K.L రాహుల్ భారతదేశానికి చెందిన అంతర్జాతీయ క్రికెటర్ మరియు రైట్ హ్యాండ్ బ్యాట్స్ మెన్. K.L రాహుల్ అప్పుడప్పుడు కీపర్ గా కూడా కీపింగ్ చేస్తారు.
రాహుల్ డొమెస్టిక్ క్రికెట్ కర్ణాటక నుంచి ఆడుతారు మరియు IPL లో లక్నో సూపర్ జయింట్స్ టీం లో ఆడుతారు.
Table of Contents
బాల్యం:
K.L రాహుల్ 18 ఏప్రిల్ 1992 సంవత్సరంలో K.N లోకేష్ మరియు రాజేశ్వరి దంపతులకు బెంగళూరు లో జన్మించారు.
K.L రాహుల్ తండ్రి వృత్తి పరంగా ఒక ప్రొఫెసర్ మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కర్ణాటక లో మాజీ డైరెక్టర్. రాహుల్ తల్లి కూడా మంగళూరు యూనివర్సిటీ లో ఒక ప్రొఫెసర్.
రాహుల్ తన స్కూలు చదువును మంగళూరు నుంచి పూర్తి చేసారు. 10 సంవత్సరాల వయస్సు నుంచే క్రికెట్ లో శిక్షణ పొందటం ప్రారంభించారు.
రెండు సంవత్సరాల తరవాత బెంగళూరు యునైటెడ్ క్రికెట్ క్లబ్ మరియు మంగళూరు క్రికెట్ క్లబ్ లో ఆడటం ప్రారంభించారు.
18 సంవత్సరాల వయస్సులో బెంగళూరులోని జైన్ యూనివర్సిటీలో చేరారు అలాగే తన క్రికెట్ కెరీర్ ను కొనసాగించారు.
డొమెస్టిక్ కెరీర్:
2010-11 సీజన్ లో కర్ణాటక నుంచి ఫస్ట్ క్లాస్ క్రికెట్ అరంగేట్రం చేసారు. ఇదే సీజన్ లో 2010 ICC అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ లో ఆడి మొత్తం 143 పరుగులు చేసారు.
2013 వ సంవత్సరంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నుంచి ఆడి IPL (Indian Premier League)లో అరంగేట్రం చేసారు.
2014-15 దులీప్ ట్రోఫీలో సౌత్ జోన్ మరియు సెంట్రల్ జోన్ మధ్య జరిగిన ఫైనల్ లో ఫస్ట్ ఇన్నింగ్స్ లో 233 బాల్స్ లో 185 పరుగులు చేసారు. సెకండ్ ఇన్నింగ్స్ లో 152 బంతులలో 130 పరుగులు చేసారు.
2014-15 రంజీ ట్రోఫీ ఫైనల్ లో తమిళనాడు పై ఆడి 188 పరుగులు చేసారు.
ఇంటర్నేషనల్ కెరీర్:
2014 వ సంవత్సరంలో ఆస్ట్రేలియా టూర్ లో ఎంపికయ్యి తన టెస్ట్ కెరీర్ ను అరంగేట్రం చేసారు. మొదటి ఇన్నింగ్స్ లో 3 పరుగులు మరియు రెండవ ఇన్నింగ్స్ లో 1 పరుగు చేసారు.
తరవాత సిడ్నీ లో జరిగిన టెస్ట్ లో 110 పరుగులు చేసి తన తోలి అంతర్జాతీయ సెంచరీ ను చేసారు.
శ్రీలంక టూర్ లో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో ఆడి తన రెండవ టెస్ట్ సెంచరీ ను చేసారు.
2016 లో జింబాబ్వే టూర్ లో రాహుల్ ఎంపికయ్యి వన్డే ఇంటర్నేషనల్ (ODI) లో అరంగేట్రం చేసారు. రాహుల్ 115 బంతులలో 100 పరుగులు చేసి మొదటి మ్యాచ్ లోనే సెంచరీ చేసిన భారతీయ క్రికెటర్ అయ్యారు. ఇదే టూర్ లో రాహుల్ ట్వంటీ20 ఇంటర్నేషనల్ (T20I) లో అరంగేట్రం చేసారు.
2016 లోనే జింబాబ్వే తో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో రాహుల్ తన రెండవ టెస్ట్ లో కూడా 158 పరుగులతో సెంచరీ చేసారు.
తన మొదటి T20I సిరీస్ లో 51 బంతులలో 110 పరుగులు చేసారు. ఈ మ్యాచ్ లో రాహుల్ కేవలం 46 బంతులలో సెంచరీ చేసారు.
2019 వ సంవత్సరంలో జరిగిన క్రికెట్ వరల్డ్ కప్ లో ఎంపికయ్యారు. వరల్డ్ కప్ లో రాహుల్ మొత్తం 361 పరుగులు చేసారు, రెండు హాఫ్ సెంచరీలు (50) మరియు 1 సెంచరీ చేసారు.
ఫార్మ్ లో లేకపోవటం వల్ల రాహుల్ ను కొంత కాలం టెస్ట్ మ్యాచ్ ల నుంచి దూరం ఉంచారు. లిమిటెడ్ ఓవర్ల మ్యాచ్ లలో మాత్రం ఆడేవారు .
2021 వ సంవత్సరంలో ఇంగ్లాండ్ టూర్ చేయబోతున్న ఇండియన్ టెస్ట్ టీం లో రాహుల్ ఎంపికయ్యారు. మొదటి టెస్ట్ మ్యాచ్ లోనే రాహుల్ 84 పరుగులు చేసారు.
సెప్టెంబర్ 2021 లో జరిగిన 2021 ICC Men’s T20 World Cup లో ఇండియా నుంచి ఎక్కువ పరుగులు చేసిన క్రీడాకారుడిగా నిలిచారు.ఈ టోర్నమెంట్ లో వరుసగా 3 హాఫ్ సెంచరీలు చేసారు.
కెప్టెన్ మరియు వైస్ కెప్టెన్:
విరాట్ కోహ్లీ టీం ఇండియా పదవి నుంచి తప్పుకున్న తరవాత రోహిత్ శర్మ కొత్త కెప్టెన్ అవ్వగా రాహుల్ వైస్ కెప్టెన్ అయ్యారు.
2022 జనవరి లో సౌత్ ఆఫ్రికా తో జరిగిన టెస్ట్ సిరీస్ లో మొదటి సారి రాహుల్ కెప్టెన్ గా అరంగేట్రం చేసారు. ఈ సిరీస్ ఇండియా 3-0 తో ఓడిపోయింది.
IPL:
2013 లో రాహుల్ IPL లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నుంచి ఆడి IPL లో అరంగేట్రం చేసారు.
2014 లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీం నుంచి ఆడారు. 2016 లో రాయల్ ఛాలెంజర్స్ తరపు న్నుంచి ఆడారు.
2017 లో గాయం కారణంగా ఆడలేకపోయారు, 2018 లో కింగ్స్ XI పంజాబ్ జట్టు నుంచి ఆడారు.
2022 లో రాహుల్ లక్నో సూపర్ జెయింట్స్ లో కెప్టెన్ గా చేరారు. రాహుల్ 17 కోట్ల మొత్తం తో కొనుగోలు చేయటం జరిగింది.
వ్యక్తిగత జీవితం:
KL రాహుల్ హిందీ సినిమాలలో నటించే నటి అయిన అతియా శెట్టి తో రేలషన్ షిప్ లో ఉన్నారు.
Source: KL Rahul – Wikipedia