భారతదేశ త్రివర్ణ పతాక చరిత్ర ఏమిటి – What is the history of the Indian flag in Telugu?

భారతదేశ జాతీయ జెండా ను సాధారణంగా మనం త్రివర్ణ పతాకం అని హిందీ లో తిరంగా అని మరియు ఇంగ్లీష్ లో ట్రై కలర్ ఫ్లాగ్ అని అంటారు.

త్రివర్ణ పతాకం మూడు రంగులను కలిగి ఉంటుంది. మన జాతీయ జెండా కుంకుమ, తెలుపు మరియు ఆకుపచ్చ రంగులలో ఉండి మధ్యలో నేవీ బ్లూ రంగులో 24 స్పోక్ వీల్స్ ను కలిగిన అశోక చక్రం ఉంటుంది.

ప్రస్తుతం ఉన్న జాతీయ జెండా కన్నా ముందు వివిధ రూపాలలో జాతీయ జెండా ఉండేది.

22 జూలై 1947 లో జరిగిన రాజ్యాంగ సభ సమావేశంలో ప్రస్తుతం ఉన్న జెండా ఆమోదించబడింది.

15 ఆగస్టు 1947న భారతదేశ అధికారిక జెండాగా మారింది. భారత దేశ జెండాను ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ జెండా అయినా స్వరాజ్ జెండాను ఆధారం చేసుకొని తయారు చేయబడింది. ఈ జెండాను మొట్ట మొదటి సారి పింగళి వెంకయ్య రూపకల్పన చేసారు.

త్రివర్ణ పతాకాన్ని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ను ఆధారం చేసుకొని తయారు చేయటం జరుగుతుంది.

మన జాతీయ జెండా యొక్క వాడుక ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా (Flag Code of India) పై ఆధార పడి ఉంటుంది.

చరిత్ర:

స్వాతంత్ర్య ఉద్యమానికి ముందు వివిధ సంస్థానాధీశులు వివిధ రకాల డిజైన్ లతో ఉపయోగించేవారు.

1857 తిరుగుబాటు తరవాత బ్రిటిష్ పాలకుల చేత మొట్ట మొదటి సారి భారతదేశానికి ఒక జెండా ను తయారు చేయటం జరిగింది. ఈ జెండా ఎరుపు రంగు లో ఉండి యూనియన్ జాక్ మరియు స్టార్ అఫ్ ఇండియా ను కలిగి ఉండేది.

20 వ శతాబ్దం ప్రారంభంలో ఇండియన్ సివిల్ సర్వీస్‌లో బ్రిటీష్ సభ్యుడు అయినా విలియం కోల్డ్‌స్ట్రీమ్ ఇండియా యొక్క జెండాను మార్చాలని ప్రతిపాదించారు.

కొత్త జెండా తయారు చేసినప్పుడు జాతీయ వాదులు గణేశుడి బొమ్మ, కాళీ బొమ్మ లేదా గో మాత యొక్క బొమ్మను ఉంచాలని కోరారు. ఇలా చేయటం వల్ల జెండా కేవలం హిందువులను సూచిస్తుందని ముస్లింలను సూచించదు అని వాదనలు వచ్చాయి.

చివరికి డార్క్ బ్లూ, గ్రీన్ మరియు లైట్ బ్లూ రంగులతో ఒక జెండా తయారు చేయటం జరిగింది. ఈ జెండాలో డార్క్ బ్లూ హిందువులు మరియు బుద్దువులను, గ్రీన్ రంగు ముస్లిం లను మరియు లైట్ బ్లూ క్రెస్తవులను సూచించేది.

1579 వ సంవత్సరంలో యూరోప్ లో స్పానిష్ సామ్రాజ్యం నుంచి స్వాతంత్రం తీసుకున్న నెదర్లాండ్స్ మొదటి సారి త్రివర్ణ పతాకాన్నీ అంటే మూడు రంగులతో కూడిన జెండాని వినియోగించటం జరిగింది.

ఈ జెండా నుంచి ప్రేరణ తీసుకున్న ఇతర దేశాలు కూడా తమకు నచ్చిన రంగులతో త్రివర్ణ పతకాలను తయారు చేసుకున్నారు.

1905 లో బెంగాల్ విభజన తరవాత భారతదేశ స్వాత్రంత్ర ఉద్యమానికి వందే మాతరం (Vande Mataram flag) జెండాను ఎన్నుకోవటం జరిగింది.

ఈ జెండాలో ఆకుపచ్చ (green), పసుపు (yellow) మరియు ఎరుపు (red) రంగులతో తయారు చేయబడింది. ఆకుపచ్చ రంగుపై ఎనిమిది తెల్ల తామరలు ఉండేవి. పసుపు రంగు పై హిందీ లో వందేమాతరం అని ఉండేది అలాగే ఏర్పుపు రంగు పై సూర్యుడు మరియు చంద్రుడి బొమ్మలు ఉండేవి.

ఈ జెండాను ఎలాంటి వేడుక లేకుండా కలకత్తాలో లాంచ్ చేయటం జరిగింది. వార్త పత్రికలు కూడా అంతగా కవర్ చేయలేదు కానీ భారత జాతీయ కాంగ్రెస్ వార్షిక సమావేశంలో ఉపయోగించబడింది.

ఈ జెండాలో కొన్ని మార్పులు చేసి 1907 వ సంవత్సరంలో స్టుట్‌గర్ట్‌లో రెండవ ఇంటర్నేషనల్ సోషలిస్ట్ కాంగ్రెస్‌లో మేడం కామ అనే స్వాతంత్ర ఉద్యమరాలు ఇంకో జెండాను వినియోగించారు. ఈ జెండాలపై జాతీయ వాదులు శ్రద్ధ చూపించలేదు అందుకే ఇవి పాపులర్ అవ్వలేదు.

అదే సమయంలో చాలా మంది వివిధ రకాలైన జెండాలను తయారు చేసారు కానీ దేనిని కూడా ఎంచుకోలేదు.

1916 వ సంవత్సరంలో పింగళి వెంకయ్య 30 రకాలైన డిజైన్ లను తయారు చేసారు కానీ ఫైనల్ గా ఏదీ కూడా ఎంచుకోలేదు.

ఇదే సంవత్సరం అన్నీ బిసెంట్ మరియు బాల గంగాధర తిలక్ హోమ్ రూల్ ఉద్యమం కోసం ఒక జెండాను తయారు చేసారు.

1921 వ సంవత్సరంలో మహాత్మా గాంధీజీ భారతదేశానికి ఒక జెండా ఉండాలని Young India వార్త పత్రిక ద్వారా దాని ఆవశ్యకత తెలిపారు.

స్పిన్నింగ్ వీల్ లేదా చర్ఖా తో కూడిన ఒక జెండాను తయారు చేయాలని కోరారు. స్పిన్నింగ్ వీల్ యొక్క ఆలోచన లాల హన్స్ రాజ్ ద్వారా ఇవ్వబడింది.

గాంధీజీ పింగళి వెంకయ్యను 1921 లో జరిగే కాంగ్రెస్ సమావేశం వరకు జెండా డిజైన్ చేయాలని చెప్పారు. కానీ సమయానికి జెండా తయారు అవ్వలేదు. గాంధీజీ వేరే జెండాను సమావేశంలో ఉపయోగించారు.

తరవాత గాంధీజీ పింగళి వెంకయ్య తయారు చేసిన జెండాను చూసినప్పుడు జెండా ఆలస్యం అవ్వటమే మంచిది అయ్యిందని అనుకున్నారు.

ఎందుకంటే పింగళి వెంకయ్య తయారు చేసిన జెండాలో ఎరుపు రంగు హిందువులను మరియు ఆకుపచ్చ రంగు ముస్లిం లను సూచిస్తుంది. ఇతర మతాలకు చెందిన వారిని సూచించదు.

గాంధీజీ ఈ జెండాలో తెల్ల రంగును కూడా చేర్చాలని కోరారు. తెల్ల రంగు మిగతా మతాల వారిని సూచిస్తుందని తెలిపారు.

1923, ఏప్రిల్ 23 వ తారీకున జలియన్‌వాలాబాగ్ మారణకాండను స్మరించుకుంటూ నాగ్‌పూర్‌ కి చెందిన స్థానిక కాంగ్రెస్ వాలంటీర్లు నిర్వహించిన ఊరేగింపులో పింగళి వెంకయ్య డిజైన్ చేసిన స్పిన్నింగ్ వీల్ జెండాను తయారు చేసారు.

ఈ ఊరేగింపులో పోలీసులకు మరియు కాంగ్రెస్ వాలంటీర్లకు మధ్య ఘర్షణ జరిగింది. తరవాత Flag Satyagraha అనే ఉద్యమం మొదలయ్యింది. చాలా కొంత సమయంలోనే దేశ ప్రజలకు ఈ ఉద్యమం గురించి తెలిసింది.

1947 ఆగస్టులో భారతదేశానికి స్వాతంత్ర్యం రావడానికి కొన్ని రోజుల ముందు, రాజ్యాంగ పరిషత్ ఏర్పడింది.

1947, 23 జూన్ రోజున భారతదేశానికి జెండాను ఎంపిక చేసేందుకు రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలో B. R. అంబేద్కర్‌ , K. M. మున్షీ , C. రాజగోపాలాచారి, సరోజినీ నాయుడు మరియు మౌలానా అబుల్ కలాం ఆజాద్ లతో సహా ఒక తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేయటం జరిగింది.

జెండాలోని స్పిన్నింగ్ వీల్ కి బదులుగా అశోక చక్రాన్ని మార్చి 22 జూలై 1947న రాజ్యాంగ సభలో నెహ్రు ప్రతిపాదించారు.

స్పిన్నింగ్ వీల్ కి బదులుగా అశోక చక్ర ఉంచాలనేది హైదరాబాద్ కి చెందిన సూరయ్య తయ్యబ్జి అనే మహిళా ఆలోచన అని కూడా వార్తలు ఉన్నాయి. కానీ వీటికి సంబంధించిన ఆధారాలు మాత్రం లేవు.

15 ఆగస్టు 1947 మరియు 26 జనవరి 1950 నుంచి ఇదే జెండా భారత దేశ జెండాగా మారింది.

Source: Flag of India – Wikipedia

Leave a Comment