శరద్ యాదవ్ రాష్ట్రీయ జనతా దళ్ కి చెందిన భారతీయ రాజకీయ నాయకుడు. ఈయన 7 సార్లు MLA గా మరియు 3 సార్లు MP గా ఉన్నారు.
Table of Contents
బాల్యం:
శరద్ యాదవ్ 1 జులై 1947 సంవత్సరంలో మధ్య ప్రదేశ్, హోషంగాబాద్ జిల్లాలోని బాబాయ్ గ్రామంలో నంద్ కిషోర్ యాదవ్ మరియు సుమిత్ర యాదవ్ అనే దంపతులకు జన్మించారు.
జబల్ పూర్ లోని రాబర్ట్‌సన్ కాలేజ్ నుంచి బాచిలర్ అఫ్ సైన్స్ డిగ్రీ ను సంపాదించారు. జబల్ పూర్ ఇంజనీరింగ్ కాలేజీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో బాచిలర్స్ అఫ్ ఇంజనీరింగ్ ను చదివారు.
కెరీర్:
1974 లో మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో జరిగిన లోక్‌సభ బై పోల్ ఎన్నికలలో గెలిచారు. 1977 లో అదే నియోజక వర్గం నుంచి మళ్ళీ గెలిచారు.
1981 లో జరిగిన బై పోల్ ఎన్నికలలో రాజీవ్ గాంధీ చేతిలో ఓడిపోయారు. 1984 లో జరిగిన ఎన్నికలలో ఉత్తర్ ప్రదేశ్ లోని బదౌన్ నియోజక వర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
1989 సంవత్సరంలో ఉత్తర ప్రదేశ్ లోని బదౌన్ నియోజక వర్గం నుంచి జనతా దళ్ సభ్యుడిగా పోటీ చేసి గెలిచారు.
తరవాత బీహార్ లోని మాధేపురా లోక్‌సభ నియోజకవర్గం నుంచి గెలిచారు. 2004 లో జరిగిన లాలు ప్రసాద్ వల్ల జరిగిన బై ఎలక్షన్స్ తప్ప 1991, 1996, 1999 మరియు 2009 లో జరిగిన లోక్ సభ ఎన్నికలను 4 సార్లు గెలిచారు.
ఈయన హవాలా కుంభకోణంలో నిందితుడిగా ఉన్నారు కానీ సుప్రీమ్ కోర్ట్ ఈ ఆరోపణలను కొట్టివేసింది.
లోక్ తాంత్రిక్ జనతా దళ్ :
జనతా దళ్ నుంచి విడిపోయిన తరవాత 2018 సంవత్సరంలో శరద్ యాదవ్ లోక్ తాంత్రిక్ జనతా దళ్(LJD) అనే రాజకీయ పార్టీ ను స్థాపించారు.
వ్యక్తిగత జీవితం:
శరద్ యాదవ్ యొక్క రాజకీయ జీవితం ఎక్కువగా బీహార్ లో గడిచింది.
యాదవ్ 15 ఫిబ్రవరి 1989 లో రేఖ యాదవ్ ను పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక కొడుకు మరియు ఒక కూతురు ఉన్నారు.
మరణం:
శరద్ యాదవ్ 12 జనవరి 2023లో 75 సంవత్సరాల వయస్సులో మరణించారు.