అబ్దెల్ ఫత్తా ఎల్-సిసి ఈజిప్ట్ కి చెందిన రాజకీయ నాయకుడు మరియు రిటైర్డ్ సైనిక అధికారి. ఈయన 2014 నుంచి ఈజిప్ట్ యొక్క ఆరవ మరియు ప్రస్తుత రాష్ట్రపతి గా ఎన్నుకోబడ్డారు.
2014 లో ఈజిప్ట్ మిలిటరీ జనరల్ గా రిటైర్డ్ అవ్వక ముందు 2013 నుంచి 2014 వరకు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ గా పనిచేసారు. 2012 నుంచి 2013 వరకు మినిస్టరీ అఫ్ డిఫెన్స్ గా పనిచేసారు. 2010 నుంచి 2012 వరకు ఈయన మిలిటరీ ఇంటలిజెన్స్ యొక్క డైరెక్టర్ గా పనిచేసారు. 2014 లో ఈయనకు ఫీల్డ్ మార్షల్ గా ప్రమోషన్ లభించింది.
Name (పేరు) | అబ్దెల్ ఫత్తా ఎల్-సిసి |
Born (పుట్టింది) | 19 November 1954 |
Occupation (వృత్తి) | ఈజిప్ట్ అధ్యక్షుడు |
Parents (తల్లిదండ్రులు) | హుస్సేన్ ఖలీలీ అల్-సిసి & సోద్ మొహమ్మద్ |
Religion (మతం) | ఇస్లాం |
Spouse (భార్య) | ఎన్టీసార్ అమెర్ (Entissar Amer) |
Table of Contents
బాల్యం :
అబ్దెల్ ఫత్తా పాత కైరో లో 19 నవంబర్ 1954 వ సంవత్సరంలో హుస్సేన్ ఖలీలీ అల్-సిసి మరియు సోద్ మొహమ్మద్ అనే దంపతులకు పుట్టారు. ఈయన తన చిన్న తనం గమలేయ (Gamaleya) ప్రాంతంలో అల్-అజార్ మసీదు (al-Azhar) వద్ద గడిపారు. ఈ ప్రాంతంలో ముస్లింలు, క్రైస్తవులు మరియు యూదులు (Jews) నివసించేవారు.అబ్దెల్ ఫత్తా ఆ సమయంలో చర్చి నుంచి బెల్ శబ్దాలు మరియు యూదుల యొక్క సమూహం ఎలాంటి అడ్డంకులు వెళ్ళటం కూడా చూసేవారు.
మిలిటరీ చదువు :
ఈజిప్ట్ మిలిటరీ అకాడమీ నుంచి గ్రాడ్యుయేషన్ ను పూర్తి చేసుకొని ఈజిప్షియన్ సాయుధ దళాలలో మరియు ఈజిప్ట్ మిలిటరీ లో కూడా పనిచేసారు.
1977: ఎల్-సిసి (El-Sisi) ఈజిప్ట్ మిలిటరీ అకాడమీ నుంచి గ్రాడ్యుయేషన్ ను పూర్తి చేసుకున్నారు.
1987: ఈజిప్షియన్ కమాండ్ అండ్ స్టాఫ్ కాలేజ్ నుంచి జనరల్ కమాండ్ మరియు స్టాఫ్ కోర్సు లో చేరారు.
1992: యునైటెడ్ కింగ్‌డమ్ లోని జాయింట్ కమాండ్ మరియు స్టాఫ్ కాలేజి నుంచి జనరల్ కమాండ్ మరియు స్టాఫ్ కోర్సు లో చేరారు.
2003: ఈజిప్ట్ లోని నాజర్ మిలిటరీ అకాడమీ నుంచి వార్ కోర్స్ లో చేరారు.
2006: యునైటెడ్ స్టేట్స్ లోని యునైటెడ్ స్టేట్స్ ఆర్మీ వార్ కాలేజి నుంచి వార్ కోర్స్ లో చేరారు.
తరవాత సౌదీ అరేబియా లోని రియాద్ లో ఈజిప్షియన్ సాయుధ దళాలలో మిలిటరీ ఎక్స్పర్ట్ గా కూడా పనిచేసారు.
కెరీర్:
1977 వ సంవత్సరంలో యాంత్రిక పదాతిదళంలో (mechanized infantry) మిలిటరీ అధికారిగా పనిచేసారు.
ఈజిప్ట్ సాయుధ దళాల సుప్రీం కౌన్సిల్ (Supreme Council of the Armed Forces of Egypt) లో అతి చిన్న వయసు వాడిగా కూడా ఉన్నారు.
ఈయన సుప్రీమ్ కౌన్సిల్ లో ఉన్నప్పుడు మహిళా ప్రదర్శన కారులకు వర్జినిటీ టెస్ట్ చేసారన్న ఆరోపణలు ఉన్నాయి.
దీనికి జవాబుగా ఎల్-సిసి తాము కేవలం మహిళలను రేపు నుంచి కాపాడటానికి మరియు సైనికులపై రేప్ కి సంబంధించిన ఆరోపణలు చేయకుండా ఉండటానికి వర్జినిటీ టెస్ట్ చేసాము అని అన్నారు.
మిలిటరీ లో ఉన్నప్పుడు పలు ముఖ్యమైన పదవులలో ఎల్-సిసి పనిచేసారు.
డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ :
12 ఆగస్టు 2012 వ సంవత్సరంలో అప్పటి ప్రెసిడెంట్ మహ్మద్ మోర్సీ (Mohamed Morsi) ఎల్ సిసి ను రక్షణ మంత్రి (Minister of Defense) గా నియమించబడ్డారు.
మోర్సీ తరవాత వచ్చిన ప్రభుత్వంలో కూడా ఎల్ సిసి అలాగే కొనసాగారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం లో డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ గా కూడా పనిచేసారు. 27 జనవరి 2014 లో ఫీల్డ్ మార్షల్ గా పదోన్నతి పొందారు.
మోర్సీ వ్యతిరేక తిరుగుబాటు:
30 జూన్ 2013 లో ఈజిప్ట్ విధులలో ప్రజలు పెద్దమొత్తంలో ప్రెసిడెంట్ మోర్సీ ను నిందిస్తూ ప్రదర్శనలు చేసారు. ప్రదర్శనలు తరవాత గొడవల రూపంలో మారాయి.
ఈజిప్ట్ ఆర్మీ ప్రదర్శనలు చేస్తున్న వారి డిమాండ్లను తీర్చాలని పొలిటికల్ పార్టీలకు 48 గంటల అల్టిమేటం ఇచ్చింది.
3 జులై 2013 వరకు ప్రదర్శనలను చేస్తున్న వారి డిమాండ్లను పూర్తి చేయకపోతే మిలిటరీ జోక్యం చేసుకుంటుందని ప్రకటించారు.
3 జులై 2013 వరకు కూడా ప్రదర్శన కారుల డిమాండ్లను పూర్తి చేయకపోవటం వల్ల మిలిటరీ జోక్యం చేసుకొని ప్రెసిడెంట్ మోర్సీ ను తొలగించింది.
మోర్సీ స్థానంలో తాత్కాలికంగా సుప్రీం రాజ్యాంగ న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి అడ్లీ మన్సూర్ (Adly Mansour) భాద్యతలు చేపట్టారు.
మరోవైపు ముస్లిం బ్రదర్ హుడ్ సంస్థ మోర్సీ ని పదవి నుంచి తీసి వేసినందుకు నిరసనలు చేయటం మొదలుపెట్టారు. ముస్లిం బ్రదర్ హుడ్ అనేది ఈజిప్ట్ కి చెందిన ఒక రైట్ వింగ్ సంస్థ.
తాత్కాలిక ప్రెసిడెంట్ అడ్లీ మన్సూర్ ముస్లిం బ్రదర్ హుడ్ సంస్థ కు చెందిన వారిని అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసారు.
మోర్సీ ఈజిప్ట్ ప్రజల యొక్క డిమాండ్లను పూర్తి చేయలేదని ఎల్ సిసి టీవీ ద్వారా చెప్పారు, అలాగే నిరసనలు చేస్తున్న వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటానని కూడా చెప్పారు.
నిరసనలు చేస్తున్న వారిని చెదరగొట్టడానికి ఎల్ సిసి మిలిటరీ మరియు పోలీసుల సహాయం తీసుకున్నారు. ఈ చర్య హింసాత్మకంగా మారటంతో 638 మంది చనిపోయారు.
ఆగస్టు 3, 2013 లో వాషింగ్టన్ పోస్ట్ ఇచ్చిన ఇంటర్వ్యూ లో అమెరికా నుంచి ఈజిప్ట్ కి తగిన మద్దతు లభించలేదని ఒబామా ప్రభుత్వాన్ని నిందించారు.
నవంబర్, 2013 లో నిరసనలు చేయటంపై నిషేధం విధించటం జరిగింది. 2013 లో పోలీస్ స్టేషన్ పై దాడి చేసినందుకు 24 మార్చి 2014 లో ముస్లిం బ్రదర్ హుడ్ కి చెందిన 529 మందిని ఉరిశిక్ష విధించారు.
మోర్సీ కి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న వారు ఎల్ సిసి కు మద్దతు తెలపటం మొదలుపెట్టారు. సోషల్ మీడియా లో తమ ప్రొఫైల్ పిక్చర్ ను ఎల్ సిసి గా పెట్టుకున్నారు.
టీవీ లలో మరియు షోస్ లలో ఎల్ సిసి ను పొగుడుతూ ఈజిప్ట్ కి ఒక కొత్త కూడా నాయకుడు దొరికాడు అని పొగిడారు.
6 డిసెంబర్ 2013 లో ఎల్ సిసి పేరు టైం మ్యాగజిన్ వార్షిక రీడర్ పోల్ లో “Time Person of the Year” గా ఎంపిక చేయబడ్డారు. కొంత కాలంలోనే ఎల్ సిసి ప్రజాదరణ పొందారు మరియు ప్రజలకు ఒక నాయకుడు అయ్యారు.
ప్రజలందరు ఎల్ సిసి ప్రెసిడెంట్ గా కావాలనుకున్నారు, వీటికి సంబంధించిన ప్రచారాలు చేయసాగారు అలాగే ఎల్ సిసి ప్రెసిడెంట్ కావాలని సంతకాలు కూడా చేయసాగారు.
ఎల్ సిసి మాత్రం తనకు ప్రెసిడెంట్ కావాలని లేదు అని ప్రకటించారు. మరోవైపు ఎల్ సిసి ప్రెసిడెంట్ గా కావాలని ఈజిప్ట్ కి చెందిన రాజకీయ పార్టీలు మరియు బయటి దేశ పార్టీలు కోరారు. రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ కూడా ఎల్ సిసి ప్రెసిడెంట్ కావాలని కోరారు.
Kamel Gemilak (మీరు మొదలుపెట్టిన పనిని అంతం చేయండి) అనే ఉద్యమం ను మొదలుపెట్టిన ఈజిప్ట్ ప్రజలు 2 కోట్ల 60 లక్షల ప్రజల సంతకాలు చేసి ఎల్ సిసి తమ ప్రెసిడెంట్ కావాలని కోరారు.
6 ఫిబ్రవరి 2014 లో కువైట్ కు చెందిన వార్త పత్రిక అల్-సెయస్సా ఎల్ సిసి ప్రెసిడెంట్ ఎన్నుకోబడటానికి సిద్ధంగా ఉన్నారని తెలిపింది.
26 మార్చి 2014 లో ప్రెసిడెంట్ ఎన్నికలలో పోటి చేయబోతున్నానని ఎల్ సిసి ప్రకటించారు.
2014 లో జరిగిన ప్రెసిడెంట్ ఎన్నికలలో ఎల్ సిసి 96% తో గెలిచారు. ఈ ఎన్నికలలో ఇస్లామిక్ పార్టీలైన ముస్లిం బ్రదర్‌హుడ్ ఫ్రీడమ్ & జస్టిస్ పార్టీ పాల్గొనలేదు.
ప్రెసిడెంట్:
8 జూన్ 2014 లో ప్రెసిడెంట్ గా ఎల్ సిసి ప్రమాణ స్వీకారం చేసారు. ఈ రోజును ఈజిప్ట్ లో సెలవు దినంగా ప్రకటించి సంబరాలు జరుపుకున్నారు.
ప్రెసిడెంట్ అయ్యిన తరవాత ఈజిప్ట్ యొక్క అభివృద్ధి కోసం కృషి చేసారు.
వ్యక్తిగత జీవితం:
ఎల్ సిసి కి ముగ్గురు కొడుకులు మరియు ఒక కూతురు ఉన్నారు. ఎల్ సిసి లో ఉన్న నిశ్శబ్ద స్వభావం కారణంగా ఆయనను Quiet General (నిశ్శబ్దంగా ఉండే జనరల్ ) అని పిలుస్తారు.
Source: Abdel Fattah el-Sisi – Wikipedia