హెల్లో ఫ్రెండ్స్ నేను ముందుగా నా గురించి చెప్పి ఆ తరవాత ఈ వెబ్ సైట్ గురించి చెబుతాను.
నేను మొదటి నుంచి గొప్ప వాళ్ళ కథలు వారి జీవితం ను చుసిన తరవాత చాలా ప్రభావితుడయ్యాను. వారు చేసే శ్రమ పట్టుదల నన్ను ఎప్పుడూ ప్రేరేపించాయి. ప్రతీ గొప్ప వ్యక్తి వెనకాల ఒక పోరాటం ఉంటుంది. వారి గమ్యంలో వచ్చే వడి దుడుకలను ఎలా ఎదుర్కొన్నారో తెలుసుకున్నాకా నా జీవితం కూడా అలాగే గొప్పగా తీర్చి దిద్దాలని అనుకున్నాను.
నేను ప్రస్తుతం ఒక ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాను. ఉద్యోగం అయ్యాక ఖాళీ సమయం వృధా చేయవద్దని ఒక మంచి పని కోసం సమయాన్ని ఉపయోగించాలని ఈ వెబ్ సైట్ ను ప్రారంభించాను.
ఈ రోజులలో ఇంగ్లీష్ భాష అనే కాకుండా ప్రతీ భాషలో వెబ్ సైట్ లు తయారు అవ్వటం ప్రారంభమయ్యాయి. తెలుగు భాష లో కంటెంట్ ఈ రోజుల్లో ఎక్కువగా రాయటం మొదలయ్యింది.
ఇంగ్లీష్ భాష లో గొప్ప వారి జీవిత చరిత్రలు ఉన్నాయి కానీ తెలుగు భాషలో వెబ్ సైట్ ను రాయటం తెలుగు రాష్ట్రాలకు ఉపయోగపడుతుందని నా అభిప్రాయం.
ఇప్పుడు ఈ వెబ్ సైట్ గురించి చెబుతాను. ఈ వెబ్సైటు లో టాలీవుడ్ నుంచి హాలీవుడ్ దాకా సెలెబ్రిటీల జీవితాన్ని గురించి, స్పోర్ట్స్ కి సంబంచిన మరియు చరిత్రలో నిలిచిన గొప్ప వ్యక్తుల గురించి చదవచ్చు.
మీరు ఏదైనా సలహా ఇవ్వాలనుకుంటే Contact us లోకి కాంటాక్ట్ చేయవచ్చు.