దుగ్గిరాల గోపాలకృష్ణయ్య భారతదేశానికి స్వాతంత్ర సమరయోధుడు మరియు ఆంధ్ర ప్రదేశ్ నుంచి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ యొక్క సభ్యుడు. ఈయనకు ఆంధ్ర రత్న అనే బిరుదు కూడా ఉంది.
Table of Contents
బాల్యం :
గోపాలకృష్ణయ్య 2 జూన్ 1889లో కృష్ణ జిల్లాలోని నందిగామ తాలూకా, పెనుగంచిప్రోలు గ్రామంలో జన్మించారు.
ఈయన తండ్రి కోదండరామస్వామి ఒక స్కూల్ టీచర్ అయినప్పటికీ వీరి పూర్వికులు భూస్వాములుగా ఉన్నారు. తల్లి సీతమ్మ తన ఒక్క సంతానం అయిన గోపాలకృష్ణయ్య కు జన్మనిచ్చి చనిపోయారు.
తల్లి చనిపోయిన తరవాత గోపాలకృష్ణయ్య తండ్రి రెండవ వివాహం చేసుకున్నారు. మూడు సంవత్సరాల వయస్సులో గోపాలకృష్ణయ్య యొక్క తండ్రి కూడా మరణించారు.
తల్లి తండ్రులు చనిపోయిన తరవాత పినతండ్రి, నాయనమ్మల వద్ద పెరిగారు. తన స్కూల్ చదువును బాపట్ల మున్సిపల్ ఉన్నత పాఠశాల నుంచి పూర్తి చేసారు. మెట్రిక్యూలేషన్ ను పూర్తి చేసుకున్న తరవాత బాపట్ల తాలూకా ఆఫీస్ లో ఒక సంసారం పనిచేసారు.
1911వ సంవత్సరంలో తన చిన్న నాటి స్నేహితుడైన శ్రీ నడింపల్లి నరసింహారావు తో కలిసి స్కాట్లాండ్ లోని ఎడిన్‌బర్గ్ యూనివర్సిటీ లో చదవటానికి వెళ్లారు.
అక్కడ ఆరు సంవత్సరాలు ఉండి ఆర్థికశాస్త్రంలో (economics) పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను పూర్తి చేసారు.
కెరీర్ :
1917 లో గుంటూరు తిరిగి వచ్చిన తరవాత రాజమండ్రి లోని ప్రభుత్వ కాలేజీ లో మరియు మచిలీపట్టణం లోని నేషనల్ కాలేజీ లో పనిచేసారు.
భారతదేశంలో ఉన్న విద్య ప్రమాణాలను చూసి నిరాశ చెందారు. గుంటూరు లో ఉన్నప్పుడు అన్నీ బిసెంట్ యొక్క హోమ్ రూల్ ఉద్యమం లో కూడా పాల్గొన్నారు.1920 లో జరిగిన కలకత్తా కాంగ్రెస్ సమావేశంలో పాల్గొన్నప్పుడు సత్యాగ్రహ మరియు సహాయనిరాకరణ ఉద్యమాలను చూసి తన జీవితాన్ని స్వాతంత్ర పోరాటం కోసం అంకితం చేసారు.
గోపాలకృష్ణయ్య దేవుడు శ్రీరాముడు యొక్క భక్తుడు, ఈయన రామదండు అనే రామ భక్తుల సేన ను తయారు చేసారు, ఈ సేన స్వరాజ్యం కోసం పనిచేసేవారు.
1921 లో విజయవాడ లో జరిగిన వార్షిక సమావేశాన్ని నిర్వహించటంలో కీలక పాత్ర వహించారు. ఈ సేన మొత్తం కాషాయరంగు దుస్తువులు, రుద్రాక్ష ధరించి మరియు విభూతి పెట్టుకొని పెద్ద సంఖ్యలో ఈ సమావేశంలో హాజరు అయ్యారు.
ఆ సమావేశం యొక్క ప్రెసిడెంట్ మహమ్మద్ అలీ రామదండు సేన ను చూసి భారత దేశం యొక్క ఎర్ర సైన్యం (red army) అని పిలిచారు.
సహాయ నిరాకరణ ఉద్యమం సమయంలో చీరాల లో పన్ను కి వ్యతిరేకంగా జరిగిన సత్యాగ్రహంలో పాల్గొని ప్రసిద్ధి చెందారు.
ఎక్కువ పన్ను వసూలు చేయటానికి మద్రాస్ ప్రెసిడెన్సీ చీరాల మరియు పేరాల గ్రామాలను గుంటూరు లో కలపాలి అని ప్రతిపాదించారు.
ఈ గ్రామాలు విడిగా ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం ₹4000 రూపాయలు పన్ను కట్టేవి. గుంటూరు లో కలిపిన తరవాత మున్సిపాలిటీ గా మరి ₹40,000 రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది.
గ్రామాల విలీన ప్రక్రియ ప్రజలపై పన్ను భారాన్ని పెంచింది. పెంచిన పన్నుకు వ్యతిరేకంగా నిరసనలు చేసిన తరవాత ప్రభుత్వం తమ నిర్ణయాన్ని మార్చుకోలేదు.
నిరసనలు చేస్తున్న వారిపై చట్ట పర్యంగా చర్యలు చేపట్టి జైలు శిక్ష విధించారు.
బెజవాడ (ఇప్పటి విజయవాడ) లో జరిగిన కాంగ్రెస్ సమావేశం సమయంలో గాంధీజీ చీరాల ను సందర్శించారు. భవిష్యత్తు లో ఉద్యమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అని గోపాల కృష్ణయ్య గాంధీజీ తో సలహా తీసుకున్నారు.
అహింసా మార్గం ద్వారానే ఉద్యమాన్ని ముందుకు సాగించాలని గాంధీజీ సలహా ఇచ్చారు. అలాగే ఎక్కువ మొత్తాల్లో ప్రజలను మున్సిపాలిటీ నుంచి ఖాళీ చేయించాలని కోరారు. ఇలా చేయటం వల్ల ప్రభుత్వానికి మున్సిపాలిటీ ప్రాంతాల నుంచి ఎటువంటి ఆదాయం లభించదని చెప్పారు.
గాంధీజీ మాటలను అనుసరిస్తూ 1921 లో గోపాల కృష్ణయ్య చీరాల ప్రజలను పట్టణం పరిధి నుంచి బయట తాత్కాలిక నిర్మాణాలలో ఉంచారు.
15,000 వేల ప్రజలలో నుంచి 13,000 వేల ప్రజలు గోపాల కృష్ణయ్య పిలుపు పై తాత్కాలిక ఇండ్లను నిర్మించుకొని ఉండసాగారు, దీనికి రామనగర్ అని పేరు కూడా పెట్టారు.
అన్ని కులాల వారితో మాట్లాడి రామనగరానికి ఒక అసెంబ్లీ మరియు న్యాయవ్యవస్థ కూడా ఏర్పాటు చేసారు. గోపాలకృష్ణయ్య మరియు రామ దండు సేన ప్రజల మనోధైర్యాన్ని కొనసాగించడానికి పనిచేశారు. పదకొండు నెలల వరకు ఇది కొనసాగింది.
చేజారిపోతున్న ఆర్థిక పరిస్థుతులు మరియు గోపాల కృష్ణయ్య జైలు పాలవడం వల్ల ముందుకు కొనసాగించటానికి నాయకుడు లేకపోవటం వల్ల రామనగరం ఖాళి అయ్యింది.
చౌరీ చౌరా సంఘటన తరవాత మహాత్మా గాంధీ సహాయనిరాకరణ ఉద్యమాన్ని నిలిపివేసారు. ఫలితంగా కాంగ్రెస్ పార్టీలో విరోధాలు మొదలయ్యాయి.
1925 లో సి ఆర్ దాస్ మరియు మోతీలాల్ నెహ్రూ ద్వారా స్థాపించబడ్డ స్వరాజ్య పార్టీ లో గోపాల కృష్ణయ్య చేరి ఆంధ్ర రాష్ట్ర ప్రాంతం నుంచి పార్టీ యొక్క సెక్రటరీ గా ఎన్నుకోబడ్డారు.
గోపాల కృష్ణయ్య రామ దండు సేన మరియు రామనగరం ను నిర్మించటంలో చేసిన కృషి కి గాను రామదాస్ అని పేరు పెట్టారు. ఈయన స్వరాజ్య పార్టీ లీడర్ గా కూడా ఎన్నుకోబడ్డారు.
తనను తాను పరిచయం చేసుకునేటప్పుడు సరదాగా నా పేరు CR దాస్ అని లేదా చీరాల రామదాస్ అని చెప్పేవారు.
వ్యక్తిగత జీవితం :
గోపాల కృష్ణయ్య బహుభాషావేత్త మరియు గొప్ప వక్త , ఈయన ఇంగ్లీష్, హిందీ, తెలుగు మరియు సంస్కృతం బాషలలో అనర్గళంగా మాట్లాడేవారు.
ఇంగ్లాండ్ లో ఉన్న సమయంలో ఆనంద కుమారస్వామి తో మంచి స్నేహితులుగా మారి అభినయదర్పణ అనే పుస్తకాన్ని ఇంగ్లీష్ లో The Mirror of Gesture గా అనువాదం చేయించారు.
గోపాల కృష్ణయ్య 1903 వ సంవత్సరంలో దుర్గా భవాని అమ్మ అనే 14 సంవత్సరాల అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు.
మరణం :
1926 లో గోపాల కృష్ణయ్య క్షయవ్యాధి (tuberculosis) వ్యాధి బారిన పడ్డారు. తన చివరి రోజులలో పేదరికం మరియు బాధ ను చూసారు. ఈయన కేవలం 39 సంవత్సరాల వయస్సులో 10 జూన్ 1928 సంవత్సరంలో తన తుది శ్వాస విడిచారు. గోపాల కృష్ణయ్య కు ఆంధ్ర రత్న అనే బిరుదు కూడా ఇవ్వటం జరిగింది.
విజయవాడలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం ను గోపాల కృష్ణయ్య పేరు మీదగా Andhra Ratna Bhavan అని పేరు పెట్టారు. చీరాల లో గోపాల కృష్ణయ్య యొక్క కంచు విగ్రహం కూడా ఉంది.