Shanmukh Jaswanth biography in Telugu – షణ్ముఖ్ జస్వంత్ జీవిత చరిత్ర

షణ్ముఖ్ జస్వంత్ యొక్క పూర్తి పేరు షణ్ముఖ్ జస్వంత్ కాండ్రేగుల. 

షణ్ముఖ్ భారతదేశానికి చెందిన ఒక యూట్యూబర్ మరియు నటుడు. ఫిబ్రవరి 2024 నాటికి షణ్ముఖ్ 4.99 మిలియన్ల సబ్స్క్రైబర్లు ఉన్నారు. 

బాల్యం:

షణ్ముఖ్ జస్వంత్ 16వ సెప్టెంబర్ 1994 వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని విశాఖపట్టణం నగరంలో జన్మించారు.   

షణ్ముఖ్ తన గ్రాడ్యుయేషన్ ను BBA లో విశాఖపట్టణం లోని గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ నుంచి పూర్తి చేసాడు. 

వైరల్ వీడియో వైవా ను షణ్ముఖ్ అన్నయ్య వినయ్ షణ్ముఖ్  మరియు శబరీష్ కాండ్రేగుల డైరెక్ట్ చేసారు. ఈ వైరల్ వీడియో లో షణ్ముఖ్ కామెడీ రోల్ ను చేసాడు. 

షణ్ముఖ్ చాలా షార్ట్ ఫిల్మ్స్ లో కామెడీ  పాత్రలను చేసాడు. తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 లో రన్నర్ అప్ (రెండవ స్థానంలో) గా నిలిచాడు. 

కెరీర్: 

షణ్ముఖ్ తన యూట్యూబ్ కెరీర్ ను 2013 లో వైరల్ అయిన వీడియో వైవా ద్వారా ప్రారంభించాడు. ఈ వీడియో లో “షన్ను” అనే పేరు తో చేసిన పాత్రనే మంచి పేరు ను ఇచ్చింది.     

షణ్ముఖ్ తన సొంత యూట్యూబ్ ఛానెల్ ను 2012 వ సంవత్సరంలో ప్రారంభించాడు. ఛానల్ ప్రారంభించిన కొత్తలో షార్ట్ ఫిలిమ్స్, డాన్స్ కవర్లు మరియు కామెడీ వీడియోలు చేసేవాడు. 

ఇన్ఫినిటమ్ మీడియా ప్రొడక్షన్ లో షార్ట్ ఫిలిమ్స్ మరియు  సిరీస్ లను చేసాడు. తన ఛానల్ లో వీడియోలో చేస్తూ వైవా ఛానల్ లో కూడా కామెడీ వీడియోలు చేసేవాడు. The Software DevLOVEper అనే యూట్యూబ్ సిరీస్ లో షన్ను అనే పాత్ర ను చేసాడు. ఈ సిరీస్ షణ్ముఖ్ కి మంచి పేరును తీసుకువచ్చింది. 

ఈ సిరీస్ సక్సెస్ తరవాత పలు టీవీ షో లలో కనిపించాడు. 16 ఫిబ్రవరి 2021 వ సంవత్సరంలో పాపులర్ సిరీస్ సూర్య సిరీస్ ను చేసాడు. 

వ్యక్తిగత జీవితం: 

ఫిబ్రవరి 22, 2024 లో షణ్ముఖ్ సోదరుడి పై ఒక అమ్మాయి చీటింగ్ కేసు పెట్టడం జరిగింది. ఆ కేసు విచారణలో పోలీసులు విచారిస్తున్నప్పుడు షణ్ముఖ్ వద్ద 16 గ్రాముల గాంజా దొరికింది. షణ్ముఖ్‌పై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డిపిఎస్) చట్టం కింద కేసు నమోదు చేశారు.       

Reference: Shanmukh Jaswanth – Wikipedia

Leave a Comment