ఖషాబా దాదాసాహెబ్ జాదవ్ జీవిత చరిత్ర – Khashaba Dadasaheb Jadhav biography in Telugu

ఖషాబా దాదాసాహెబ్ జాదవ్ భారతదేశానికి చెందిన అథ్లెట్ మరియు రెస్ట్లెర్ (wrestler). 1952 లో హెల్సింకి నగరంలో జరిగిన సమ్మర్ ఒలింపిక్స్ లో భారత దేశం నుంచి బ్రోన్జ్ మెడల్ ను గెలిచారు.

భారత దేశంలో బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడు 1900 సంవత్సరంలో నార్మన్ ప్రిచర్డ్ (Norman Pritchard) రెండు సిల్వర్ మెడల్ లను గెలిచాడు. నార్మన్ ప్రిచర్డ్ ఇండియా లో పుట్టిన బ్రిటిష్ జాతీయుడు.

స్వాతంత్రం తరవాత భారతదేశం నుంచి ఒలింపిక్స్ లో మెడల్ ను సాధించిన మొట్ట మొదటి అథ్లెట్ ఖషాబా దాదాసాహెబ్ జాదవ్.

జాదవ్ కన్నా ముందు కేవలం జట్టు తో కూడిన ఆట హాకీ లోనే భారతదేశం గోల్డ్ మెడల్ ను సాధించింది.

ఒలింపిక్స్ లో మెడల్ ను సాధించి పద్మ అవార్డు ను అందుకొని ఏకైక భారతీయుడు జాదవ్.

జాదవ్ యొక్క పాదాలలో ఉన్న చురుకుదనం మిగతా రెస్లర్ల నుంచి వేరుగా ఉంచింది.

తనలో ఉన్న ఈ ప్రతిభ ను గుర్తించిన రీస్ గార్డనర్ జాదవ్ ను ఒలింపిక్స్ కోసం శిక్షన ఇచ్చారు.

NameKhashaba Dadasaheb Jadhav
NationalityBritish Indian
Born15 January 1926 (Goleshwar)
Died14 August 1984

బాల్యం:

K. D. జాదవ్ మహారాష్ట్ర, సతారా జిల్లా, కరాడ్ తాలూకాలోని గోలేశ్వర్ గ్రామంలో జన్మించారు.

K. D. జాదవ్ తండ్రి కూడా ఒక ప్రఖ్యాత రెస్లర్, తన అయిదు తోబుట్టువులలో జాదవ్ అందరి కన్నా చిన్నవారు.

జాదవ్ తన స్కూల్ చదువును సతారా జిల్లాలోని కరాడ్ తాలూకాలో ఉన్న తిలక్ హైస్కూల్ నుంచి తన స్కూలు చదువును పూర్తి చేసారు.

రెస్లింగ్ నే ఊపిరిగా భావించే ఇంట్లో పెరిగారు. క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో జాదవ్ కూడా ఈ ఉద్యమంలో పాల్గొన్నారు.

ఉద్యమం లో పాల్గొంటున్నవిప్లవకారులు దాక్కోవటానికి ఆశ్రయం కల్పించారు. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉత్తరాలను పంపడం కూడా చేసేవారు.

1947 ఆగస్టు 15 వ రోజున ఒలింపిక్స్ లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని నిర్ణయించుకున్నారు.

కెరీర్:

జాదవ్ తండ్రి దాదాసాహెబ్ రెస్లర్ కోచ్ కావటంతో అయిదు సంవత్సరాల వయస్సులో జాదవ్ రెస్లింగ్ చేయటం మొదలు పెట్టారు.

కాలేజీ లో చదివే సమయంలో బాబూరావు బలావ్డే మరియు బేలాపురి గురూజీ జాదవ్ కి మెంటర్ లుగా ఉన్నారు. ఒకవైపు రెస్లింగ్ చేస్తూ చదువులో కూడా మంచి మార్కులు సంపాదించేవారు.

1948 లో తన కెరీర్ ను ప్రారంభించిన తరవాత 1948 ఒలింపిక్స్ లో ఫ్లైవెయిట్ విభాగంలో ఆరవ స్థానంలో నిలిచి అందరి చూపును తన వైపు తిప్పుకునేలా చేసారు.

1948 వరకు వ్యక్తిగతంగా అంత ఉన్నత స్థానాన్ని సాధించిన మొదటి భారతీయుడు.

అంతర్జాతీయ కుస్తీ నియమాల ప్రకారం కుస్తీ మ్యాట్ (చాప) పై చేయాలి. మ్యాట్ పై రెస్లింగ్ చేయటం జాదవ్ కి కొత్తగా అయినప్పట్టికీ ఆరవ స్థానంలో నిలిచి అందరిని ఆశ్చర్యపరిచారు.

తరవాత నాలుగు సంవత్సరాలు హెల్సింకి ఒలింపిక్స్ కోసం జాదవ్ చాలా కఠినంగా శిక్షణ పొందారు. హెల్సింకి ఒలింపిక్స్ కోసం 57 కిలోల విభాగం నుంచి పోటీ చేసారు.

జాదవ్ మెక్సికో, జర్మనీ మరియు కెనడా నుంచి వచ్చిన రెస్లర్లను ఓడించారు. జాదవ్ సెమి ఫైనల్స్ లో ఓడిపోయినప్పటికీ బ్రోన్జ్ (కాంస్య) మెడల్ ని సాధించారు. ఇలా భారత దేశం నుంచి మొట్ట మొదటి సారిగా వ్యక్తిగత ఒలింపిక్ విజేతగా నిలిచారు.

అదే సమయం హెల్సింకిలో భారత హాకీ జట్టు గోల్డ్ మెడల్ సాధించినప్పటికీ అందరి చూపు జాదవ్ వైపే ఉంది.

కరాడ్ రైల్వే స్టేషన్ వద్ద తన హీరో ను స్వాగతించటానికి పెద్ద మొత్తంలో జనాలు పోగు అయ్యారు.

151 ఎద్దుల బండ్లు మరియు ఢోల్‌లతో జనాలు సుమారు 10 కి.మీ వరకు తమ హీరోని మోసుకెళ్లి గోలేశ్వర్ గ్రామం వరకు తీసుకెళ్లారు.

వ్యక్తిగత జీవితం:

1955 లో జాదవ్ పోలీస్ ఫోర్స్ లో సుబ ఇన్స్పెక్టర్ గా చేరారు. పోలీస్ డిపార్ట్మెంట్ లో జరిగిన అనేక పోటీలలో కూడా జాదవ్ విజేతగా నిలిచారు. జాదవ్ క్రీడా శిక్షకునిగా జాతీయ విధులను కూడా నిర్వహించారు.

ఇరవై సంవత్సరాలు పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసి అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ గా పదవి విరమణ చేసినప్పటికీ జాదవ్ పెన్షన్ డబ్బుల కోసం పోరాడాల్సి వచ్చింది. స్పోర్ట్స్ ఫెడరేషన్ కూడా జాదవ్ ని నిర్లక్ష్యం చేయటం వల్ల తన జీవిత చివరి రోజులు పేదరికంలో గడిపారు.

1984 లో జాదవ్ రోడ్ ఆక్సిడెంట్ లో చనిపోయారు. జాదవ్ చనిపోయిన తరవాత తన భార్య సహాయం పొందాక చాలా కష్ట పడింది.

1982 లో జరిగిన ఆసియన్ గేమ్స్ లో టార్చ్ రన్‌లో జాదవ్ ను భాగస్వామి గా చేసి సత్కరించారు.

అవార్డులు:

జాదవ్ మరణాంతరం మహారాష్ట్ర ప్రభుత్వం ఛత్రపతి పురస్కారాన్ని ప్రదానం చేసింది.

2000 సంవత్సరంలో అర్జున అవార్డు తో జాదవ్ సత్కరించబడ్డారు.

2010 లో ఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్ కోసం నిర్మించిన వేదికను జాదవ్ యొక్క విజయాన్ని పురస్కరించుకొని అతని పేరు పెట్టారు.

Source:K. D. Jadhav – Wikipedia

Leave a Comment