మకర సంక్రాంతి అంటే ఏమిటి – What is Makara Sankranti in Telugu?

మకర సంక్రాంతిను ఉత్తరాయణ, మఘి లేదా సంక్రాతి అని కూడా అంటారు. ఇది ఒక హిందువులకు చెందిన ముఖ్యమైన పండుగలలో ఒకటి. సాధారణంగా ఈ పండగ ప్రతి సంవత్సరం జనవరి 14 వ తారీఖున వస్తుంది.  

 సంవత్సరంలోని 12 నెలలు సూర్యుడు ఒక్కొక్క రాశిలో ప్రవేశిస్తాడు. సూర్యుడు ఏ రాశి లో ప్రవేశిస్తే ఆ రాశి ఆ సంక్రాతి గా పిలవబడుతుంది. 

సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలో ప్రవేశించినప్పుడు ఆ రాశి ను మకర సంక్రాంతి అని అంటారు. ఈ పండగ ను సూర్య దేవతకు అంకితం చేయబడుతుంది. మకర సంక్రాంతి  పండగను భారతదేశం అంతటా జరుపుకోటం జరుగుతుంది. 

ప్రతి సంవత్సరం  జూలై 16 నుండి  జనవరి 14 వరకు ఉండే కాలాన్ని దక్షిణాయణం అని అంటారు. జనవరి 15 నుండి జులై 15 వరకు ఉండే కాలాన్ని ఉత్తరాయణం అని అంటారు. 

హిందువుల పండుగలలో సంక్రాంతి పండగ మాత్రమే సూర్యుడి గమనాన్ని అనుసరించి జరుపోవటం జరుగుతుంది. మనం రోజు వినియోగించే గ్రెగోరియన్ క్యాలెండర్ కూడా సూర్య గమనాన్ని అనుసరిస్తుంది కాబట్టి సంక్రాంతి ప్రతి సంవత్సరం ఒకే రోజున వస్తుంది. సాధారణంగా సంక్రాంతి ప్రతి సంవత్సరం జనవరి 14 రోజున వస్తుంది, కానీ లీపు సంవత్సరంలో జనవరి 15 న వస్తుంది. 

ప్రాముఖ్యత: 

ఈ పండగను ప్రజలు  చాలా ఆధ్యాత్మికంగా జరుపుకుంటారు. ఈ రోజున  గంగా, యమున, గోదావరి, కృష్ణ మరియు కావేరి నదులలో పవిత్ర స్నానం చేయటం జరుగుతుంది, ఇలా చేయటం వల్ల పుణ్యం కలుగుతుందని మరియు పాపలు తొలగిపోతాయని నమ్ముతారు.   

ఈ పండగ రోజు రుచికరమైన వంటలను చేసి కుటుంబానికి చెందిన వారు ఒక దగ్గరికి చేరి ఆనందంగా జరుపుకుంటారు. భారతదేశం అంతటా  రబి పంట సాగు కూడా మొదలవుతుంది. ఈ పండగ రోజున బోగి మంటలు చేయటం మరియు గాలిపటాలను ఎగరవేయటం చేస్తారు. 

ఈ పండగను వివిధ ప్రాంతాలలో వివిధ పేర్లతో పిలవటం జరుగుతుంది.

మకర సంక్రాంతి ను ముఖ్యంగా 4 రోజులలో జరుపుకుంటారు. భోగి, మకర సంక్రాంతి, కనుమ మరియు ముక్కనుమ ఇలా 4 రోజులలో జరుపుకుంటారు.   

1) భోగి :

భోగి సంక్రాంతి పండగ యొక్క మొదటి రోజు. ఈ రోజును సూర్యోదయం కన్నా ముందు బోగిమంటలతో జరుపుకుంటారు. ఈ రోజును చలిని పార ద్రోలడానికి జరుపుకుంటారు. భోగి మంటలను ఇంట్లో ఉన్న పాత సామానులను మరియు పనికి రాని సామగ్రితో వెలిగించి కొత్త వాటితో  ఒక కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. రేగి పండ్లు, చెరుకు గడలు మరియు వివిధ రకాల పువ్వులతో ఈ పండగను జరుపుకుంటారు. డబ్బులను పువ్వులు మరియు పండ్ల మధ్య ఉంచి చిన్న పిల్లలపై గుమ్మరిస్తారు.   

2) మకర సంక్రాంతి :

ఈ రోజున పాలు పొంగించి  పిండి వంటలైన అరిసెలు, జంత్రికలు, బొబ్బట్లు, సాకినాలు, పులిహోర, పరమాన్నం, గారెలు చేసుకుంటారు. ఈ రోజు ను సూర్య దేవుడికి అంకితం చేస్తారు. ఈ రోజున పితృ తర్పణాలు కూడా ఇవ్వటం జరుగుతుంది. 

ఇదే రోజు గంగిరెద్దులు ఇంటింటికి వెళ్లి కానుకలను స్వీకరిస్తాయి.       

3) కనుమ :

ఈ రోజును తమకు వ్యవ్యసాయంలో ఎంతో సహాయపడ్డ జంతువులకు థాంక్స్ చెబుతూ జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాలలో కోడి పందేలు కూడా నిర్వహిస్తారు.   

4) ముక్కనుమ: 

ఈరోజున కుటుంబాలు ఒక దగ్గరికి వచ్చి ఆనందంగా జరుపుకుంటారు. 

Source: Sankranti – Wikipedia

Leave a Comment