జి. లాస్య నందిత జీవిత చరిత్ర – G. Lasya Nanditha Biography in Telugu

జి. లాస్య నందిత భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రానికి  చెందిన రాజకీయ నాయకురాలు మరియు MLA.  

బాల్యం:

లాస్య నందిత 1996 వ సంవత్సరంలో  జి. సాయన్న మరియు జి గీతలకు జన్మించారు. ఈమెకు నమ్రత మరియు నివేదిత అనే ఇద్దరు సోదరీమణులు ఉన్నారు.

పేరు జి. లాస్య నందిత
వృత్తి రాజకీయ నాయకురాలు
పుట్టిన తేదీ 1996 
పుట్టిన స్థలం హైదరాబాద్ 
తల్లి జి గీత
తండ్రి జి. సాయన్న (MLA)
సోదరీమణులు నమ్రత మరియు నివేదిత
మరణం23 ఫిబ్రవరి 2024 

కెరీర్: 

2016 వ సంవత్సరంలో కవాడిగూడ కార్పొరేటర్ గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 

లాస్య తండ్రి  జి. సాయన్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ కి చెందిన సిట్టింగ్ MLA. ఫిబ్రవరి 2023 వ సంవత్సరంలో కిడ్నీ కి సంబంధించిన వ్యాధి తో 72 సంవత్సరాల వయస్సులో ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో మృతి చెందారు.       

2023 వ సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో BRS పార్టీ తరపున  సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. 

బీజేపీ పార్టీ నుంచి పోటీ చేసిన N . గణేష్ ను 17,169 ఓట్లతో లాస్య  ఓడించారు. 

మరణం: 

లాస్య  23 ఫిబ్రవరి 2024 న హైదరాబాద్ లో ఒక రోడ్ ఆక్సిడెంట్ లో చనిపోయారు. 

లాస్య ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ కు గుద్దుకోవటం కారణంగా చనిపోయారు. 

ప్రమాదం సమయంలో లాస్య తన స్నేహితుడు ఆకాష్ తో కలిసి ప్రయాణిస్తున్నారు. ఆ సమయంలో ఆకాష్ కారు ను నడుపుతున్నాడు. 

ప్రమాదం తరవాత లాస్య ను వెంటనే హాస్పిటల్ కి తీసుకువెళ్లడం జరిగింది. కానీ డాక్టర్లు ఆమె హాస్పిటల్ కి రాకముందే చనిపోయిందని చెప్పారు.     

లాస్య BRS నేతలతో కలిసి దిగిన ఫోటో

   

Leave a Comment