికి ముఖ్య కారణం అని ప్రభుత్వం చెప్పింది.
ఈ Electoral బాండ్స్ ద్వారా ఒక వ్యక్తి , ఒక సంస్థ లేదా వ్యాపారవేత్తలు సులువుగా రాజకీయ పార్టీలకు ఫండింగ్ చేయవచ్చు. ఈ Electoral బాండ్స్ లను అమ్మే అధికారం ప్రభుత్వం SBI బ్యాంక్ కు ఇచ్చింది.
ఈ బాండ్స్ 1,000,10,000,1,00,000,10,00,000 మరియు Rs.1,00,00,000 రూపాయల రూపంలో దొరుకుతాయి. మన స్తోమతను బట్టి ఈ Electoral బాండ్స్ ను కొని మనకు నచ్చిన పొలిటికల్ పార్టీలకు ఫండింగ్ చేయవచ్చు.
Electoral బాండ్ వల్ల మంచి ఉపయోగాలు ఉన్నప్పుడు ఇది ఒక పెద్ద స్కామ్ అని ఎందుకు న్యూస్ లలో వస్తుంది.
Electoral బాండ్స్ లో ముఖ్యంగా 3 రకాల సమస్యలు ఉన్నాయి అని సుప్రీమ్ కోర్టు ముందు ఉంచడం జరిగింది.
1) రైట్ to ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రతి ఓటర్ కి ఏ పార్టీ ఎక్కడినుంచి ఎంత డబ్బు తీసుకుంది అనే తెలుసుకునే అధికారం ఉంది. Electoral బాండ్స్ ఈ సమాచారాన్ని ఓటర్ల కి తెలియనియ్యదు.
2) Electoral బాండ్స్ చట్టం తయారు చేసేటప్పుడు వీటిలో ఉండే ఇన్ఫర్మేషన్ ట్రాన్స్పెరెంట్ గా ఉంటుంది అని చెప్పేవారు కానీ నిజానికి పొలిటికల్ పార్టీలు తప్ప మిగతా వారికి ఎవరు ఎంత ఫండింగ్ చేసారో తెలియదు. ఈ ఫండింగ్స్ కి బదులు పొలిటికల్ పార్టీలు ఎలాంటి కార్పొరేట్ బెనిఫిట్స్ చేస్తున్నారనేది తెలియదు.
3) షెల్ కంపెనీల ఫండింగ్ లను కూడా అనుమతించడం వల్ల పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు రాజకీయ పార్టీల నుంచి ఫలితాలను ఆశించి Electoral బాండ్స్ ను ఇవ్వటం జరుగుతుంది. కొన్ని సార్లు రాజకీయ పార్టీలు దేశానికి నష్టం చేసే డీల్స్ ను కూడా చేసే అవకాశం ఉంటుంది.
ఇలా ఈ మూడు విషయాలను గమనించి సుప్రీమ్ కోర్టు Electoral బాండ్ లను రద్దు చేయాలనీ అనుకుంది.
షెల్ కంపెనీల ఫండింగ్ లను కూడా అనుమతించడం వల్ల పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు రాజకీయ పార్టీల నుంచి ఫలితాలను ఆశించి Electoral బాండ్స్ ను ఇవ్వటం జరుగుతుంది. కొన్ని సార్లు రాజకీయ పార్టీలు దేశానికి నష్టం చేసే డీల్స్ ను కూడా చేసే అవకాశం ఉంటుంది.
ఇలా ఈ మూడు విషయాలను గమనించి సుప్రీమ్ కోర్టు Electoral బాండ్ లను రద్దు చేయాలనీ అనుకుంది.
అయితే ఒక కంపెనీ రాజకీయ పార్టీ కి ఎంత మొత్తాన్నైనా ఫండ్ చేయవచ్చు. 1 పర్సెంట్ నుంచి 100 పెర్సెంట్ వరకు మరియు కంపెనీ లాస్ లో ఉన్నా కూడా ఫండ్ చేయవచ్చు.
ఇలా రాజకీయ పార్టీలు తమకు లాభం ఎక్కడ ఉందొ అక్కడ మార్పులు చేర్పులు చేసుకుంటూ పోతున్నాయి అని ఆరోపణలు ఉన్నాయి.
ఇదంతా ఒక ఎత్తు అయితే రీసెంట్ గా SBI టాప్ 30 డోనర్ కంపెనీల లిస్ట్ ను జారీ చేసింది.
ఈ టాప్ 30 డోనర్లలో 14 డోనర్లపై ప్రోబ్ ఏజెన్సీల ద్వారా raid చేయబడింది. ఈ 14 కంపెనీలలో కాళేశ్వరం ప్రాజెక్ట్ construct చేసిన Megha Engineering and Infrastructure Limited, మరియు యశోద హాస్పిటల్ ఉండటం గమనార్హం.
2019 వ సంవత్సరంలో మేఘ కంపెనీ పై ఇన్కమ్ టాక్స్ raid జరిగింది. అలాగే 2020 లో యశోద హాస్పిటల్స్ పై ఇన్కమ్ టాక్స్ రైడ్ జరిగింది.
ఈ రైడ్స్ జరిగిన తరవాత మేఘా కంపెనీ 966 కోట్ల Electoral బాండ్ లను కొనొగోలు చేసింది మరియు యశోద హాస్పిటల్స్ 162 కోట్ల బాండ్ లను కోటం జరిగింది.
ఈ రైడ్ లకు మరియు డొనేషన్ లకు సంభంధం ఉండొచ్చు అని చాలా మంది భావిస్తున్నారు. ప్రభుత్వం రైడ్ ల ద్వారా ఒక రకంగా బ్లాక్ మెయిల్ చేస్తుందా అని కూడా న్యూస్ లలో రావటం జరుగుతుంది.
ఇవన్నీ విషయాలపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది ఎందుకంటే మొత్తం డేటా SBI సుప్రీమ్ కోర్ట్ కి సమర్పించలేదు.
షార్ట్ గా Electoral బాండ్ల ద్వారా ప్రైవేట్ కంపెనీలు, లేదా individual పర్సన్స్ తమకు నచ్చిన రాజకీయ పార్టీలకు లిమిట్ లేకుండా ఎంత మొత్తం అయినా డొనేట్ చేయవచ్చు.
ఈ డొనేషన్స్ నిజంగా ఎలాంటి ఫలితం ఆశించకుండా చేస్తున్నారా లేదా ఇన్కమ్ టాక్స్ రైడ్స్ వత్తిడి వాళ్ళ చేసున్నారా అనేది చర్చ కు సంబంచిన విషయం.