వరలక్ష్మి శరత్ కుమార్ జీవిత చరిత్ర – Varalakshmi Sarath Kumar biography in Telugu

వరలక్ష్మి శరత్ కుమార్ భారత దేశానికి చెందిన నటి, ఈమె ముఖ్యంగా కన్నడ మరియు మలయాళం సినిమాలలో నటిస్తారు. అలాగే తమిళ్ మరియు తెలుగు సినిమాలలో కూడా నటిస్తారు.

బాల్యం :

వరలక్ష్మి 5 మార్చి 1985 లో కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో నటుడు శరత్ కుమార్ మరియు ఛాయా అనే దంపతులకు జన్మించారు.

వరలక్ష్మి సెయింట్ మైఖేల్ అకాడమీ నుంచి తన స్కూల్ చదువును పూర్తి చేసుకున్నారు. హిందూస్తాన్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ నుంచి మైక్రో బయాలజీ లో గ్రాడ్యుయేషన్ ను పూర్తి చేసారు.

ఎడిన్‌బర్గ్ యూనివర్సిటీ (University of Edinburgh) నుంచి బిజినెస్ మేనేజ్ మెంట్ లో మాస్టర్స్ చదివారు.

తన యాక్టింగ్ స్కిల్స్ ను మెరుగుపరచడానికి ముంబై లో ఉన్న అనుపమ్ ఖేర్ అచ్తింగ్ స్కూల్ లో చేరారు.

కెరీర్ :

వరలక్ష్మి 2003 లో విడుదల అయిన తమిళ్ సినిమా బాయ్స్ (Boys) కి ఆడిషన్ ఇచ్చినప్పుడు లీడ్ రోల్ లో యాక్టింగ్ చేయటానికి సెలెక్ట్ అయ్యారు. కానీ తండ్రి శరత్ కుమార్ వద్దు అని చెప్పి నప్పుడు వదిలేసారు. ఈ సినిమా లాగానే 2004 లో విడుదల అయిన కాదల్ ( Kaadhal) మరియు 2008 లో విడుదల అయిన సరోజ సినిమాను వదిలేసారు.

2012 లో విడుడల అయిన సినిమా పోదా పొడి ( Podaa Podi) కోసం వరలక్ష్మి ను 2008 లో ఎన్నుకోవటం జరిగింది. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల సినిమా విడుదల అవ్వటానికి 4 సంవత్సరాలు పట్టింది. ఈ సినిమాలో లండన్ కు చెందిన డాన్సర్ గా నటించటానికి అవకాశం లభించినందుకు ఆ పాత్ర చేయటానికి ఒప్పుకున్నారు.

ఈ సినిమా ద్వారా క్రిటిక్స్ యొక్క ప్రశంసలను అందుకుంది.కానీ బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా విజయం సాధించలేదు.

ఈ సినిమా తరవాత మధ గజ రాజ (Madha Gaja Raja) అనే మసాలా సినిమాలో హీరో విశాల్ తోపాటు కలిసి నటించారు కానీ ఆర్థిక కారణాల వల్ల ఆ సినిమా విడుదల అవ్వలేదు.

వరలక్ష్మి తన రెండవ సినిమా గా 2014 లో విడుదల అయిన మాణిక్య (Maanikya) లో నటించారు. ఆ సంవత్సరంలో విడుదలైన సినిమాలలో అత్యంత లాభదాయకమైన కన్నడ చిత్రాలలో ఒక్కటిగా నిలిచింది.

2014 వ సంవత్సరంలో తరై తప్పట్టై (Tharai Thappattai) సినిమా యొక్క షూటింగ్ ను ప్రారంభించారు. ఈ సినిమా లో కరకట్టం డ్యాన్సర్ గా నటించడానికి 10 కిలోల బరువును తగ్గించుకున్నారు.

2017 లో వరలక్ష్మి విక్రమ్ వేద, నిబునన్, విస్మయ, సత్య, కట్టు మరియు మాస్టర్ పీస్ లాంటి విజయవంతమైన సినిమాలలో నటించారు.

2018 లో ఉన్నై అరిందాల్ TV షో లో హోస్ట్ గా కూడా నటించారు. ఇదే సంవత్సరం సండకోజి 2 మరియు సర్కార్ సినిమాలలో నటించారు.

2019 లో తెలుగు లో తన మొట్ట మొదటి సినిమా తెనాలి రామకృష్ణ BA. BL లో నటించారు. 2020 లో విడుదల అయిన డానీ (Danny) సినిమాలో ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా నటించారు.

Timeline:

2012: పోదా పొడి అనే తమిళ సినిమాలో నటించారు. ఇదే సంవత్సరం మధ గజ రాజా సినిమాలో నటించారు కానీ సినిమా విడుదల కాలేదు. 

2014: మాణిక్య అనే కన్నడ యాక్షన్ డ్రామా సినిమాలో నటించారు. 

2015: రానా అనే కన్నడ  యాక్షన్ కామెడీ సినిమాలో నటించారు.  

2016: కస్బా (Kasaba) అనే మలయాళం యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో నటించారు. అదే సంవత్సరం తరై తప్పట్టై అనే తమిళ సినిమాలో నటించారు. 

2017: విక్రమ్ వేద, నిబునన్, సత్య అనే తమిళ సినిమాలలో నటించారు. విస్మయ అనే కన్నడ సినిమాలో మరియు కట్టు, మాస్టర్ పీస్ అనే మలయాళం సినిమాలలో నటించారు. 

2018: మిస్టర్ చంద్రమౌళి, ఏచ్చ్చరిక్కై, సండకోజహి 2, సర్కార్, మారి 2 అనే తమిళ సినిమాలలో నటించారు. 

2019: నీయ 2 అనే తమిళ సినిమా మరియు తెనాలి రామకృష్ణ బిఏ.బిఎల్ అనే తెలుగు సినిమాలో నటించారు. 

2020: వెల్వెట్ నగరం, డాన్నీ, కన్ని రాశి అనే తమిళ సినిమాలలో నటించారు. 

2021: క్రాక్, నాంది అనే తెలుగు సినిమాలలో నటించారు. 

రణం అనే కన్నడ సినిమాలో చేజింగ్, సింగా పార్వై అనే తమిళ్ సినిమాలో నటించారు.    

2022:   తెలుగు లో పక్కా కమర్షియల్ మరియు యశోద సినిమాలో నటించారు. ఇరవిన్ నిజాల్, పొయిక్కల్ కుత్తిరై, కట్టేరి అనే తమిళ సినిమాలలో నటించారు. 

2023: తమిళ్ లో  V3 సినిమాలో నటించారు. తెలుగులో వీర సింహ రెడ్డి అనే సినిమాలో నటించారు.     

Source: Varalaxmi Sarathkumar – Wikipedia

1 thought on “వరలక్ష్మి శరత్ కుమార్ జీవిత చరిత్ర – Varalakshmi Sarath Kumar biography in Telugu”

Leave a Comment