అతియా శెట్టి జీవిత చరిత్ర – Athiya Shetty biography in Telugu

అతియా శెట్టి భారతదేశానికి చెందిన మరియు బాలీవుడ్ సినిమాల్లో నటించే నటి. ఈమె బాలీవుడ్ నటుడు అయిన సునీల్ శెట్టి కూతురు. శెట్టి తన యాక్టింగ్ కెరీర్ ను 2015 లో హీరో (Hero) అనే రొమాంటిక్ యాక్షన్ సినిమా ద్వారా అరంగేట్రం చేసారు.

బాల్యం:

అతియా శెట్టి 5 నవంబర్ 1992 వ సంవత్సరంలో ముంబై లో సునీల్ శెట్టి (Suniel Shetty) మరియు మన శెట్టి (Mana Shetty)అనే దంపతులకు జన్మించారు. ఈమె తండ్రి ఒక నటుడు మరియు తల్లి ఒక దర్శకురాలు.

శెట్టి యొక్క తండ్రి కర్ణాటకకు చెందిన వారు, శెట్టి యొక్క తల్లి పంజాబీ హిందూ తల్లి మరియు గుజరాతీ ముస్లిం తండ్రి కి జన్మించారు.

శెట్టి కి ఒక ఆహాన్ శెట్టి అనే తమ్ముడు కూడా ఉన్నాడు. తమ్ముడు కూడా హిందీ సినిమాలలో నటిస్తాడు. ఆహాన్ శెట్టి 2021 లో విడుదలైన తడప్ (Tadap) సినిమాలో నటించి తన యాక్టింగ్ కెరీర్ ను అరంగేట్రం చేసారు.

అతియా శెట్టి కేథడ్రల్ అండ్ జాన్ కానన్ స్కూల్ మరియు అమెరికన్ స్కూల్ ఆఫ్ బొంబాయి నుంచి తన స్కూల్ చదువును పూర్తి చేసారు.

అమెరికన్ స్కూల్ ఆఫ్ బొంబాయి నుంచి చదివేటప్పుడు అదే స్కూల్ లో చదువుతున్న శ్రద్ధ కపూర్ మరియు టైగర్ ష్రాఫ్‌లతో కలిసి నాటకాలలో నటించేవారు.

తరవాత తన కెరీర్ ను యాక్టింగ్ లో కొనసాగించడానికి న్యూయార్క్ నగరంలోని న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ లో చేరారు.

కెరీర్ :

శెట్టి తన యాక్టింగ్ కెరీర్ ను 2015 లో విడుదలైన రొమాంటిక్ యాక్షన్ సినిమా హీరో (Hero) తో చేసారు. ఈ సినిమా 1983 లో విడుదలైన Hero సినిమా యొక్క రీమేక్. ఈ సినిమాకు సల్మాన్ ఖాన్ ప్రొడ్యూసర్ గా ఉన్నారు.

ఈ సినిమా బడ్జెట్ 36 కోట్లు అయితే బాక్స్ ఆఫీస్ లో దాదాపు 35 కోట్లు సంపాదించింది.

ఈ సినిమాలో శెట్టి ఒక డ్యాన్సర్ రాధ పాత్రను పోషించారు. సినిమాలో శెట్టి పాత్ర సినిమా హీరో సూరజ్ ద్వారా కిడ్నాప్ అవ్వబడుతుంది. శెట్టి పాత్ర కిడ్నపర్ తో నే ప్రేమలో పడుతుంది.

ఈ సినిమాలో శెట్టి చేసిన నటనకు గాను Best Female Debut కేటగిరీలో ఫిల్మ్‌ఫేర్ అవార్డు లభించింది.

ఈ సినిమాలో అతియా శెట్టి చేసిన నటనపై కామెంట్స్ చేస్తూ తన నటనను ఇంకా మెరుగు పరుచుకోవాలని చెప్పారు.

ఈ సినిమా తరవాత మేబెల్లైన్ న్యూయార్క్ అనే కాస్మొటిక్స్ కంపెనీ యొక్క ఇండియన్ ఫ్రాంచైజ్ కు బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు.

రెండు సంవత్సరాల గ్యాప్ తరవాత శెట్టి ముబారకన్ అనే రొమాంటిక్ కామెడీ సినిమాలో నటించారు. ఈ సినిమాలో అనిల్ కపూర్, అర్జున్ కపూర్ మరియు ఇలియానా కూడా నటించారు.

బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్లను సంపాదించిన సినిమా ఆడియన్స్ ను మెప్పించలేదు. ఈ సినిమా 65 కోట్లు అయితే 93 కోట్ల బిసినెస్ చేసింది.

ఈ సినిమా తరవాత 2018 లో విడుదల అయిన నవాబ్ జాదే సినిమాలో తేరే నాల్ నచ్నా (Tere Naal Nachna) అనే పాటను చేసారు.

2019 లో శెట్టి కామెడీ డ్రామా మోతీచూర్ చక్నాచూర్ అనే సినిమాలో నవాజుద్దీన్ సిద్దిఖీ తో కలిసి నటించారు. ఈ సినిమా అంతగా విజయం సాధించలేదు.

శెట్టి రాబోయే కాలంలో అఫ్షాన్ ఆషిక్ (Afshan Ashiq) అనే ఫుట్ బాలర్ బయో పిక్ లో లీడ్ రోల్ చేయబోతున్నారనే సమాచారం.

వ్యక్తిగత జీవితం:

అతియా శెట్టి 2018 నుంచి ఇండియన్ క్రికెటర్ K.L రాహుల్ తో రిలేషన్ షిప్ లో ఉన్నారు. వీరిద్దరి పెళ్లి 2023 జనవరి నెలలో అవ్వనుంది.

Source: Athiya Shetty – Wikipedia

Leave a Comment