కొమురం భీమ్ జీవిత చరిత్ర – Komaram Bheem Biography in Telugu

కొమురం భీమ్ హైదరాబాద్ స్వాతంత్రం కోసం నిజాం రాజుకి వ్యతిరేకంగా పోరాడిన విప్లవకారుడు.

బాల్యం :

కొమురం భీమ్ 22 అక్టోబర్ 1901 వ సంవత్సరంలో  గోండు తెగకు చెందిన  చిన్నూమ్ మరియు  సోంబాయి అనే దంపతులకు ఆదిలాబాద్ జిల్లా, ఆసిఫాబాద్ తాలూకాలోని సంకెపల్లి లో జన్మించారు. 

భీమ్ గిరిజన ప్రజలతో కలిసి అడవులలో నివసించి పెద్దవారయ్యారు. అడవుల్లో ఉన్న కారణంగా చదువుకోలేదు. 

భీమ్ జీవించినన్ని రోజులు జమీందారులు, వ్యాపారవేత్తల మరియు ఫారెస్ట్  పోలీస్ యొక్క దోపీడీల కారణంగా ఓక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తరలి వెళ్లేవారు. 

1900 సంవత్సరంలో గోండీలు నివసించే ప్రాంతాలలో మైనింగ్ పనుల విస్తరణ జరిగింది. గోండీల జీవనాధారాన్ని దెబ్బ తీసేలా నిబంధనలను ప్రవేశ పెట్టి అమలు చేయబడ్డాయి. 

గోండి ప్రజలు నివసించే ప్రాంతాలలో జమిందారులకు భూములు ఇవ్వటం జరిగింది. ఫలితంగా జమీందారులు గోండి ప్రజలు చేస్తున్న పోడు వ్యవసాయం పై పన్నులు విధించే వారు. పన్నులు కట్టని వారిపై కఠిన శిక్షలను విధించేవారు. 

జమీందారుల దోపిడీల నుంచి తమను తాము కాపాడుకోవటడానికి తమ గ్రామాల నుంచి వేరే ప్రాంతాలకు వలస వెళ్ళటం ప్రారంభించారు. 

అదే సమయంలో కొందరు గోండీ ప్రజలు అప్పుడప్పుడు ప్రతీకారం మరియు నిరసనలు కూడా చేసేవారు. కొమురం భీమ్ యొక్క తండ్రి కూడా ఇలాంటి సందర్భాలలో పాల్గొన్నందుకు ఫారెస్ట్ పోలీసుల చేత చంపబడ్డారు.           

తిరుగుబాటు :           

తన తండ్రి చనిపోయిన తరవాత కొమురం భీమ్ యొక్క కుటుంబం సంకేపల్లి గ్రామం వదిలేసి కరీంనగర్ జిల్లాలోని సర్దాపూర్ గ్రామంలో నివసించ సాగారు. 

భీమ్ తో పాటు ఇతర గోండి ప్రజలు కూడా సర్దాపూర్ లో నివసించసాగారు .  గోండి ప్రజలు లక్ష్మణ్ రావు అనే జమీందార్ కు చెందిన బంజరు భూమిలో నివసించసాగారు. 

వీళ్లందరు అక్కడ జీవనాధార వ్యవసాయం చేసుకుంటూ జీవనాధారం కొనసాగించారు.  పంటలు పండిన తరవాత  సర్దాపూర్ లో కూడా గోండి ప్రజలను పన్ను కట్టాలని వేధించేవారు.   

1920 వ సంవత్సరం అక్టోబర్ నెలలో గోండి ప్రజలు ఉంటున్న స్థలం యొక్క జమీందారు పటేల్, నిజాం ప్రభుత్వం యొక్క అధికారిని పంటలను జప్తు చేయటానికి పంపించాడు. 

నిజాం ప్రభుత్వ అధికారికి మరియు గోండి ప్రజలకు మధ్య జరుగుతున్న  ఘర్షణ సమయంలో కొమురం భీం నిజాం ప్రభుత్వ అధికారిని చంపేసారు. 

భీమ్ అక్కడినుంచి కాలి నడకన పారిపోయి బ్రిటిష్ ప్రభుత్వానికి మరియు నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్త పత్రిక ప్రచురించే విటోబా అనే వ్యక్తి  వద్ద చేరుకున్నారు. విటోబా కొమరం భీమ్ కు ఆశ్రయం  కల్పించాడు. 

విటోబా వద్ద పనిచేస్తున్న సమయంలో భీమ్ హిందీ, ఉర్దూ మరియు ఇంగ్లీష్ భాషలను చదటవం మరియు రాయటం నేర్చుకున్నారు.    

విటోబా అరెస్ట్ అయిన తర్వాత భీమ్ అక్కడినుంచి కూడా పారిపోవలసి వచ్చింది. ఈ సారి తనకు తెలిసిన పరిచయస్తుడితో అస్సాం లోని టీ తోటల వద్దకు వెళ్లారు. 

అతను టీ తోటలలో నాలుగున్నర సంవత్సరాలు పనిచేసారు. టీ తోటలలో పనిచేస్తున్న సమయంలో అక్కడి లేబర్ యూనియన్ లో చురుకుగా పాల్గొన్నారు, చివరికి పోలీసుల చేత అరెస్ట్ చేయబడ్డారు.

అరెస్ట్ అయిన నాలుగు రోజులకే జైలు నుంచి తప్పించుకొని గూడ్స్ ట్రైన్ ద్వారా మహారాష్టలోని బల్లార్పూర్ కి చేరుకున్నారు. 

తిరిగి వచ్చిన కొమురం భీమ్ ఆదివాసుల హక్కుల కోసం పోరాటం చేయాలనీ నిర్ణయించుకున్నారు. తన కుటుంబాన్ని కాకాన్‌ఘాట్ అనే ప్రాంతానికి తరలించి, దేవడం గ్రామానికి పెద్ద అయిన లచ్చు పటేల్ కోసం పని చేయటం ప్రారంభించారు. 

అస్సాం లో తనకు ఉన్న అనుభవాన్ని ఉపయోగించి ఆసిఫాబాద్ సంస్థానం కు వ్యతిరేకంగా,  స్థలం యొక్క లిటిగేషన్ సమస్యలో లచ్చు పటేల్ కు సహాయం చేసారు. 

వెంటనే ఆ చుట్టు ప్రక్కల గ్రామాలలో జనాదరణ పొందారు. పటేల్ వద్ద పనిచేస్తున్న సమయంలో  కొమురం భీమ్ సోమ్ బాయి ను పెళ్లి చేసుకున్నారు. 

పెళ్లి చేసుకున్న తరవాత గోండు భూములలో భాబేఝరి అనే ప్రాంతానికి వెళ్లి స్థిర పడి వ్యవసాయం చేసుకోవటం మొదలుపెట్టారు. 

పంట చేతికి వచ్చిన తర్వాత మళ్ళీ అటవీ శాఖ అధికారులు వచ్చి ఆ స్థలాన్ని వదిలేసి వెళ్ళమని చెప్పారు. ఈ సారి భీమ్ నిజాం రాజును ప్రత్యక్షంగా రాజును కలిసి తమ సమస్యను చెప్పాలని అనుకున్నారు కానీ రాజు నుంచి ఎలాంటి  సహాయం అందలేదు. 

కొమురం భీమ్ సాయుధ విప్లవం చేయాలనీ నిర్ణయించుకున్నారు.

కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా తో రహస్యంగా కలిసి ఆదివాసీ ప్రజలతో కలిసి ఒక గొరిల్లా ఆర్మీ ను తయారు చేసారు. మొత్తం 12 జిల్లాల గిరిజన  నాయకులతో  కలిసి గిరిజన నాయకుల మండలి ను తయారు చేసారు.  

ఈ ఆర్మీ ద్వారా తమ భూములను  కాపాడుకొని ఒక ప్రత్యేక గోండు రాజ్యం తయారు చేయాలని అనుకున్నారు. 

క్రమక్రమంగా గిరిజన నాయకుల మండలి బలోపేతం అయ్యింది. గోరిల్లా   దళం జమిందారులపై దాడి చేయటం మొదలుపెట్టారు. 

ఇది చుసిన నిజాం రాజు ఈ దళానికి భీమ్ నాయకుడని గుర్తించి ఆసిఫాబాద్ కలెక్టర్ ను భీమ్ తో చర్చలు జరపడానికి పంపించారు. గోండు  ప్రజలకు భూములను మంజూరు చేస్తుందని చెప్పారు. 

భీమ్ కలెక్టర్ తెచ్చిన ప్రతిపాదనను తిరస్కరించారు. బదులుగా తాము నివసిస్తున్న గోండు ప్రాంతంలో ప్రభుత్వ ప్రమేష్యమ్ ఉండకుండదని, జమీందారులు మరియు ప్రభుత్వ అధికారులు వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని మరియు జైళ్లలో బందీగా ఉన్న ఖైదీలను వెంటనే విడుదల చేయాలనీ డిమాండ్లను ఉంచారు. 

నిజాం రాజు తన డిమాండ్లను తిరస్కరించారు. కొమురం భీమ్ మాత్రం తాను నిర్మించిన ఆర్మీ తో కలిసి జల్ జంగల్ జమీన్ అనే నినాదంతో ముందుకు సాగారు. 

మరణం :

కుర్దు పటేల్ కొమురం భీమ్ ఉంటున్న స్థావరాలను కనుగొన్నాడు. ఆసిఫాబాద్ తాలూకాదారు అబ్దుల్ సత్తార్ పోలీస్ బలగాలతో జరిపిన ఎన్కౌంటర్ లో చనిపోయారు. 

భీమ్ తో పాటు ఇంకొక 15 మంది కూడా చనిపోయారు. 1940 సంవత్సరం అక్టోబర్ నెలలో కొమురం భీమ్ చనిపోయారు. 

2011 వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  Sri Komaram Bheem Project అనే డ్యామ్ ను నిర్మించటం జరిగింది. హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ వద్ద కూడా కొమురం భీమ్ విగ్రహాన్ని స్థాపించారు. 

తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తరవాత 25 కోట్ల ఖర్చుతో జోడేఘాట్ వద్ద కొమరం భీమ్ మ్యూజియంను మరియు స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేసారు.  

తెలంగాణ ప్రభుత్వం కొత్తగా జిల్లాలు ఏర్పాటు చేసినప్పుడు. ఆదిలాబాద్  జిల్లా నుంచి ఒక ప్రాంతాన్ని కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా గా పేరు పెట్టారు. 

2022 వ సంవత్సరంలో RRR సినిమాలో జూనియర్ N. T. రామారావు కొమురం భీమ్ గా నటించారు.   

Source: Komaram Bheem – Wikipedia

Leave a Comment