పింగళి వెంకయ్య భారత దేశానికి చెందిన ఒక స్వాతంత్ర సమరయోధుడు మరియు గాంధేయవాది. భారతదేశం యొక్క జాతీయ పతాకం యొక్క రూపకర్త.
Table of Contents
బాల్యం :
పింగళి వెంకయ్య 1876 వ సంవత్సరంలో మచిలీపట్టణంలోని భట్లపెనుమర్రు గ్రామం, హనుమంత రాయుడు మరియు వెంకట రత్నం అనే బ్రాహ్మిన దంపతులకు జన్మించారు.
మచిలీపట్నం లోనే తన స్కూల్ విద్యను పూర్తిచేసారు. 19 సంవత్సరాల వయస్సులో బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో చేరారు. మిలిటరీలో చేరిన తరవాత రెండవ బోయర్ యుద్ధం కోసం దక్షిణ ఆఫ్రికా లో నియమించబడ్డారు.
దక్షిణ ఆఫ్రికా లో పింగళి వెంకయ్య మొట్ట మొదటి సారి గాంధీజీ ను కలుసుకున్నారు. యుద్ధ సమయంలో సైనికులు బ్రిటిష్ ప్రభుత్వ జాతీయ పతాకానికి సెల్యూట్ చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో వెంకయ్యకు భారతదేశానికి కూడా ఒక జాతీయ పతాకం ఉండాలి అనే ఆలోచన వచ్చింది.
కెరీర్ :
వెంకయ్య మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజి నుంచి భూగర్భ శాస్త్రంలో డిప్లమాను సంపాదించారు.
చదువు పూర్తి చేసుకున్న తరవాత 33 సంవత్సరాలు ఆంధ్ర జాతీయ కళాశాల లో లెక్చరర్ గా పనిచేసారు.
లెక్చరర్ గా పనిచేస్తున్న సమయంలో మైకా ఖనిజంపై పరిశోధన చేసారు. తన పరిశోధన నిమిత్తం భూగర్భ శాస్త్రం పై “తల్లి రాయి” అనే పుస్తకం ను కూడ రాసారు.
వెంకయ్యకు పలు రంగాలలో ఉన్న అనుభవం వల్ల కొన్ని మారు పేర్లు (Nickname) ఉన్నాయి.
వెంకయ్యకు భూగర్భ శాస్త్రం లో మంచి అనుభవం ఉండటం వల్ల డైమండ్ మైనింగ్ లో నిపుణుడు అయ్యారు. వెంకయ్య కు డైమండ్స్ మైనింగ్ లో ఉన్న అనుభవం వల్ల “డైమండ్ వెంకయ్య” అని పిలిచే వారు.
వెంకయ్య వివిధ రకాల పత్తి గింజలపై చేసిన పరిశోధన కారణంగా ప్రజలు ” పత్తి వెంకయ్య” అని పిలిచే వారు.
వెంకయ్య ఒక బహుభాషావేత్త, జాపనీస్ మరియు ఉర్దూ భాషలతో పాటు పలు భాషలలో ప్రావిణ్యం కలదు. 1913 సంవత్సరంలో బాపట్లలో జాపనీస్ భాషలో ఉపన్యాసం ఇచ్చారు. ఆ ఉపన్యాసం తరవాత ఆయనను ” జపాన్ వెంకయ్య ” అని పిలిచేవారు.
జాతీయ పతాకం :
1906 వ సంవత్సరంలో దాదాభాయ్ నౌరోజీ పర్యవేక్షణలో ఏర్పాటు చేయబడ్డ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సమావేశంలో వెంకయ్య హాజరు అయినప్పుడు, భారత జాతీయ కాంగ్రెస్ (Indian National Congress) కోసం ఒక జాతీయ పతాకాన్ని రూపకల్పన చేయాలని నిర్ణయించుకున్నారు.
కాంగ్రెస్ మీటింగ్ లలో కూడా బ్రిటీష్ ప్రభుత్వ జెండా ఎగరవేయటం నచ్చేది కాదు.
భారతీయ చరిత్ర మరియు సంస్కృతిని ఆధారం చేసుకొని 25 జాతీయ పతకాల నమూనాలను పింగళి వెంకయ్య తయారు చేసారు.
1916 వ సంవత్సరంలో భరత దేశానికి ఒక జాతీయ పథకం అనే పుస్తకం ను కూడా రాసారు. ఈ పుస్తకంలో 30 రకాల జాతీయపతకాల నమూనాల గురించి వివరించారు.
1921 వ సంవత్సరంలో విజయవాడలో జరిగిన ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సమావేశంలో గాంధీజీ వెంకయ్యను జాతీయ పతాకం తయారు చేయమని అడిగినప్పుడు, కేవలం మూడు గంటలలో తయారు చేసారు.
ఖాదీ పై వెంకయ్య తయారు చేసిన జాతీయ పతాకంలో రెండు రంగులు (ఎరుపు మరియు ఆకుపచ్చ) మరియు ఒక రాట్నం ను ఉంచి తయారు చేసారు.
ఈ పతాకంలో ఉండే ఎరుపు రంగు హిందువులను మరియు ఆకుపచ్చ రంగు ముస్లింలను సూచిస్తాయి అని గాంధీజీ తో అనగా, ఈ పతాకంలో ఒక తెలుగు రంగును కూడా చేర్చాలని అని చెప్పారు. తెలుగు రంగు భారతదేశంలో ఉండే మిగతా మతాలను సూచిస్తుందని చెప్పారు.
వెంకయ్య తయారు చేసిన పతాకాన్ని అప్పటి కాంగ్రెస్ అధికారికంగా ప్రకటించలేదు. స్వాతంత్రానికి 20 రోజుల ముందు వెంకయ్య ద్వారా తయారు చేసిన పతాకాన్నిఅధికారికంగా జాతీయ పతాకంగా ప్రకటించటం జరిగింది.
మరణం :
వెంకయ్య తన జీవితం మొత్తం గాంధీ సిద్ధాంతాలను పాటిస్తూ 1963 సంవత్సరంలో మరణించారు.
2009 వ సంవత్సరంలో వెంకయ్య స్మారకార్థం మొదటి జాతీయ పతాకం ను కలిగి ఉన్న తపాలా బిళ్ళను విడుదల చేసారు.
1992 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి N.T రామ రావు, నెక్లెస్ రోడ్ వద్ద వెంకయ్య విగ్రహాన్ని స్థాపించారు.
Source: Pingali Venkayya – Wikipedia