సుజానే బెర్నెర్ట్ జీవిత చరిత్ర – Suzanne Bernert biography in Telugu

సుజానే బెర్నెర్ట్ జర్మనీకి చెందిన నటి. ఈమె ప్రధానంగా ఇండియా కి చెందిన వివిధ బాషలలో నటిస్తుంది. సుజానే ఫ్రెంచ్, ఇటాలియన్, ఇంగ్లీష్, జర్మన్, స్పానిష్, హిందీ, మరాఠీ మరియు బెంగాలీ భాషలలో మాట్లాడగలదు.

 ఈ నటి సోనియా గాంధీ క్యారెక్టర్ ను ఒక టీవీ సీరియల్ (7 RCR) లో మరియు ఒక హిందీ సినిమా The Accidental Prime Minister లో చేసారు. 2024 లో విడుదల అయిన సినిమా యాత్ర 2 (Yatra 2) లో కూడా సోనియా గాంధీ పాత్రను చేసారు. 

బాల్యం :

బెర్నెర్ట్  26 సెప్టెంబర్ 1982లో జర్మనీలోని డెట్మోల్డ్ నగరంలో మోనికా, మైఖేల్ అనే దంపతులకు జన్మించారు. 

19 సంవత్సరాల వయస్సులో బెర్లిన్ లో 3 సంవత్సరాల యాక్టింగ్ కోర్స్ ను పూర్తి చేసారు. యాక్టింగ్ తో పాటు ఈమె బ్యాలెట్ డాన్సర్ గా కూడా ట్రైనింగ్ తీసుకున్నారు. 

కెరీర్:

2003 వ సంవత్సరంలో ఫిల్మ్ మేకర్ అనంత్ దుసేజా చేస్తున్న Destined Hearts అనే సినిమాలో లీడ్ రోల్ లో నటించారు. ఈ సినిమా దుబాయ్ లో షూట్ అయ్యింది కానీ రిలీజ్ అవ్వలేదు.   

2005 లో సుజానే ముంబై లో నివసించటం మొదలుపెట్టారు. 2004 నుంచి 2024 వరకు దాదాపు 19 సినిమాలలో వేరు వేరు పాత్రలలో నటించారు. 

సినిమాలతో పాటు అనేక టీవీ సిరీస్ లలో కూడా నటించారు. అమీర్ ఖాన్ సరసన టైటాన్ వాచ్ యాడ్ లో కూడా నటించారు. Padharo India అనే షాట్ ఫిల్మ్ లో నటించి జైపూర్ టూరిజం ను కూడా ప్రమోట్ చేసారు. 

2018 అక్టోబర్ 1 న గుజరాత్ లో జరిగిన కామ అవార్డ్స్ ఫంక్షన్ లో The International Diva of Bollywood అనే అవార్డు ను గెలుచుకున్నారు. 

వ్యక్తిగత జీవితం:             

సుజానే ఫిబ్రవరి 3, 2009 న సివిల్ కోర్ట్ లో నటుడు అఖిల్ మిశ్రాను పెళ్లిచేసుకున్నారు.  30 సెప్టెంబర్ 2011 లో తిరిగి మళ్ళీ సాంప్రదాయక పెళ్లి చేసుకున్నారు. 

పెళ్లి తరవాత ఈమెకు Overseas Citizenship of India కూడా లభించింది. భర్త మిశ్ర 21 సెప్టెంబర్ 2023న 67 సంవత్సరాల వయస్సులో కిచెన్ లో కింద పది తగిలిన గాయాలతో చనిపోయారు.   

Reference:  Suzanne Bernert – Wikipedia

Leave a Comment