ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం – World Mental Health Day in Telugu

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం ను ప్రతి సంవత్సరం 10 అక్టోబర్ రోజున ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ఈ రోజు యొక్క ముఖ్య లక్ష్యం,  ప్రజలకు మానసిక ఆరోగ్యం పై పట్ల అవగాహన కలిపించటం. 

ప్రపంచంలో మొదటి సారి  ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవంను రిచర్డ్ హంటర్, అక్టోబర్ 10, 1992వ సంవత్సరంలో జరిపారు. 

1994 వ సంవత్సరం వరకు ఎలాంటి నేపథ్యం (theme) లేకుండానే ప్రజలకు మానసిక ఆరోగ్యం గురించి ప్రచారం చేసి అవగాహన కలిపించేవారు.      

1994 సంవత్సరంలో మొదటిసారి యూజీన్ బ్రాడీ సలహా మేరకు అక్టోబర్ 10 వ తారీకును World Mental Health Day ను ఒక నేపత్యం తో జరుపుకున్నారు. 

1944 సంవత్సరంలో “Improving the Quality of Mental Health Services throughout the World (ప్రపంచ వ్యాప్తంగా మానసిక ఆరోగ్య సేవల నాణ్యతను మెరుగుపరచడం)” నేపత్యం ను జరుపుకున్నారు. 

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా మానసిక ఆరోగ్య అవగాహనను ప్రోత్సహించింది. 

2022 వ సంవత్సరంలో “అందరికీ మానసిక ఆరోగ్యం & శ్రేయస్సును ప్రపంచ ప్రాధాన్యతగా చేయండి (Make Mental Health & Well-Being for All a Global Priority) ” అనే నేపత్యంతో అక్టోబర్ 10 ను జరుపుకుంటున్నారు.

మానసిక ఆరోగ్యం అంటే ఏమిటి (What is Mental Health)? 

మానసిక ఆరోగ్యం మనుషులకు భావోద్వేగ, మానసిక మరియు సామాజిక శ్రేయస్సును కలిగిస్తుంది. మెంటల్ హెల్త్ మనము ఆలోచించే విధానాన్ని, అనుభూతిని మరియు పనిచేసే విధానాన్ని ప్రభావితం చేస్తుంది. 

మెంటల్ హెల్త్ ఒత్తిడిని తట్టుకోవటంలో, ఇతరులతో ఎలా ఉండాలో మరియు నిర్ణయాలను ఎలా తీసుకోవాలి అన్న విషయాలలో సహాయపడుతుంది.    

బాల్యం, కౌమార దశ మరియు యుక్తవయస్సు లాంటి దశలలో మెంటల్ హెల్త్  చాలా అవసరం. 

మన జీవితంలో ఎప్పుడైన ఒక్కసారి మానసిక ఆరోగ్య సమస్యల బారిన పడతాము. 

మానసిక సమస్యలకు గల కొన్ని కారణాలు :  

1) జన్యువు పరంగా కలిగే కారకాలు 

2) జీవితం లో కలిగే అనుభవాలు 

3)  ఫ్యామిలీ లో ఇంతకు ముందు మానసిక సమస్యలు ఉండటం

మానసిక సమ్యకు సంబంధించిన కొన్ని సంకేతాలు :

1) ఆహారం ఎక్కువ లేదా తక్కువ తినటం 

2) ఇతరులకు దూరంగా ఉండటం 

3) శరీరంలో శక్తి ఉండక పోవటం 

4) ఏది జరిగిన పెద్దగా పట్టించుకోకపోవటం 

5) అర్థం కాని నొప్పులు 

6) నిస్సహాయత మరియు హోప్ లెస్ (ఆశలు వదులుకొని) గా ఉండటం 

7) ముందుకన్నా ఎక్కువగా తాగటం, స్మోక్ చేయటం మరియు డ్రగ్స్ తీసుకోవటం 

8) అసాధారణంగా మరిచిపోవటం, కోపంగా  ఉండటం, భయపడటం, అప్సెట్ అవ్వటం మరియు గందరగోళంగా అనిపించటం. మూడ్ లో ఆకస్మిక మార్పులు కనిపించటం  

9) కుటుంబం వారితో మరియు స్నేహితులపై అరవటం 

10) రోజువారీ పనులు సజావుగా చేయకపోవటం 

11) ఇతరులకు లేదా మిమ్మల్ని మీరే హాని చేయాలనీ అనుకోవటం    

మానసిక ఆరోగ్య సమస్య నుంచి బయటికి రావటం :

1) ప్రొఫెషనల్స్ తో సహాయం తీసుకోవటం 

2) ఇతరులతో కలిసి ఉండటం  

3) పాజిటివ్ గా ఉండటం 

4) శారీరకంగా ఆక్టివ్ గా ఉండటం

5) తగినంత నిద్ర పోవటం 

6) మానసిక సమస్యనుంచి బయటపడే నైపుణ్యాలను ఏర్పాటు చేసుకోవటం. 

మానసిక ఆరోగ్యం గురించి కొన్ని నిజాలు (Mental health facts):

1) తీవ్ర మానసిక సమస్యలతో బాధపడుతున్నవారు మిగతా వారి కన్నా 10 నుంచి 20 సంవత్సరాలు ముందుగానే చనిపోతారు. 

2) 15 నుంచి 29 సంవత్సరాల మధ్య ఉన్న వారిలో ప్రపంచవ్యాప్తంగా ఒక్క సంవత్సరానికి ఏడు లక్షల మంది చనిపోతారు.       

3) డిప్రెషన్ ఒక సాధారణ మానసిక సమస్య. ప్రపంచ వ్యాప్తంగా 5% adults డిప్రెషన్ బారిన పడుతున్నారు. 

4) కౌమార దశ లో ఉన్న 7 మంది పిల్లలలో ఒక్కరు మానసిక రుగ్మత నుంచి బాధపడుతున్నారు.  

Source: 1)World Mental Health Day – Wikipedia 2) 10 facts on mental health (who.int) 3)Mental Health Myths and Facts | MentalHealth.gov

Leave a Comment