What is Cervical cancer in Telugu – సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏమిటి ?

గర్భాశయ ముఖద్వారం వద్ద క్యాన్సర్ కణాల ఎదుగుదల సర్వైకల్ క్యాన్సర్ కి కారణమవుతుంది.   

ఈ గర్భాశయ ముఖద్వారం యోనీ ను కలుపుతుంది. HPV వైరస్ కి చెందిన వివిధ రకాలు సర్వైకల్ క్యాన్సర్ కి కారణమవుతాయి. ఈ వైరస్ శృంగారంలో పాల్గొన్నప్పుడు వ్యాప్తి చెందుతుంది. 

HPV వైరస్ శరీరంలో ప్రవేశించినప్పుడు సాధారణంగా మన ఇమ్యూన్ సిస్టం వైరస్ నుంచి కాపాడుతుంది. కానీ కొన్ని సందర్భాలలో ఈ వైరస్ కొన్ని సంవత్సరాల వరకు జీవించి ఉంటుంది. ఫలితంగా గర్భాశయంలో ఉండే  కణాలు కాన్సర్ కణాలుగా మారుతాయి. 

ఎందుకు సాధారణ కణాలు క్యాన్సర్ కణాలుగా మారుతాయి ?

  మనుషుల శరీరంలో కణాలు పుడుతూ చనిపోతూ ఉంటాయి.  ఎందుకంటే కణాలలో ఉండే DNA కణాలకు సూచనలను ఇస్తుంది. ఈ సూచనల ప్రకారమే కణాలు ఎన్ని సార్లు విభజింపబడాలో నిర్ణయించబడుతుంది. 

మన శరీరంలో ఉండే కణాలు  ఒక  పరిమిత స్థాయి లో విభజింప బడుతూ  ఉంటాయి. కానీ కణాలు క్యాన్సర్ కణాలుగా మారినప్పుడు కణాలు చనిపోకుండా విభజింప బడుతూనే ఉంటాయి. ఫలితంగా ఈ కణాలు ఒక ట్యూమర్ గా మారుతాయి. 

సర్వైకల్ క్యాన్సర్ యొక్క లక్షణాలను ను డాక్టర్లు గుర్తించి సరైన వైద్యం చేసే అవకాశాలు ఉంటాయి.        

Reference: Cervical cancer – Symptoms and causes – Mayo Clinic , What Is Cervical Cancer? – NCI

Note: ఈ ఆర్టికల్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ కేవలం మీ అవగాహన కోసం మాత్రమే, ఇది డాక్టర్ లకు ప్రత్యామ్నాయం కాదు.

    

Leave a Comment