అయ్యప్ప స్వామి జీవిత చరిత్ర – Ayyappa biography in Telugu

అయ్యప్ప ను హరిహరసుతుడని, ధర్మశాస్తా మరియు మణికంఠుడు అని కూడా పిలవటం జరుగుతుంది. ఈయన హిందూ దేవతలలో ఒక్కరు. అయ్యప్ప స్వామి ను ఎక్కువగా దక్షిణ భారతదేశంలో పూజించటం జరుగుతుంది.

అయ్యప్ప అనే పేరు విష్ణువు మరియు విష్ణు దేవుడి పేర్ల మీదుగా పెట్టడం జరిగింది. అయ్యప్ప లో అయ్యా అనగా విష్ణువు మరియు అప్ప అనగా శివుడు అని అర్థం. ఈయనను ధర్మం మరియు సత్యానికి ప్రతీకగా భావిస్తారు.చెడును నిర్ములించడానికి భక్తులు ఈయనను పిలుస్తారు.

అయ్యప్ప యొక్క చిత్రాలు ఒక అందమైన బ్రహ్మచారి దేవుడిగా మరియు మేడలో గంటను ధరించే దేవుడిగా వర్ణిస్తాయి. సౌత్ ఇండియాకి సంబంధించిన చిత్రాలలో పులి పై స్వారీ చేస్తున్నట్లు చూపిస్తాయి కానీ శ్రీలంకా లో మాత్రం తెల్ల ఏనుగుపై స్వారీ చేస్తున్నట్లు చిత్రాలు ఉంటాయి.

అయ్యప్ప శివుడి మరియు విష్ణు దేవుడి యొక్క శక్తులతో జన్మించారు. మహిషి అనే రాక్షసుడిని చంపి అయ్యప్ప కేరళ లోని శబరిమలై లో వెలిశారు. ప్రతి సంవత్సరం కొన్ని కోట్ల మంది అయ్యప్ప స్వామి దర్శనానికి వెళుతూ ఉంటారు.

ఈ పుణ్య క్షేత్రానికి భక్తులు డిసెంబర్ మరియు జనవరి నెల మొదలులో వస్తారు. అక్కడికి చేరుకోవటానికి భక్తులు కొన్ని వారాల ముందు నుంచే కాళీ నడకన బయలుదేరుతారు.

భక్తుల సందడి ఎక్కువగా ఉండటం కారణంగా ఈ ప్రాంతం ప్రపంచంలోనే అత్యధికంగా భక్తులు సందర్శించే ప్రాంతంగా నిలిచింది.

ఇతర మతాల వారు కూడా గౌరవించే హిందూ దేవతలలో అయ్యప్ప స్వామి ఒక్కరు. కేరళలో ముస్లింలు మరియు క్రైస్తవులు అయ్యప్ప స్వామిని గౌరవిస్తారు.

శబరిమలలో వయసుకు వచ్చిన అమ్మాయిలు మరియు మహిళలలకు ప్రవేశం లేదు.

అయ్యప్ప మరియు మహిషి వెనుక ఉన్న కారణం : 

మహిషాసురుడిని సంహరించినందుకు దేవతల పై పగ సాధించటానికి అతని సోదరి మహిషి అనే రాక్షసి బ్రహ్మ దేవుడి కోసం తపస్సు చేస్తుంది.

బ్రహ్మ దేవుడు ప్రత్యక్షం అయ్యిన తరవాత శివుడికి మరియు విష్ణుడి కి పుట్టిన సంతానం తప్ప నన్ను ఎవ్వరు కూడా జయించకూడదు అని వరం కోరుతుంది.    

అయ్యప్ప ఎలా పుట్టారు?

క్షీరసాగరమధనం అనంతరం దేవతలకు మరియు రాక్షసులకు అమృతం పంచడానికి విష్ణు దేవుడు మోహినిగా అవతారం ఎత్తారు.

విష్ణు దేవుడిని మోహిని అవతారం లో చూసిన శివుడు ఆమె వైపు ఆకర్షించబడుతారు. ఇలా శివుడి మరియు విష్ణువు కలయిక తో పుట్టిన సంతానమే అయ్యప్ప స్వామి. తండ్రి యొక్క ఆజ్ఞ ప్రకారం పంపా సరోవర తీరప్రాంతంలో శిశు రూపంలో అవతరించారు.

అదే సమయంలో అటుగా వేట చేయటానికి వెళుతున్న పందళం సామ్రాజ్య రాజు అయ్యప్ప ను చూస్తాడు. ఈ రాజు శివుడి యొక్క గొప్ప భక్తుడు. తనకి ఇంతవరకు సంతానం కలగలేదు కాబట్టి దేవుడే తనపై కరుణించి ఈ బిడ్డను ప్రసాదించాడని తన వెంట తీసుకువెళతారు.

అయ్యప్ప అంతఃపురం కి వెళ్లిన తరవాత కేవలం ఒక సంవత్సరం సమయంలో రాణి ఒక మెగా బిడ్డకు జన్మనిస్తుంది.

ఈ ఇద్దరు కొడుకులను చదువుకోవటానికి గురుకులానికి పంపిస్తారు.

మహిషి మరియు అయ్యప్ప యొక్క యుద్ధం: 

గురువు అయ్యప్పను  అవతార పురుషుడుగా గుర్తిస్తారు. గురుకులంలో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న తరవాత అయ్యప్పకు రాజు  పట్టాభిషేకం చేయాలనుకున్నారు. 

ఈ విషయం తల్లికి ఇష్టం లేకపోవటం వల్ల ఒక వ్యాధిని తగ్గించటానికి పులి పాలు కావాలి అని కోరుతుంది. ఈ పాలను అయ్యప్ప వెళ్లి తీసుకురావాలి అని కోరింది. పులి పాలు తీసుకురావటడానికి అయ్యప్ప అడవికి బయలుతేరుతారు.  

అడవిలో నారదుడు మహిషిని కలిసి నిన్ను చంపడానికి నారదుడు వస్తున్నాడు అని చెబుతాడు. 

మహిషి అయ్యప్పను చంపడానికి గేదె యొక్క రూపం దాల్చుతుంది. అయ్యప్ప మరియు మహిషి మధ్య యుద్ధం జరుగుతుంది. ఈ ఇద్దరి మధ్య జరిగే యుద్దాన్ని చూడటానికి అదృశ్యరూపంలో వస్తారు. 

అయ్యప్ప మరియు మహిషి కి జరిగే యుద్ధంలో మహిషి చనిపోతుంది. అయ్యప్ప కోరిక మేరకు దేవతలు పులులుగా మారుతారు. పులిగా మారిన ఇంద్రుడి పై కూర్చొని పులుల గుంపుతో రాజ్యానికి బయలుదేరుతారు.    

రాజ్యానికి చేరుకున్న అయ్యప్పకు పట్టాభిషేకం చేయాలనుకున్న రాజు మరియు తండ్రి కోరికను నిరాకరిస్తారు. దానికి బదులుగా తనకు ఒక ఆలయాన్ని నిర్మించామని కోరుతారు. 

తాను వదిలిన బాణం ఎక్కడ పడితే అక్కడ గుడి కట్టాలని కోరుతారు. ఆ బాణం 30 కిలోమీటర్ల దూరంలో వెళ్లి పడుతుంది. అక్కడ కట్టిన ఆలయాన్ని ప్రస్తుతం శబరిమల ఆలయం అని అంటున్నారు. అయ్యప్ప శబరిమలనుంచి భక్తుల పూజలు అందుకుంటున్నారు.   

Source: Ayyappan – Wikipedia        

Leave a Comment