పూనమ్ పాండే జీవిత చరిత్ర – Poonam Pandey biography in Telugu

పూనమ్ పాండే భారతదేశానికి చెందిన మోడల్ మరియు నటి.

బాల్యం:

పూనమ్ పాండే 11వ మార్చి 1991 వ సంవత్సరంలో కాన్పూర్ లో శోభనాథ్ పాండే మరియు విద్యా పాండే దంపతులకు జన్మించారు. ఈమెకు ఒక సోదరి శ్రద్ధా పాండే మరియు సోదరుడు నీలేష్ పాండే ఉన్నారు.

2010 వ సంవత్సరంలో గ్లాడ్రాగ్స్ మాన్‌హంట్ మరియు మెగా మోడల్ పోటీలో పాల్గొని పూనమ్ మోడలింగ్ లో తన కెరీర్ ను ప్రారంభించారు. పూనమ్ పలు మ్యాగజిన్ కవర్ లపై ఫీచర్ అవ్వటం జరిగింది.

పేరు పూనమ్ పాండే
వృత్తి ఎరోటిక్ మోడల్, నటి
పుట్టిన తేదీ 11మార్చి, 1991
పుట్టిన స్థలం కాన్పూర్ 
తల్లి విద్యా పాండే 
తండ్రి శోభనాథ్ పాండే
తోబుట్టువులు శ్రద్ధా పాండే, నీలేష్ పాండే 
భర్త సామ్ బాంబే (పెళ్లి 2020 ,విడాకులు 2021)

మీడియా లో పాపులర్:

పూనమ్ పాండే సోషల్ మీడియా లో సంచలన పోస్టులు చేసి ఎల్లప్పుడూ ట్రేండింగ్ లో ఉండేవారు. అర్ధ నగ్న ఫోటోలు తన సోషల్ మీడియా లో షేర్ చేయటం వల్ల కూడా చాలా తక్కువ సమయంలో పాపులర్ అయ్యారు .
పూనమ్ పాండే తన న్యూడ్ ఫోటోలు మరియు వీడియోల కోసం ప్లే స్టోర్ లో ఒక ఆప్ ను తయారు చేసుకున్నారు కానీ ఆప్ మొదలైన కొద్ది రోజులకే గూగుల్ పూనమ్ ఆప్ ను బ్యాన్ చేయటం జరిగింది.

తరవాత పూనమ్ తన సొంత వెబ్ సైట్ ను తయారు చేసి అందులో వీడియోలు అప్లోడ్ చేయటం మొదలుపెట్టారు.

2011 వ సంవత్సరంలో క్రికెట్ వరల్డ్ కప్ జరుగుతున్న సమయంలో ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే పూనమ్ తన బట్టలను విప్పేస్తానని చెప్పారు.
కానీ బీసీసీఐ ఇలా చేయటానికి అనుమతి ఇవ్వలేదని అని పూనమ్ చెప్పడం జరిగింది.

అదే రోజురాత్రి వాంఖడే స్టేడియం లో పూనమ్ తన బట్టలు విప్పుతున్న వీడియో అప్లోడ్ చేసారు.

2012 లో జరిగిన IPL టోర్నమెంట్ లో కోల్ కత్తా నైట్ రైడర్స్ గెలిచినప్పుడు కూడా న్యూడ్ గా పోజ్ చేయటం జరిగింది.

పూనమ్ తన బాయ్ ఫ్రెండ్ తో శృంగారంలో పాల్గొంటున్న వీడియో ను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసి తరవాత డిలీట్ చేసారు.

పూనమ్ ప్రస్తుతం కూడా తన న్యూడ్ వీడియోలను సబ్ స్క్రిప్షన్ పద్దతి ద్వారా పోస్ట్ చేస్తూ ఉంటారు.

సినిమా కెరీర్:

2013 వ సంవత్సరంలో బాలీవుడ్ లో విడుదల అయిన నషా (Nasha) సినిమాలో లీడ్ రోల్ లో నటించారు. ఈ సినిమా తయారు చేయటానికి 4 కోట్లు ఖర్చు పెడితే బాక్స్ ఆఫీస్ వద్ద 8 కోట్లు సంపాదించింది.

ఈ సినిమాలో పూనమ్ ఒక టీచర్ రోల్ ను చేసింది, ఈ సినిమాలో టీచర్ రోల్ లో ఉన్న పూనమ్ తన స్టూడెంట్ తో నే రిలేషన్ షిప్ లో ఉంటుంది.

ఈ సినిమా పోస్టర్ లో కూడా పూనమ్ నగ్నంగా రెండు ప్లా కార్డు లతో తన బాడీ ను కవర్ చేసుకుంటుంది.

ఈ పోస్టర్ చాలా అసభ్యంగా ఉందని సినిమాకి వ్యతిరేకంగా శివసేన తరపు నుంచి నిరసనలు చేయటం జరిగింది.

వ్యక్తిగత జీవితం :

పూనమ్ తన బాయ్ ఫ్రెండ్ అయిన సామ్ బాంబే ను 1వ సెప్టెంబర్ 2020వ సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు.

కరోనా వైరస్ పాండెమిక్ కారణంగా ఇంటి వద్దనే పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లి లో దగ్గరి చుట్టాలు మాత్రమే వచ్చారు. 11 వ సెప్టెంబర్ రోజున పూనమ్ తన భర్త ఐన సామ్ బాంబే తనను ఆమెను వేధించాడు, బెదిరించాడు మరియు దాడి చేశాడు అని కేసు పెట్టింది.

23 వ సెప్టెంబర్ రోజున సామ్ బాంబే ను పోలీసులు గోవా లో అరెస్ట్ చేసారు. అరెస్ట్ అయిన కొద్దీ రోజులకు సామ్ బాంబే బెయిల్ పై విడుదల అయ్యి బయటికి వచ్చారు.

ఈ ఘటన చూసిన చాలా మంది పూనమ్ ఇది కేవలం పబ్లిసిటీ స్టంట్ కోసం చేసిందని పేర్కొన్నారు.

5 వ నవంబర్ 2020 లో నార్త్ గోవా లో గవర్నమెంట్ స్థలం పై నగ్నంగా వీడియో షూట్ చేసినందుకు అరెస్ట్ అయ్యారు.

18 జనవరి 2022 సంవత్సరంలో, పలు బాలీవుడ్ తారలు పోర్న్ ఫిల్మ్ రాకెటింగ్ కుంభకోణం సమయంలో పూనమ్ పై కూడా ఆరోపణలు రావటం తో సుప్రీమ్ కోర్ట్ ఈమెకు ప్రొటెక్షన్ ఇవ్వటం జరిగింది.

సినిమాలే లేకుండా TV షోస్ లో కూడా పూనమ్ నటించింది. 2011 లో Fear Factor: Khatron Ke Khiladi 4 లో 11 వ స్థానంలో నిలిచారు. 2022 లో Lock Upp అనే షో లో పాల్గొని 7 వ స్థానంలో నిలిచారు.

కాంట్రవర్సీ:

పూనమ్ ఎల్లప్పుడూ కాంట్రవర్సీ లో ఉంటారు. 2024 వ సంవత్సరం ఫిబ్రవరి 2 వ తారీకున పూనమ్ మేనేజర్ సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్ అయిన ఇంస్టాగ్రామ్ లో 32 సంవత్సరాల పూనమ్ సర్వైకల్ కాన్సర్ కారణంగా చనిపోయిందని పోస్ట్ పెట్టారు.

మీడియా అంతటా న్యూస్ రావటం మొదలైంది. ఆమె ఫ్యాన్స్ మరియు మీడియా ఈ విషయాన్ని జీర్ణించుకోలేదు. ఒక్క రోజు తరవాత ఫిబ్రవరి 3 వ తారీఖున ఇంస్టాగ్రామ్ లో నేను బ్రతికే ఉన్నానని, కేవలం సర్వైకల్ క్యాన్సర్ గురించి అందరిలో అవహగాన తీసుకురావటానికి ఇలా చేసానని చెప్పారు.

ఈ వీడియో తరవాత చాలా మంది పూనమ్ పాండే పై ఫైర్ అయ్యారు. ఇది ఒక చీప్ పబ్లిసిటీ స్టంట్ అని చెప్పారు.

Reference: Poonam Pandey – Wikipedia

Leave a Comment