నిర్మలా సీతారామన్ భారత దేశానికి చెందిన భారతీయ ఆర్థికవేత్త, రాజకీయవేత్త మరియు భారతీయ జనతా పార్టీ (బిజెపి) సీనియర్ నాయకురాలు. 2019 వ సంవత్సరం నుంచి భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిగా మరియు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిగా పనిచేస్తున్నారు.
బాల్యం:
నిర్మలా సీతారామన్ తమిళనాడు లోని మధురై లో తమిళ అయ్యంగర్ కుటుంబంలో సావిత్రి మరియు నారాయణన్ సీతారామన్ అనే దంపతులకు జన్మించారు.
తన స్కూలు చదువును విల్లుపురం,మద్రాసు మరియు తిరుచిరాపల్లి నుంచి పూర్తి చేసారు.
ఈమె 1980లో తిరుచిరాపల్లిలోని సీతాలక్ష్మీ రామస్వామి కాలేజీ లో ఆర్థికశాస్త్రం (economics)లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని పొందారు. 1984లో ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం నుండి ఆర్థికశాస్త్రంలో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని మరియు M.Phil డిగ్రీ పట్టా పొందారు.
ఆ తర్వాత ఈమె ఎకనామిక్స్ లో ఇండో-యూరోప్ వాణిజ్యంపై పిహెచ్‌డి చేయాలనుకున్నారు. కానీ అదే సమయంలో ఈమె భర్త కు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో స్కాలర్ షిప్ రావటం వల్ల పిహెచ్‌డి చేయకుండానే లండన్ కి వెళ్లారు.
పేరు | నిర్మలా సీతారామన్ |
వృత్తి | ఆర్థిక మంత్రి |
పుట్టిన తేదీ | 18 ఆగస్టు 1959 |
పుట్టిన స్థలం | తమిళనాడు, మధురై |
తల్లి | సావిత్రి |
తండ్రి | నారాయణన్ సీతారామన్ |
భర్త | ప్రభాకర్ (పెళ్లి 1986) |
పిల్లలు | 1 కూతురు |
రాయకీయ జీవితం:
నిర్మల సీతారామన్ 2008 వ సంవ్సతరంలో బీజేపీ పార్టీ లో చేరారు. 2014 వరకు నిర్మల బీజేపీ యొక్క నేషనల్ స్పోక్స్ పర్సన్ గా ఉన్నారు.
2014లో బీజేపీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత నరేంద్ర మోడీ కేబినెట్ లో జూనియర్ మినిస్టర్ గా నియమించబడ్డారు. ఇదే సంవత్సరం ఎన్. జనార్దన రెడ్డి చనిపోయిన తరవాత ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నుకోబడ్డారు.
2016 మే లో జరిగిన రాజ్యసభ ఎన్నికలలో బీజేపీ పార్టీ ఎన్నుకున్న 12 మంది సభ్యులలో నిర్మల సీతారామన్ కూడా ఒకరు. నిర్మల కర్ణాటక నుంచి పోటీ చేసి గెలిచారు.
2017 వ సంవత్సరంలో డిఫెన్సె మినిస్టర్ గా నియమించబడ్డారు. నిర్మలా సీతారామన్ నేతృత్వంలో 2019 ఫిబ్రవరి 14 న జరిగిన పుల్వామా దాడికి ప్రతీకారంగా భారత దేశ సైన్యం బాలాకోట్ వైమానిక దాడులను నిర్వహించింది.
మే 31 న 2019 వ సంవత్సరంలో నిర్మలా సీతారామన్ ఆర్థిక మరియు కార్పొరేట్ వ్యవహారాల మంత్రి గా నియమించబడ్డారు. ఈమె భారత దేశం యొక్క మొదటి ఫుల్ టైం మహిళా ఫైనాన్స్ మినిస్టర్.
నిర్మల తన మొదటి బడ్జెట్ ను జులై 5, 2019 న భారత పార్లమెంటులో సమర్పించారు.
ఫిబ్రవరి 1 2020 వ సంవత్సరంలో నిర్మల 2020–21 యూనియన్ బడ్జెట్ ను సమర్పించారు.
కరోనా మహమ్మారి సమయంలో COVID-19 ఎకనామిక్ రెస్పాన్స్ టాస్క్ ఫోర్స్ యొక్క ఇంచార్జి గా ఉన్నారు.
2024 లో రికార్డు స్థాయి లో 6 వ సారి యూనియన్ బడ్జెట్ ను సమర్పించి ఇంతకు ముందు బడ్జెట్ ను సమర్పించిన మొరార్జీ దేసాయి తో సమం చేసారు.
కొత్త పార్లమెంట్ బిల్డింగ్ లో బడ్జెట్ ను సమర్పించిన మొట్ట మొదటి మంత్రి గా నిలిచారు.
నిర్మలా సీతారామన్ లండన్ లో ఉంటున్న సమయంలో గృహాలంకరణ దుకాణం (home decor store) లో సేల్స్ పర్సన్ గా పని చేసారు.
UK లో ఉంటున్న సమయంలో అగ్రికల్చరల్ ఇంజనీర్స్ అసోసియేషన్‌లో ఎకనామిస్ట్‌కు అసిస్టెంట్‌గా పనిచేసారు. UK లో ఉంటున్నప్పుడే PricewaterhouseCoopers International Limited (PWC) కంపెనీ లో సీనియర్ మేనేజర్ గా పనిచేసారు. National Commission for Women లో సభ్యురాలిగా కూడా ఉన్నారు.
వ్యకిగత జీవితం:
జవహర్ లాల్ నెహ్రు యూనివర్సిటీ లో చదువుతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ లోని నరసాపురం కి చెందిన పరకాల ప్రభాకర్ ను కలిసారు. నిర్మలా సీతారామన్ బీజేపీ పార్టీ కు మరియు భర్త కాంగ్రెస్ పార్టీ కు మద్దతు తెలిపేవారు.
ఈ ఇద్దరు 1986 వ సంవత్సరంలో ఇద్దరూ పెళ్లిచేసుకున్నారు. ఈ ఇద్దరి దంపతులకు ఒక కూతురు ఉంది.
ఈయన భర్త ప్రభాకర్ మాజీ ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి కి communications advisor గా పనిచేసారు.
2023లో నిర్మలా సీతారామన్ ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రపంచంలోని 100 మంది అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో 32వ స్థానంలో వరుసగా ఐదవసారి చోటు దక్కించుకున్నారు.
Reference: Nirmala Sitharaman – Wikipedia