మహమ్మద్ సిరాజ్ జీవిత చరిత్ర – Mohammad Siraj biography in Telugu

మహమ్మద్ సిరాజ్ భారతదేశానికి చెందిన రైట్ ఆర్మ్ ఫాస్ట్ మీడియం బౌలర్‌ మరియు ఒక అంతర్జాతీయ క్రికెటర్.  

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం నుంచి ఆడుతారు అలాగే డొమెస్టిక్ క్రికెట్ లో హైదరాబాద్ టీం నుంచి ఆడుతారు. 

బాల్యం: 

సిరాజ్ 13 మార్చి 1994 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ నగరంలోని మాసాబ్ ట్యాంక్ ప్రాంతంలో జన్మించారు. 

సిరాజ్ యొక్క తండ్రి ఒక ఆటో రిక్షా డ్రైవర్ మరియు తల్లి గృహిణి. 

డొమెస్టిక్ కెరీర్:

సిరాజ్ 15 నవంబర్ 2015 వ సంవత్సరంలో జరిగిన 2015–16 రంజీ ట్రోఫీ టోర్నమెంట్ ఆడి తన ఫస్ట్ క్లాస్ క్రికెట్ అరంగేట్రం చేసారు. ఈ టోర్నమెంట్ కోసం హైదరాబాద్ కోసం ఆడుతున్న కార్తీక్ ఉడుప వద్ద ట్రైనింగ్ తీసుకున్నారు. 

  2 జనవరి 2016 లో 2015–16 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టోర్నమెంట్ లో ఆడి తన Twenty20 అరంగేట్రం చేసారు. 

2017 లో జరిగిన IPL లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీం ద్వారా సిరాజ్  2.6 కోట్లకు కొనుగోలు చేయబడ్డారు.

21 అక్టోబర్ 2020 లో జరిగిన IPL లో ఒకే మ్యాచ్‌లో బ్యాక్ టు బ్యాక్ మెయిడిన్ ఓవర్లు వేసిన మొదటి బౌలర్ గా రికార్డు సృష్టించారు. 

ఇంటర్నేషనల్ కెరీర్: 

అక్టోబర్ 2017 లో, న్యూజిలాండ్ తో జరిగిన సిరీస్ లో Twenty20 International జట్టులో ఎంపికయ్యారు. 

నవంబర్ 2017 లో న్యూజిలాండ్ పై భారతదేశం నుంచి ఆడి T20I ( Twenty20 International) లో అరంగేట్రం చేసారు. 

ఈ మ్యాచ్ లో 4 ఓవర్లు వేసి 53 పరుగులు ఇచ్చి 1 వికెట్ ను తీసుకున్నారు. ఈ మ్యాచ్ లో కేన్ విలియమ్సన్ యొక్క వికెట్ ను తీసుకున్నారు. 

2018 లో వెస్టిండీస్ పై టెస్ట్ మ్యాచ్ ఆడటానికి ఎంపికయ్యారు కానీ ఆడలేదు. 

డిసెంబర్ 2018 లో ఆస్ట్రేలియా మరియు భారతదేశం కి మధ్య జరగబోతున్న  One Day International (ODI) లో ఆడటానికి ఎంపికయ్యారు. 15 జనవరి 2019 లో ఆస్ట్రేలియా పై ఆడి తన ODI అరంగేట్రం చేసారు. 

26 అక్టోబర్ 2020 లో ఆస్ట్రేలియా పై ఆడటానికి ఎంపిక చేసిన ఆటగాళ్లలో సిరాజ్ పేరు కూడా ఉంది. 

మహమ్మద్ షామి గాయం అవ్వటం కారణంగా ఆడలేకపోవటం వల్ల సిరాజ్ కి టెస్ట్ మ్యాచ్ లో ఆడటానికి అవకాశం లభించింది. 

26 డిసెంబర్ 2020 లో ఆస్ట్రేలియా తో జరిగిన మ్యాచ్ లో తన టెస్ట్ కెరీర్ ను అరంగేట్రం చేసారు. 

జనవరి 2021 లోనే ఆస్ట్రేలియా తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ నాల్గవ మ్యాచ్ లో 5 వికెట్లను (five-wicket haul) తీసారు.      

Source: Mohammed Siraj – Wikipedia  

Leave a Comment