వారెన్ బఫెట్ పేరు వినగానే అందరికి స్టాక్ మార్కెట్ మరియు బిసిసినెస్ గుర్తుకు వస్తుంది. 38$ డాలర్లతో తన మొట్ట మొదటి ఇన్వెస్ట్మెంట్ ప్రారంభించిన వారెన్ బఫెట్ ప్రస్తుతం 142$ బిలియన్ డాలర్ల నికర విలువ కలిగి ఉన్నారు.
ప్రపంచంలోని టాప్ 10 అత్యంత సంపన్నులలో వారెన్ బఫెట్ ఒకరు. ప్రస్తుతం వారెన్ బఫెట్ బెర్క్‌షైర్ హాత్వే కంపెనీ యొక్క సీఈఓ గా ఉన్నారు.
చిన్నతనం నుంచే వారెన్ బఫెట్ కి బిసినెస్ మరియు షేర్ మార్కెట్ లో చాలా ఆసక్తి చూపించేవారు.
బాల్యం:
వారెన్ బఫెట్ యొక్క పూర్తి పేరు వారెన్ ఎడ్వర్డ్ బఫెట్. బఫెట్ 1930 వ సంవత్సరం ఆగస్ట్ 30 వ తేదీన అమెరికా లోని నెబ్రాస్కా స్టేట్, ఒమాహ నగరంలో జన్మించారు.
ఈయన తండ్రి హోవార్డ్ బఫ్ఫెట్ కూడా ఒక వ్యాపారవేత్త మరియు రాజకీయ నాయకుడు.
చిన్న తనం నుంచే బఫెట్ కి వ్యాపారం చేయటం చాలా ఇష్టం. 7 సంవత్సరాల వయస్సులో లైబ్రరి నుంచి “One Thousand Ways to Make $1000” అనే పుస్తకాన్ని చదివి ప్రభావితుడయ్యాడు.
బఫెట్ ఆసక్తి బిసినెస్ మరియు స్టాక్స్ లో ఉండటం కారణంగా తండ్రి కూడా బాగా ప్రోత్సహించేవాడు. 10 సంవత్సరాల వయస్సులో అమెరికా షేర్ మార్కెట్ అయిన న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్ వద్దకి కూడా తీసుకెళ్లాడు.
11 సంత్సరాల వయస్సులో తన పేరు మీద మరియు తన చెల్లెలి పేరు మీద స్టాక్స్ కొన్నాడు. కొన్న వెంటనే ఆ స్టాక్స్ యొక్క విలువ తగ్గిపోయింది . కానీ బఫెట్ వాటిని అమ్మలేదు, కొద్దీ రోజుల తరవాత ఆ షేర్స్ యొక్క విలువ పెరిగిన తరవాత బఫెట్ ఆ షేర్ లను అమ్ముతాడు.
ఇలా తన జీవితంలో చేసిన మొట్ట మొదటి ట్రేడింగ్ ద్వారా స్టాక్ మార్కెట్ లో సహనం మరియు ఓర్పు ఉండాలని గ్రహిస్తాడు.
తరవాత చిన్న చిన్న బిసినెస్ లను చేయటం మొదలుపెట్టాడు. కోకా కోలా కూల్ డ్రింక్స్ అమ్మటం, న్యూస్ పేపర్లు అమ్మటం లాంటివి చేసి డబ్బులు సంపాదించేవాడు.
హైస్కూల్ లో ఉన్నప్పుడు తన తండ్రి ఒక్క బిజినెస్ లో ఇన్వెస్ట్ చేసి 40 ఎకరాల పొలం ను కొన్నాడు.
1945 వ సంవ్సతరంలో హైస్కూల్ లో సీనియర్ గా ఉన్నప్పుడు తన స్నేహితుడి తో కలిసి 25$ ఖర్చు చేసి ఒక సెకండ్ హ్యాండ్ పిన్ బాల్ మెషిన్ ను కొని హెయిర్ కట్ చేసే షాప్ లో ఉంచాడు. వచ్చిన ఆదాయంతో ఇంకొక 3 మెషిన్ లను కొని ఇంకొక 3 షాపులలో ఉంచాడు.
ఇలా తన కాలేజీ చదువు పూర్తి అయ్యేసరికి దాదాపు 10 వేల డాలర్ల సేవింగ్స్ ఉన్నాయి.
హార్వర్డ్ బిజినెస్ స్కూల్ ఓ రిజెక్ట్ అయ్యిన తరవాత కొలంబియా బిజినెస్ స్కూల్ లో చేరుతారు. ఇక్కడ ప్రముఖ ఇన్వెస్టర్ అయిన బెంజమిన్ గ్రాహం పాఠాలు చెప్పేవాడు.
కెరీర్:
1951 నుంచి 1954 వరకు బఫెట్ తన తండ్రి కంపెనీ లోనే పనిచేశాడు. ఆ తరవాత ఇంకో రెండు కంపెనీలలో పనిచేసి 1970 లో బెర్క్‌షైర్ హాత్వే లో సీఈఓ గా చేరారు.
తాను సీఈఓ గా ఉన్న బెర్క్‌షైర్ హాత్వే కంపెనీ పలు కంపెనీలలో ఇన్వెస్ట్ చేయటం షేర్స్ కొనటం ప్రారంభించింది. చాలా తక్కువ సమయంలోనే బఫెట్ బిలియనీర్ అయ్యాడు.
వారెన్ బఫెట్ కి ఫాస్ట్ ఫుడ్ అంటే చాలా ఇష్టం, అందుకే కోకా కోలా కూల్ డ్రింక్ కంపెనీ లో ఇన్వెస్ట్ చేసాడు.
స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తరవాత కూడా బఫెట్ ఫ్లిప్ ఫోన్ ను మాత్రమే వాడేవారు.
1958 నుంచి ఒకే ఇంట్లో ఉంటున్నారు, అలాగే 50 సంవత్సరాలు ఒకటే ఆఫీస్ బిల్డింగ్ లో పనిచేసారు .
1962 లో బెర్క్‌షైర్ హాత్వే అనే టెక్స్టైల్ కంపెనీ ను కొన్నాడు. ఈ కంపెనీ కొన్న తరవాత తాను తప్పుగా నిర్ణయం తీసుకున్నాడు అని భాద పడేవాడు.
కానీ నష్టాలలో ఉన్న ఈ కంపెనీ ను తిరిగి లాభాల బాటలో పెట్టాడు. ఒక షేర్ విలువ 1400 రూపాయల నుంచి 7,000 వరకు తీసుకెళ్లాడు.
కంపెనీ యాజమాన్యం మంచిగా ఉంటె కంపెనీ లాభాల బాటలో నడుస్తుంది అని చెప్పేవారు.
బఫెట్ గురించి ఆశ్చర్య పరిచే విషయం ఏమిటంటే 94 శాతం బఫెట్ సంపద తనకు 60 సంవత్సరాలు దాటిన తరవాత సంపాదించారు.
ఫ్యామిలీ:
1952 వ సంవ్సతరంలో బఫెట్ సుసాన్ థాంప్సన్ ను పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు సంతానం. మొదటి సంతానం కూతురు రెండవ మరియు మూడవ సంతానం హోవార్డ్ మరియు పీటర్.
బఫెట్ ఇన్వెస్ట్ చేసే ప్రతి అడుగును చాలా మంది జాగ్రత్త గా గమనిస్తారు. ఒక్కసారి బఫెట్ తో భోజనం చేయాలని చాలా మంది కోరుకుంటారు.
బఫెట్ కి షేర్ మార్కెట్ మీద ఉన్న పట్టు చూసి ఈయనకు ఒరాకిల్ అఫ్ ఒమాహ (Oracle of Omaha) అనే బిరుదును కూడా ఇచ్చారు.
బఫెట్ షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయటమే కాకుండా చాలా డబ్బు చారివై లో కూడా ఇస్తూ ఉంటారు. Bill and Melinda Gates Foundation మరియు తన ముగ్గురు సనాతనం నడిపే ఫౌండేషన్ లలో డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటాడు.