ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి భారతదేశానికి చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు. 18 వ శతాబ్దం మొదలులో రాయలసీమ లో పాలెగాళ్ల వ్యవస్థ ఉండేది. పాలెగాళ్ళు ప్రముఖమైన స్థానిక నాయకులుగా ఉండేవారు. ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి కూడా వీరిలో ఒకరు.
Table of Contents
బాల్యం :
ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి 24 నవంబర్, 1806 వ సంవత్సరంలో నంద్యాల జిల్లా లోని ఉయ్యాలవాడ మండలం, రూపనగుడి గ్రామంలో జన్మించారు. ఈయన తండ్రి కూడా పాలెగర్ మరియు తల్లి పాలెగార్ యొక్క కూతురు. నరసింహ రెడ్డి కుటుంబం జాగిర్దారులకు చెందింది.
రైతుల ఉద్యమం :
నిజాం నవాబు రాయలసీమ ప్రాంతాలను బ్రిటీష్ వారికి అప్పగించటంతో పాలెగాళ్ళు బ్రిటిష్ అధికారం లోకి వచ్చారు. ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా బ్రిటిష్ ప్రభుత్వం వారి ఆస్తులను ఆక్రమించుకోవాలని ఉద్దేశంతో పాలెగాళ్ళ వ్యవస్థను రద్దు చేసారు. బదులుగా వారికి నెలవారీ జీతం ఇవ్వటం మొదలుపెట్టారు.
1803 వ సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ చెన్నై ప్రెసిడెన్సీ లో పర్మనెంట్
సెటిల్మెంట్ (Permanent Settlement) అనే విధానాన్ని విధించింది. ఈ పద్దతి లో ఎవరైనా సాగు చేయవచ్చు కానీ ఈస్ట్ ఇండియా కంపెనీకి మాత్రం నిర్ణీత మొత్తం చెల్లిచాల్సి ఉంటుంది. 10 సంవత్సరాల ముందు బెంగాల్ ప్రెసిడెన్సీ లో కూడా బ్రిటిష్ ప్రభుత్వం ఇలాగే చేసింది.
బ్రిటిష్ ప్రభుత్వం అమలు చేయబోతున్న ఈ పద్దతి కి పాలెగాళ్లు మరియు ఉన్నత స్థాయిలో ఉన్న వారు వ్యతిరేకత తెలిపారు. వ్యతిరేకతకు కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. కొన్ని తరాలుగా అధికారంలో ఉన్న వారిని ఒకేసారి తీసేయటం మరియు వారి భూములను లాక్కోవడం చేసారు.
లాక్కున్న భూములకు తగిన మొత్తం కూడా చెల్లించలేదు. లాక్కున్న భూములను ఇతరులకు పంచారు, ఇలా భూములను పంచటం వెనక ఉన్న ముఖ్య కారణం సాగు ను పెంచటం. ఇలా సాగు ద్వారా నిర్ణీత మొత్తాన్ని వసూలు కూడా చేసేవారు.
రైత్వారీ వ్యవస్థ ద్వారా బ్రిటిష్ ప్రభుత్వం ఎక్కువగా ఆదాయం పొందాలని అనుకుంది. బ్రిటీష్ ప్రభుత్వ కాలంలో ప్రవేశపెట్టబడిన భూ రెవెన్యూ వ్యవస్థనే రైత్వారీ వ్యవస్థ అని అంటారు.
చిన్న స్థాయి సాగుదారులు క్రమంగా తమ భూములను కోల్పోయసాగారు. ఈస్ట్ ఇండియా కంపెనీ రైతులను దోపిడీ చేస్తుందని ప్రజలు అర్థం చేసుకున్నారు. సంవత్సరాల తరబడి సంప్రదాయంగా వ్యవసాయం చేస్తున్న వారికి జీవనాధారం ఇక ఉండబోదు అనే అభిప్రాయం ఏర్పడింది.
సాంప్రదాయ వ్యవస్థ లేక పోవటం వల్ల ఇంతకు ముందుకు అధికారంలో ఉన్న పాలెగాళ్ళు చాలా బాధపడ్డారు. తాము చేసే విన్నపాలను కూడా ఎవ్వరూ పట్టించుకోలేదు.
రైతుల వ్యతిరేకతను పాలెగాళ్ళు బ్రిటిష్ ప్రభుత్వం తో పోరాడటానికి ఉపయోగించాలని అనుకున్నారు.
నరసింహ రెడ్డి కుటుంబం సభ్యులు చనిపోయిన తరవాత వారి భూములను కూడా తీసుకున్నారు. కానీ పెన్షన్ డబ్బును మాత్రం పెంచలేదు.
ఈస్ట్ ఇండియా కంపెనీ రైతులను దోపిడీ చేస్తుందని ప్రజలు అర్థం చేసుకున్నారు. సంవత్సరాల తరబడి సంప్రదాయంగా వ్యవసాయం చేస్తున్న వారికి జీవనాధారం ఇక ఉండబోదు అనే అభిప్రాయం ఏర్పడింది.
సాంప్రదాయ వ్యవస్థ లేక పోవటం వల్ల ఇంతకు ముందుకు అధికారంలో ఉన్న పాలెగాళ్ళు చాలా బాధపడ్డారు. తాము చేసే విన్నపాలను కూడా ఎవ్వరూ పట్టించుకోలేదు.
రైతుల వ్యతిరేకతను పాలెగాళ్ళు బ్రిటిష్ ప్రభుత్వం తో పోరాడటానికి ఉపయోగించాలని అనుకున్నారు.
నరసింహ రెడ్డి కుటుంబం సభ్యులు చనిపోయిన తరవాత వారి భూములను కూడా తీసుకున్నారు. కానీ పెన్షన్ డబ్బును మాత్రం పెంచలేదు.
బ్రిటిష్ ప్రభుత్వం పై పోరాటం :
1846 లో బ్రిటిష్ ప్రభుత్వం గుడ్లదుర్తి, కోయిలకుంట్ల మరియు నొస్సం ప్రాంతాలలోని ప్రజలు చనిపోయిన తరవాత వారి భూములను కూడా బ్రిటిష్ ప్రభుత్వం తీసుకుంది.
అన్యాయం జరిగిన ప్రజలందరు నరసింహ రెడ్డిను ప్రోత్సహించగా ప్రజల నాయకుడిగా నిలిచారు.
ముందుగా కోయిలకుంట్ల ప్రాంతంలో ఇనాం భూములను కోల్పోయిన వారు సాయుధ బృందం (armed group) గా ఏర్పడ్డారు. 1846 లో ఈ సేనను నరసింహ రెడ్డి ముఖ్య సహచరుడు వడ్డే ఓబన్న నాయకత్వం వహించారు.
చాలా తక్కువ సమయంలో ఈ బృందానికి రైతుల మద్దతు లభించింది. ఇలా తయారు అయిన సేన కోయిల్‌కుంట్ల లో దాడి చేసి ఖజానాను దోచుకుని పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో మిట్టపల్లి వద్ద పలు పోలీసు అధికారులను చంపటం జరిగింది. అలాగే రుద్రవరం ప్రాంతాన్ని కూడా దోచుకొని అల్మోర్ చేరుకున్నారు.
ఫలితంగా ఓబన్న తో పాటు ఉన్న 5000 సేన మరియు బ్రిటిష్ ప్రభుత్వానికి యుద్ధం జరిగింది. ఈ యుద్ధం లో 200 రెబెల్స్ చంపబడ్డారు మరియు కొంతమంది పట్టుబడ్డారు.
మిగతావారు కొత్తకోట, గిద్దలూరు వైపు వెళ్లి అక్కడ ఉన్న నరసింహ రెడ్డి కుటుంబాన్ని తీసుకొని నల్లమల కొండల వైపు వెళ్లారు.
మరోవైపు బ్రిటిష్ ప్రభుత్వం నరసింహ రెడ్డి ను పట్టించిన వారికి నచ్చాడు బహుమతి ఇస్తామని కూడా ప్రకటన చేసారు.
తరవాత పోలీసులకు మరియు రెబెల్స్ కు మధ్య జరిగిన ఘర్షణలతో 50 దాకా రెబెల్స్ చనిపోయారు, 90 మంది పట్టుబడ్డారు.
నరసింహ రెడ్డి కూడా పట్టుబడ్డారు, ఈయనను దోషి గా నిర్దారించి ఉరి శిక్ష విధించారు.
మరణం :
1847 వ సంవత్సరం 22 ఫిబ్రవరి రోజున కోయిలకుంట్ల లో బహిరంగంగా 2000 జనాల ముందు రెడ్డి ను ఉరి తీసారు.
ఈయన జీవితాన్ని ఆధారం చేసుకొని హీరో చిరంజీవి సైరా నరసింహా రెడ్డి సినిమాను తీయటం జరిగింది. ఈ సినిమాను 2019 అక్టోబర్ 2 న విడుదల చేయబడింది.
25 మర్చి 2021 న ఓర్వకల్ దగ్గర ఉన్న కర్నూల్ ఎయిర్ పోర్ట్ కి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయం (Uyyalawada Narasimha Reddy Airport) అని పేరు పెట్టారు.