మిలాదున్ నబి అంటే ఏమిటి – What is Milad-un-Nabi festival in Telugu?

మిలాదున్ నబి ను  Eid-e-Milad an-Nabi లేదా Mawlid అని కూడా అంటారు. 

 ప్రవక్త ముహమ్మద్ పుట్టిన రోజున సందర్భంగా ఈ పండగను జరుపుకుంటారు. 

ఈ రోజు ఇస్లామిక్  క్యాలెండర్ లోని మూడవ నెల అయిన  Rabi’ al-Awwal (రబివుల్ అవ్వల్) నెల 12 వ తారీఖున జరుపుకోవటం జరుగుతుంది.

ఈ రోజును జరుపుకోవటం అనేది ఇస్లామిక్ ప్రపంచంలో వివాదాస్పదమైన విషయం. కొందరు ఈ రోజును ఒక పండగలా జరుపుకోవాలని అంటారు. మరికొంత మంది ఈ రోజును ప్రవక్త లేదా సహచరులు జరుపుకోలేదు కాబట్టి ఈ దినాన్ని ఒక సాధారణ దినముగా పరిగణిస్తారు. 

కొన్ని చరిత్ర పుస్తకాల ప్రకారం 1207 వ సంవత్సరంలో సుల్తాన్ సలద్దీన్ యొక్క జనరల్ గోక్‌బోరి ( Gökböri) ఈ రోజును జరపటం ప్రారంభించారు. 

ఒట్టోమన్ సామ్రాజ్యానికి  చెందిన రాజు  Murad III 1588 వ సంవత్సరంలో ఈ రోజును  అధికార సెలవు దినంగా ప్రకటించారు.      

కతర్ మరియు సౌదీ అరేబియా తప్ప మిగతా ముస్లిం మెజారిటీ దేశాలు ఈ రోజును కల్చరల్ సెలెబ్రేషన్స్ గా జరుపుకుంటారు.  

mawlid అనేది అరబిక్ వర్డ్  ولد అనగా జన్మనివ్వటం, ఒక బిడ్డను భరించు, సంతతి అనే అర్థం వస్తుంది. 

కొన్ని అరబ్ దేశాలలో ఈ పదాన్ని ప్రముఖ ధార్మిక పెద్దల పుట్టిన రోజును తెలపడాన్ని కూడా ఉపయోగిస్తారు.  

తేది :   

సున్ని ముస్లింల ప్రకారం ప్రవక్త ముహమ్మద్ 12 రబివుల్ అవ్వల్ రోజున జన్మించారు. 

షియా ముస్లింల ప్రకారం ప్రవక్త  ముహమ్మద్ 17 రబివుల్ అవ్వల్ రోజున జన్మించారు. 

కొంత మంది ముస్లింల ప్రకారం ప్రవక్త పుట్టిన రోజు కచ్చితంగా తెలియదు. 

Source: Mawlid – Wikipedia

Leave a Comment