హనీ రోజ్ యొక్క పూర్తి పేరు హనీ రోజ్ వర్గీస్, ఈమె భారతదేశానికి చెందిన నటి. ఈమె ముఖ్యంగా మలయాళం సినిమాలలో నటిస్తుంది. మలయాళం తో పాటు తమిళ్, తెలుగు మరియు కన్నడ సినిమాలలో కూడా నటిస్తారు.
Name (పేరు) | Honey Rose Varghese (హనీ రోజ్ వర్గీస్) |
Born (పుట్టింది) | 5 September 1991, Moolamattom (మూలమట్టం) |
Occupation (వృత్తి) | Malayalam Actress (మలయాళం నటి) |
Parents (తల్లిదండ్రులు) | Rosily & Varkey (వర్గీస్ థామస్ మరియు రోజ్ వర్గీస్) |
Religion (మతం) | Christian (క్రైస్తవ) |
https://www.instagram.com/honeyroseinsta/ | |
https://twitter.com/HoneyRoseOffl_ | |
https://www.facebook.com/IamDhwani/ |
బాల్యం :
హనీ రోజ్ కేరళ రాష్ట్రం, తొడుపుజ టౌన్ లోని మూలమట్టం లో సాంప్రదాయ క్రిస్టియన్ కుటుంబానికి చెందిన వర్గీస్ థామస్ మరియు రోజ్ వర్గీస్ దంపతులకు జన్మించారు.
మూలమట్టం లోని S.H.E.M హై స్కూల్ నుంచి తన స్కూల్ చదువును పూర్తి చేసారు. కొచ్చి లోని St. జేవియర్ ఉమెన్స్ కాలేజీ నుంచి బాచిలర్ అఫ్ ఆర్ట్స్ డిగ్రీ ను సంపాదించారు.
కెరీర్ :
2005 సంవత్సరంలో 14 సంవత్సరాల వయస్సులో మలయాళం సినిమా బాయ్ ఫ్రెండ్ (Boyy Friennd) ద్వారా తన యాక్టింగ్ కెరీర్ ను ప్రారంభించారు.
2014 లో ఈ వర్షం సాక్షిగా (Ee Varsham Sakshiga) అనే తెలుగు సినిమాలో నటించారు. హనీ రోజ్ తన 50 సినిమాగా డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్య సినిమా ఆలయం లో నటించారు.
2012 లో విడుదలైన త్రివేండ్రం లాడ్జ్ సినిమా హనీ రోజ్ కి మంచి పేరును సంపాదించి పెట్టింది.
ఈ సినిమాలో హనీ రోజ్ పాత్ర పేరు ధ్వని నంబియార్, ఈ సినిమా హిట్ అయ్యిందని తెలుసుకొని తన స్క్రీన్ పేరు ను ధ్వని గా పెట్టుకోవాలనుకున్నారు.
కానీ అంజు సుందరికల్ సినిమా చేసేటప్పుడు తన నిర్ణయాన్ని మార్చుకున్నారు.
హనీ రోజ్ దైవతింటే సొంతం క్లీటస్, మై గాడ్, కనల్, ఇట్టిమణి: మేడ్ ఇన్ చైనా, బిగ్ బ్రదర్ మరియు సర్ సి. పి లాంటి మంచి సినిమాలలో నటించారు.
Source:Honey Rose – Wikipedia