ఉర్ఫీ జావేద్ జీవిత చరిత్ర – Urfi Javed biography in Telugu

ఉర్ఫీ జావేద్ భారత దేశానికి చెందిన టీవీ నటి మరియు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సుర్. సోషల్ మీడియా లో ఉర్ఫీ జావేద్ చేసే భిన్నమైన ఫ్యాషన్ సెన్స్ వళ్ళ వైరల్ సెలబ్రిటీ గా మారారు. ఉర్ఫీ టీవీ సీరియల్స్ తో పాటు పలు రియాలిటీ షోలు కూడా చేసారు.

బాల్యం:

ఉర్ఫీ జావేద్ 15 అక్టోబర్ 1997 వ సంవత్సరంలో ఉత్తర ప్రదేశ్ లోని లక్నో నగరంలో ఇఫ్రూ జావేద్ మరియు జకియా సుల్తానా అనే దంపతులకు ఒక ముస్లిం కుటుంబంలో జన్మించారు.

ఉర్ఫీ కి ఉరుసా, అస్ఫీ మరియు డాలీ జావేద్ అనే ముగ్గురు అక్క చెల్లెల్లు మరియు ఒక తమ్ముడు సమీర్ అస్లాం ఉన్నారు.

చిన్న తనంలో చాలా చేదు అనుభవాలను చవి చూసింది. ఉర్ఫీ తండ్రి తన తల్లి ని మరియు తన తోబుట్టువులతో అసభ్యంగా ప్రవర్తించేవాడు.

పేరు ఉర్ఫీ జావేద్
వృత్తి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సుర్
పుట్టిన తేదీ 15 అక్టోబర్ 1997 
పుట్టిన స్థలం ఉత్తర ప్రదేశ్
తల్లి జకియా సుల్తానా
తండ్రి ఇఫ్రూ జావేద్
తోబుట్టువులుఉరుసా, అస్ఫీ, డాలీ జావేద్, మరియు సమీర్ అస్లాం 

కెరీర్:

2016 వ సంవత్సరంలో సోనీ టీవీ సీరియల్ అయిన బడే భయ్యా కి దుల్హనియా (Bade Bhaiyya Ki Dulhania) లో నటించి తన కెరీర్ ను మొదలుపెట్టింది. ఆ తరవాత సంవత్సరం లో స్టార్ ప్లస్ సీరియల్స్ అయిన చంద్ర నందిని మరియు మేరి దుర్గ అనే సీరియల్స్ లలో నటించారు.

2018 వ సంవత్సరంలో SAB టీవీ సీరియల్ అయిన సాత్ ఫేరో కి హేరా ఫెరీ (Saat Phero Ki Hera Pherie) అనే సీరియల్ లో కామిని జోషి క్యారెక్టర్ ను, కలర్స్ TV యొక్క బేపన్నా (Bepannaah) లో బెల్లా కపూర్ గా , స్టార్ భారత్ సీరియల్ అయిన జిజి మా (Jiji Maa) లో పియాలి మరియు &TV సీరియల్ అయిన దయాన్‌లో నందిని పాత్రలను పోషించారు.

2020 వ సంవత్సరంలో యే రిష్తా క్యా కెహ్లతా హై (Yeh Rishta Kya Kehlata Hai) లో శివాని భాటియా పాత్ర మరియు యే రిష్తా క్యా కెహ్లతా హై (Kasautii Zindagii Kay) సీరియల్ లో తనీషా చక్రవర్తి అనే పాత్రను చేసారు.

2021 వ సంవత్సరంలో voot రియాలిటీ షో అయిన బిగ్ బాస్ OTT లో పాల్గొన్నారు. ఈ షో లో ఈమె 13 వ స్థానంలో నిలిచింది.

తన భిన్నమైన ఫ్యాషన్ సెన్స్ వల్ల బిగ్ బాస్ లో చాలా ఫేమస్ అయ్యారు. 2022 లో సింగర్ కున్వార్ తో కలిసి బేఫిక్రే అనే మ్యూజిక్ వీడియో చేసింది.

డిసెంబర్ 2022 లో MTV రియాలిటీ షో అయిన MTV Splitsvilla 14 లో గెస్ట్ కంటెస్టెంట్ గా పాల్గొన్నారు.

2023 లో మీడియా నుంచి ఉర్ఫీ దుబాయ్ లో షూటింగ్ చేస్తున్నప్పుడు రెచ్చగొట్టే విధంగా దుస్తులు ధరించిందని దుబాయ్ లో నిర్బంధించారు అని సమాచారం వచ్చింది. కానీ తర్వాత ఉర్ఫీ ఈ విషయం పై మాట్లాడుతూ పర్మిషన్ లేనందుకు అలా జరిగిందని ఆ మరుసటి రోజు షూటింగ్ యదావిధి గా కొనసాగిందని చెప్పారు.

వ్యక్తిగత జీవితం:

ఉర్ఫీ జావేద్ సాంప్రదాయ ముస్లిం కుటుంబంలో పెరిగినప్పటికీ ఒకసారి తన మతం గురించి మాట్లాడుతూ ఇలా అన్నారు ” నేను ఇస్లాం మతాన్ని అనుసరించను మరియు ఇతర ఏ మతాన్ని కూడా పాటించను” అని చెప్పారు.

2021 లో తన పెళ్లి గురించి మాట్లాడుతూ తాను ముస్లిం అబ్బాయిని పెళ్లి చేసుకోనని మరియు తాను భగవద్గీత కూడా చదవటం మొదలుపెట్టానని చెప్పారు.

2022 లో Urfi Javed సోషల్ మీడియా మాధ్యమం ద్వారా తన పేరును Uorfi గా మార్చుకుంటున్నట్లు చెప్పారు. ఈ రెండు పేర్లు పలకడానికి ఒకేలా ఉన్న తనను కొత్త పేరు తోనే పిలవాలని కోరారు. న్యూమరాలజీ ప్రకారమే తన పేరును మార్చనని చెప్పారు.

ఉర్ఫీ మన నిత్య జీవితంలో ఉపయోగించే వస్తువులైన రేజర్ బ్లేడ్, వైర్, పువ్వులు, చూయింగ్ గమ్ డ్రెస్ లు ధరించి ఎప్పుడు ట్రేండింగ్ లో ఉంటారు.

బిగ్ బాస్ OTT లో ఉన్నప్పుడు కూడా నల్లటి గార్బేజ్ కవర్ తో చేసిన డ్రెస్ ను ధరించి న్యూస్ లో ట్రెండ్ చేసారు.

ఒక ఇంటర్వ్యూ లో ఉర్ఫీ తన డ్రెస్సింగ్ గురించి మాట్లాడుతూ తానూ ఇన్ని రోజులు అప్పు తీసుకొని తన టీం తో కలిసి 1BHK ఫ్లాట్ లోనే కొత్త కొత్త ఫ్యాషన్ లను తయారు చేసేవారు అని చెప్పారు.

ఇప్పుడు బ్రాండ్స్ తో కలిసి పనిచేస్తున్నపటినుంచి డబ్బులు వస్తున్నాయని అందుకే కొత్త ఇంట్లో షిఫ్ట్ అయ్యారు అని చెప్పారు.

2022 వ సంవత్సరంలో ASIA లో గూగుల్ లో ఎక్కువగా సెర్చ్ చేసిన సెలెబ్రిటీ లలో ఒకరిగా నిలిచారు. బాలీవుడ్ కి చెందిన తారలు అయిన జాన్వీ కపూర్ మరియు దిశా పటానీ కన్నా ఎక్కువగా ఉర్ఫీ ను సెర్చ్ చేయటం గమనార్హం.

చూయింగ్ గమ్ డ్రెస్ తో ఉర్ఫీ జావేద్

Reference: Urfi Javed – Wikipedia

Leave a Comment