What is Artificial intelligence in Telugu – ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏమిటి ?

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనగానే మన మెదడు రోబోట్స్ మరియు అడ్వాన్స్డ్  కంప్యూటర్ల గురించి ఆలోచించటం మొదలుపెడుతుంది. ఈ ఆర్టికల్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి వివరంగా చదువుదాము. 

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క పదానికి అర్థం కృత్రిమ మేధస్సు, ఒక మనిషి చేసే పనులను ఒక మెషీన్ లేదా కంప్యూటర్ చేయాలంటే కావలసిన మేధస్సునే కృత్రిమ మేధస్సు లేదా  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అంటారు. 

ఉదాహరణకి మనుషులు తమ కళ్ళతో పరిసర ప్రాంతాలను గుర్తించినట్టు గుర్తించటం (visual perception),  మనుషుల లాగా మాట్లాడే భాషను అర్థం చేసుకోవటం (speech recognition), నిర్ణయాలను తీసుకోవటం (decision-making). ఇలా మనుషులు తమ రోజువారీ జీవితంలో చేసే పనులను మరియు మనుషులు కూడా చేయలేని కొన్ని క్లిష్టమైన పనులను కృత్రిమంగా ఉన్న మేధస్సుతో చేసే మెషీన్ లను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అంటారు. 

AI పితామహుడు ఎవరు ?

Artificial intelligence కంప్యూటర్ సైన్స్ కి చెందిన ఒక ఫీల్డ్. దీనిని షార్ట్ గా AI అని అంటారు.  John McCarthy (జాన్ మెక్‌కార్తీ) ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పితామహుడిగా  పరిగణిస్తారు.  

AI మనకు ఎందుకు కావాలి ?

AI క్లిష్టమైన పనులను తక్కువ సమయంలో చాలా వేగంగా మరియు ఖఛ్చితత్వంతో సమర్థవంతంగా చేస్తుంది. సాధారణంగా మనుషులు చేసే పనులను ఆటోమేట్ చేయటానికి AI సహాయం చేస్తుంది. 

AI యొక్క వివిధ రకాలు ఏమిటి?

AI లో ముఖ్యంగా 3 రకాలు ఉంటాయి 1) నారో AI (Narrow AI) 2) జనరల్ AI (General AI) 3) సూపర్ AI (super AI). 

నారో AI (Narrow AI):

నారో AI కేవలం ఒక ప్రత్యేక గోల్ ను పూర్తి చేయడానికి నిర్మించబడుతుంది. ఈ నారో AI ను వీక్ AI అని కూడా అంటారు.

ఉదాహరణకి విర్చువల్ అస్సిస్టెంన్స్ (virtual assistants), image recognition (ఇమేజ్ రికగ్నిషన్).

ఈ రకమైన AI మనుషుల లాగా ఆలోచించటం మరియు పనులను పూర్తి చేయటంలో వచ్చే చిన్న చిన్న తప్పులను సరి చేయలేదు.

జనరల్ AI (General AI):

జనరల్ AI మనుషుల లాగానే ఆలోచించటం, నేర్చుకోవటం మరియు పనులను పూర్తిచేస్తాయి. ఈ AI ను స్ట్రాంగ్ AI అని కూడా అని అంటారు.

క్లిష్టమైన మరియు కష్టతరమైన పనులను సమర్థవంతంగా పూర్తిచేస్తాయి.

ఉదాహరణకి ఆల్ఫా గో (AlphaGo), సిరి (Siri), మరియు చాట్ జిపిటి (ChatGPT)

సూపర్ AI (Super AI):

సూపర్ AI మనుషుల మేధస్సు ను కూడా అధిగమించే శక్తి కలిగి ఉంటుంది. కొంత మంది శాస్త్రవేత్తల ప్రకారం ఈ AI మనుషులను ఏలుతుంది.

ప్రస్తుతానికి ఇలాంటి AI లేదు, ఇలాంటి AI కూడా భాష్యత్తులో రావచ్చు అని శాత్రవేత్తల ఒక అంచనా అని చెప్పవచ్చు.

కేవలం సినిమాలలో మాత్రమే AI మనుషుల మేధస్సును అధిగమించింది అని చూపియ్యటం జరిగింది.

ఉదాహరణకి హాలీవుడ్ లో విడుదల అయిన టర్మినేటర్ (Terminator) సినిమా.

AI లో ఉండే ముఖ్యమైన subfield లు ఏమిటి ?

AI లో 6 ముఖ్యమైన ఉపక్షేత్రాలు (subfield) ఉంటాయి.

1) మెషిన్ లెర్నింగ్ (Machine Learning)

2) న్యూరల్ నెట్వర్క్ (Neural Network)

3) నాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ (Natural Language Processing)

4) డీప్ లెర్నింగ్ (Deep Learning)

5) కాగ్నిటివ్ కంప్యూటింగ్ (Cognitive Computing)

6) కంప్యూటర్ విజన్ (Computer Vision)

AI వల్ల కలిగే నష్టాలు ఏమిటి?

AI రొటీన్ గా మరియు రిపీట్ అయ్యే పనులను చేయటం వల్ల చాలా మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు.

ఉదాహరణకి కస్టమర్ సర్వీస్ రెప్రజన్ టేటివ్, మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ఉద్యోగాలు మరియు డ్రైవింగ్ ఉద్యోగాలను AI చేయటం మొదలుపెడుతుంది. ఫలితంగా మనుషులు ఉద్యోగాలు కోల్పోతారు.

Leave a Comment