సుహానీ భట్నాగర్ జీవిత చరిత్ర – Suhani bhatnagar biography in Telugu

సుహానీ భట్నాగర్ భారతదేశానికి చెందిన చైల్డ్ ఆర్టిస్ట్. అమీర్ ఖాన్ నటించిన బ్లాక్ బాస్టర్ సినిమా అయిన దంగల్ లో అమీర్ ఖాన్ యొక్క కూతురి గా నటించారు. 

పేరు సుహానీ భట్నాగర్ 
వృత్తి చైల్డ్ ఆర్టిస్ట్
పుట్టిన తేదీ 14 జూన్ 2004
పుట్టిన స్థలం ఢిల్లీ 
తల్లి పూజా భట్నాగర్ 
తండ్రి పునీత్ భట్నాగర్
తమ్ముడు 1
మరణంఫిబ్రవరి 17 2024
సుహానీ చిన్న నాటి ఫోటో

బాల్యం మరియు కెరీర్ : 

సుహానీ 14 జూన్ 2004 వ సంవత్సరంలో ఢిల్లీ లో పునీత్ భట్నాగర్ మరియు పూజా భట్నాగర్ దంపతులకు జన్మించారు. ఈమె ఒక పంజాబీ కుటుంబానికి చెందిన వారు. సహానీ కి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. 

చిన్న తనం నుంచే సహానీ మోడల్ గా ప్రింట్ యాడ్ లలో మరియు టీవీ యాడ్ లలో పనిచేసింది. 

2016 వ సంవత్సరంలో విడుదల అయిన దంగల్ సినిమాలో అమీర్ ఖాన్ కూతురు బబితా కుమారి గా నటించి మంచి పేరును సంపాదించారు. 

ఈ సినిమాలో నటించడానికి సహానీ  స్కూల్ నుంచి 6 నెలల సెలవు తీసుకుంది. 

ఈ సినిమా తరవాత యాక్టింగ్ నుంచి బ్రేక్ తీసుకొని  చదువు పూర్తి చేసుకొని   మళ్ళీ యాక్టింగ్ కెరీర్ కొనసాగించాలని అనుకుంది.  

మరణం: 

సహానీ కి కాలు ఫ్రాక్చర్ అయ్యి ఇన్ఫెక్షన్ అయ్యింది. ఇదే విషయమై 7 వ ఫిబ్రవరి 2024 న AIIMS (ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్) లో అడ్మిట్ అయ్యారు. 

ఫిబ్రవరి 17 2024 న ఇన్ఫెక్షన్ కారణంగా సహానీ AIIMS హాస్పిటల్ లో చనిపోయారు.    

Leave a Comment