చంద్రిక రవి జీవిత చరిత్ర – Chandrika Ravi biography in Telugu

చంద్రిక రవి ఆస్ట్రేలియా కి చెందిన నటి, మోడల్ మరియు డాన్సర్. ఈమె పుట్టి పెరిగింది ఆస్ట్రేలియా అయినప్పట్టికీ యాక్టింగ్ మరియు మోడలింగ్ కెరీర్ ను కొనసాగించటానికి లాస్ ఏంజెల్స్ కి వెళ్లారు.

బాల్యం:

చంద్రిక 5 ఏప్రిల్ 1989 సంవత్సరంలో ఆస్ట్రేలియా లోని మెల్బోర్న్ నగరంలో భారత సంతతికి చెందిన రవి శ్రీధరన్ మరియు మాలిక రవి అనే దంపతులకు జన్మించారు.

చంద్రిక కేవలం మూడు సంవత్సరాల వయస్సు నుంచే డ్యాన్స్ చేయటం మొదలుపెట్టారు. 16 సంవత్సరాల వయస్సులో తన కెరీర్ ను మొదలుపెట్టారు.

2014 లో మిస్ మాగ్జిమ్ ఇండియాలో రన్నరప్ టైటిల్‌ను గెలుచుకున్నారు. 2012 మిస్ వరల్డ్ ఆస్ట్రేలియా లో మరియు మిస్ వరల్డ్ ఇండియా లో భారత సంతతికి చెందిన మొట్ట మొదటి ఫైనలిస్ట్ గా నిలిచారు.

చంద్రిక తన యాక్టింగ్ కెరీర్ ను 2018 లో విడుదల అయిన Sei (యాక్షన్ కామెడీ) అనే తమిళ సినిమా ద్వారా మొదలుపెట్టారు.

2018 లో విడుదల అయిన ఇరుట్టు అరైయిల్ మురట్టు కుత్తు ( Iruttu Araiyil Murattu Kuththu) అనే తమిళ అడల్ట్ హార్రర్ కామెడీ లో నటించారు. ఈ సినిమాలో చంద్రిక రవి దయ్యం పాత్రలో నటించి మంచి గుర్తింపును పొందారు.

Timeline:

2018: Iruttu Araiyil Murattu Kuththu మరియు Sei అనే తమిళ సినిమాలలో నటించారు.

2019: Un Kadhal Irundhal అనే తమిళ సినిమాలో నటించారు. ఇదే సంవత్సరం చీకటి గదిలో చితకొట్టుడు అనే తెలుగు అడల్ట్ హార్రర్ కామెడీ సినిమాలో నటించారు.

2023: వీర సింహ రెడ్డి అనే తెలుగు యాక్షన్ సినిమాలో మా బావ మనోభావాలు అనే పాటకి డ్యాన్స్ చేసారు.

ఈ పాటను షూట్ చేసేటప్పుడు చంద్రిక రవి లోయర్ బ్యాక్ పెయిన్ (వెన్నునొప్పి) తో భాదపడుతున్నారు. కానీ అలాగే షూటింగ్ ను పూర్తి చేసి తన డెడికేషన్ ను చూపించుకున్నారు.

వ్యక్తిగత జీవితం :

చంద్రిక రవి ఇంగ్లీష్ మరియు తమిళ్ భాషలను అనర్గళంగా మాట్లాడుతారు. మలయాళం మరియు తెలుగు భాషలను మాట్లాడటానికి నేర్చుకుంటున్నారు.

చంద్రిక రవి నటించిన అడల్ట్ కామెడీ సినిమాను తన తండ్రి యాక్టింగ్ పరంగానే చూసారని చెప్పారు.

సోషల్ మీడియా:

చంద్రిక రవి ట్విట్టర్ (Chandrika Ravi Twitter): 𝗖𝗵𝗮𝗻𝗱𝗿𝗶𝗸𝗮 𝗥𝗮𝘃𝗶 (@chandrikaravi_) / Twitter

చంద్రిక రవి ఇంస్టాగ్రామ్ (Chandrika Ravi Instagram): CHANDRIKA RAVI • ॐ (@chandrikaravi)

చంద్రిక రవి పేస్ బుక్ (Chandrika Ravi Facebook): Chandrika Ravi | Los Angeles CA | Facebook

Source:Chandrika Ravi – Wikipedia

Leave a Comment