అమ్రితా అయ్యర్ భారతదేశానికి చెందిన నటి. ఈమె ప్రధానంగా తమిళ మరియు తెలుగు సినిమాలలో నటిస్తారు.
బాల్యం:
అమ్రితా 14 మే 1994 వ సంవత్సరంలో తమిళనాడు లోని చెన్నై లో జన్మించారు.
అమ్రితా చెన్నై లో పుట్టినా కర్నాటకా రాష్ట్రం లోని బెంగళూరు లో పెరిగి పెద్దయ్యారు.
ఈమె సెయింట్ జోసెఫ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ నుంచి బ్యాచిలర్ అఫ్ కామర్స్ డిగ్రీ ను సంపాదించారు.
చదువు పూర్తి చేసుకున్న తరవాత మోడల్ గా పనిచేసి తర్వాత యాక్టింగ్ లో తన కెరీర్ ను ప్రారంభించారు.
కెరీర్:
అమ్రితా 2012 నుంచి 2016 వరకు పలు సినిమాలలో నటించారు. 2018 లో మొదటి సారి లీడ్ రోల్ లో తమిళ సినిమా అయిన పడైవీరన్ (Padaiveeran) అనే సినిమాలో నటించారు.
2019 లో కన్నడ సినిమా అయిన గ్రామయాన (Gramayana) అనే సినిమాలో నటించే అవకాశం లభించింది కానీ ప్రొడ్యూసర్ కి కోవిద్ రావటం కారణంగా ఆ సినిమా చేయలేదు.
2021 వ సంవత్సరంలో రామ్ పోతినేని సరసన రెడ్ (RED) సినిమా చేసి తెలుగు ఇండస్ట్రీ లో అరంగేట్రం చేసారు.
డిసెంబర్ 2022 లో అమ్రితా అయ్యర్ సూపర్ హీరో సినిమా అయిన హను మాన్ లో నటించడం ప్రారంభించారు. ఈ సినిమా జనవరి 12, 2024 న సంక్రాంతి సందర్భంగా విడుదల కానుంది.
అమ్రితా అయ్యర్ నటించిన సినిమాలు:
సంవత్సరం | సినిమా |
2012 | Padmavyooham – పద్మవ్యూహం |
2014 | Tenaliraman – తెనాలిరామన్ |
2014 | Lingaa – లింగా |
2015 | Yatchan – యచ్చన్ |
2016 | Pokkiri Raja – పొక్కిరి రాజా |
2016 | Theri – తేరి |
2018 | Padaiveeran – పడైవీరన్ |
2018 | Kaali – కాళీ |
2019 | Bigil – బిగిల్ |
2021 | Red – ఎరుపు |
2021 | 30 Rojullo Preminchadam Ela – 30 రోజుల్లో ప్రేమించడం ఎలా |
2021 | Vanakkam Da Mappilei – వణక్కం దా మాప్పిలే |
2021 | Lift – ఎత్తండి |
2021 | Arjuna Phalguna – అర్జునుడు ఫాల్గుణ |
2022 | Coffee with Kadhal – కాదల్ తో కాఫీ |
2024 | Hanu Man – హను మాన్ |
Source: Amritha Aiyer – Wikipedia