నాని జీవిత చరిత్ర – Nani biography in Telugu

నాని యొక్క పూర్తి పేరు ఘంటా నవీన్ బాబు, స్క్రీన్ పేరు ను నాని గా పెట్టుకున్నారు. 

నాని భారత దేశానికి చెందిన నటుడు మరియు నిర్మాత. ఈయన ప్రధానంగా తెలుగు సినిమాలలో నటిస్తారు. 

బాల్యం: 

నాని 24 ఫిబ్రవరి 1984 న తెలంగాణ లోని హైదరాబాద్ లో రాంబాబు ఘంటా మరియు విజయలక్ష్మి ఘంటా అనే దంపతులకు జన్మించారు.   నాని హైదరాబాద్ లోనే  పుట్టి పెరిగారు.

నాని స్కూల్ చదువును సెయింట్ అల్ఫోన్సా హై స్కూల్ నుంచి పూర్తి చేసారు. ఇంటర్మీడియట్ చదువును యస్ ఆర్ నగర్ లోని నారాయణ జూనియర్ కాలేజి నుంచి పూర్తి చేసారు. తన గ్రాడ్యుయేషన్ ను వెస్లీ కాలేజీ నుంచి పూర్తి చేసారు. 

పేరు ఘంటా నవీన్ బాబు (నాని)
వృత్తి రాజకీయ నాయకురాలు
పుట్టిన తేదీ 24 ఫిబ్రవరి 1984
పుట్టిన స్థలం హైదరాబాద్ 
తల్లి విజయలక్ష్మి ఘంటా
తండ్రి రాంబాబు ఘంటా
భార్యఅంజన ( పెళ్లి  2012)

కెరీర్: 

కాలేజీ లో ఉన్నప్పటి నుంచి నాని కి సినిమాల మీద చాలా ఆసక్తి ఉండేది.నాని తన కెరీర్ ప్రారంభంలో డైరెక్టర్ అవ్వాలని అనుకున్నారు, ప్రొడ్యూసర్ అనిల్ కుమార్ కోనేరు సహాయంతో రాధా గోపాలం (2005) సినిమాలో దర్శకుడు బాపు తో కలిసి క్లాప్ డైరెక్టర్ గా పని చేసాడు. 

అలాగే అల్లరి బుల్లోడు (2005), అస్త్రం (2006), మరియు ఢీ (2007) అనే సినిమాలలో కూడా పనిచేసారు. కొన్ని రోజులు దర్శకత్వం నుంచి సెలవు తీసుకొని సినిమా స్క్రిప్ట్ ను రాయటం ప్రారంభించారు.    

World Space Satellite లో RJ గా పనిచేస్తున్న స్నేహితుడి సలహా మేరకు నాని కూడా RJ గా ఒక సంవత్సరం పనిచేసారు. RJ గా “Non-Stop Nani” అనే ప్రోగ్రాం ను కూడా చేసేవారు. 

నాని చేసిన ఒక యాడ్ ను చూసిన తరవాత దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి అష్టా చమ్మా అనే సినిమాలో నాని కు అవకాశం ఇచ్చారు. 

ఈ సినిమాలో నాని చేసిన నటనకు గాను క్రిటిక్స్ నుంచి మంచి ప్రశంసలు  పొందారు.  

బెల్లంకొండా నిర్మాత గా తెరపైకి వచ్చిన సినిమా రైడ్ ను తన రెండవ సినిమాగా నాని చేసారు. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ లో మంచి విజయాన్ని సాధించింది. 

 మూడవ సినిమా కూడా బెల్లంకొండా నిర్మాతగా “స్నేహితుడా” అనే సినిమాలో నటించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ లో ఫెయిల్ అయ్యింది. 

2010 లో తమిళ సినిమా “వెన్నిల కబడ్డీ కుజు” రీమేక్ అయిన “భీమిలి కబడ్డీ జట్టు” సినిమాలో నటించారు.ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ లో మంచి హిట్ గా నిలిచింది. 

2011 వ సంవత్సరంలో అలా మొదలైంది, పిల్ల జమీందార్, ఈగ అనే సినిమాలలో నటించారు. 

ఈగ సినిమా బాక్స్ ఆఫీస్ లో బ్లాక్ బాస్టర్ సినిమాగా నిలిచింది. ఈ సినిమా తమిళంలో “Naan Ee” పేరు తో, హిందీ సినిమాలో “Makkhi” పేరు తో మరియు మలయాళంలో “Eecha” అనే పేరు తో సినిమా రిలీజ్ అయ్యింది.

ఇదే సంవత్సరం నాని Veppam అనే తమిళ సినిమా చేసి కోలీవుడ్ లో డెబ్యూ చేసారు. 

2012వ సంవత్సరంలో ” ఏటో వెళ్ళిపోయింది మనసు” సినిమా లో నటించారు. ఈ సినిమా కి బాక్స్ ఆఫీస్ లో  కూడా మంచి స్పందన లభించింది. 

2014 లో పైసా, ఆహా కళ్యాణం అనే సినిమాలలో మరియు 2015 లో జండా పై కపిరాజు అనే సినిమాలో నటించారు. ఈ మూడు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ లో అంతగా బిసినెస్ చెయ్యలేదు.   

2015 లో ఎవడే సుబ్రహ్మణ్యం మరియు భలే భలే మగాడివోయ్ అనే సినిమాలలో నటించారు.       

భలే భలే మగాడివోయ్ సినిమా బాక్స్ ఆఫీస్ లో బ్లాక్ బాస్టర్ సినిమాగా నిలిచింది. 

2016 వ సంవత్సరంలో కృష్ణ గాడి వీర ప్రేమ గాధ, జెంటిల్‌మన్, మజ్ను అనే సినిమాలలో నటించారు. 

 2017 లో నేను లోకల్, నిన్ను కోరి, మిడిల్ క్లాస్ అబ్బాయి అనే సినిమాలలో నటించారు. 

2018 లో కృష్ణార్జున యుద్ధం, దేవదాసు అనే సినిమాలలో నటించారు. 2019 లో జెర్సీ, గ్యాంగ్ లీడర్ అనే సినిమాలలో నటించారు. 

2020 లో V, టక్ జగదీష్ అనే సినిమాలలో నటించారు. ఈ రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ లో అంతగా సక్సెస్ అవ్వలేదు. 

2021 వ సంవత్సరంలో శ్యామ్ సింఘా రాయ్ అనే సినిమా లో నటించారు. 2022 వ సంవత్సరంలో అంటే సుందరానికి, హిట్: ది సెకండ్ కేస్ అనే రెండు సినిమాలలో నటించారు. 

2023 లో దసరా అనే సినిమాలో నటించాడు, ఈ సినిమా ఇండియా లో 115   కోట్లు సంపాదించింది, బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. 

ఇదే సంవత్సరం హాయ్ నాన్నా అనే సినిమాను చేసారు. ఈ సినిమా తమిళ, మలయాళ, కన్నడ మరియు హిందీ భాషలలో రిలీజ్ అయ్యింది.       

ఫిబ్రవరి 24, 2024 నాని పుట్టిన రోజు “సరిపోధా శనివారం” అని సినిమాను టీజర్ ను విడుదల చేసారు. 

వ్యక్తిగత జీవితం: 

ఐదు సంవత్సరాలు ప్రేమించుకున్న తరవాత 2012లో నాని అంజనను పెళ్లి చేసుకున్నారు. 

2017 లో ఇద్దరు దంపతులకు ఒక కొడుకు పుట్టాడు.    

Leave a Comment