భికాజీ కామా జీవిత చరిత్ర – Bhikaiji Cama biography in Telugu

భికాజీ కామా యొక్క పూర్తి పేరు భికాజీ రుస్తుం కామా, ఈమెను మేడమ్ కామా అని కూడా అంటారు. మేడం కామ భారత స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న ప్రముఖులలో ఒకరు.

బాల్యం:  

భికాజీ కామా ముంబైలోని ఒక ప్రముఖ మరియు సంపన్న మైన పార్సీ జొరాస్ట్రియన్ కుటుంబంలో జన్మించారు. ఈమె తల్లిదండ్రులు, సొరాబ్జీ ఫ్రామ్జీ పటేల్ మరియు జైజీబాయి సొరాబ్జీ పటేల్, ముంబై నగరంలో సుప్రసిద్ధులు.

ఈమె తండ్రి సొరాబ్జీ- శిక్షణ ద్వారా న్యాయవాది మరియు వృత్తిరీత్యా వ్యాపారి గా ఉన్నారు. ఈయన పార్సీ సమాజంలో ప్రభావవంతమైన సభ్యుడి గా కూడా ఉన్నారు. 

కార్యకలాపాలు: 

1896 వ సంవత్సరం అక్టోబర్ లో మొదట బొంబాయి ప్రెసిడెన్సీ కరువు బారిన పడింది, ఆ తర్వాత కొంతకాలానికి బుబోనిక్ ప్లేగు వచ్చింది.

భిఖైజీ గ్రాంట్ మెడికల్ కాలేజ్ నుండి పని చేస్తున్న అనేక బృందాలలో ఒకదానిలో చేరారు. ఇదే తర్వాత హాఫ్కిన్ యొక్క ప్లేగు వ్యాక్సిన్ పరిశోధనా కేంద్రంగా మారింది.  

రోగం బారిన పడ్డ బాధితులకు సంరక్షణ అందించడానికి మరియు ఆరోగ్యవంతులకు టీకాలు వేయడానికి కృషి చేసేవారు. 

ఇదే క్రమంలో మేడం కామా కు ప్లేగు సోకింది కానీ ప్రాణాలతో బయటపడ్డారు. ఆమె 1902లో మెడికల్ కేర్  కోసం బ్రిటన్‌కు పంపబడ్డారు.

1904 వ సంవత్సరంలో మేడం కామా ఇండియా తిరిగి రవళి అనుకున్నప్పుడు శ్యామ్‌జీ కృష్ణ వర్మ అనే విప్లవ పోరాట యోధుడి తో కలిసారు. వర్మ ఆ రోజులలో లండన్ లోని హైడ్ పార్క్‌లో చేసే  జాతీయవాద ప్రసంగాలకు ప్రసిద్ధులు అయ్యారు. 

వర్మ ద్వారా మేడం కామా భారత జాతీయ కాంగ్రెస్ యొక్క బ్రిటిష్ కమిటీ యొక్క ప్రెసిడెంట్ అయినా దాదాభాయ్ నౌరోజీ ను కలిసారు. తరవాత దాదాభాయ్ నౌరోజీ కు ప్రైవేట్ సెక్రటరీ గా పనిచేసేవారు. 

 1905 వ సంవత్సరంలో నౌరోజీ మరియు భారత రాజకీయ కార్యకర్త సింగ్ రేవాభాయ్ రాణా (S. R. Rana) తో కలిసి మేడం కామా,  Indian Home Rule Society స్థాపన చేస్తున్న వర్మ కి సహాయం చేసారు.  

మేడం కామా లండన్ లో ఉన్నప్పుడే ఇండియా కి తిరిగి రావాలి అని అనుకుంటే జాతీయవాద కార్యకలాపాలలో పాల్గొనని హామీ చేయాలని కోరటం జరిగింది కానీ ఆమె దీనిని తిరస్కరించారు. 

అదే సంవత్సరం పారిస్ లో  S. R. రానా మరియు ముంచెర్షా బుర్జోర్జీ గోద్రెజ్ తో కలిసి  పారిస్ ఇండియన్ సొసైటీ ను (co-founded) సహ-స్థాపించారు.

ప్రవాసంలో ఎక్సైల్ లో నివసిస్తు భారత దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేస్తున్న వారితో కలిసి Bande Mataram ను రాసారు.  Vande Mataram ను బ్యాన్ చేసిన తర్వాత బందే మాతరం ను రాసారు. 

తరవాత Madan’s Talwar అనే వారపత్రికలను కూడా రాసారు. ఈ వార పత్రికలను ఫ్రెంచ్ కాలనీ ఆఫ్ పాండిచేరి ద్వారా ఇండియా లోకి రహస్యంగా చేరవేసారు.  

22 వ ఆగష్టు 1907 వ సంవత్సరంలో మేడం కామా జర్మనీలోని స్టట్‌గార్ట్‌లో రెండవ సోషలిస్ట్ కాంగ్రెస్ లో కామా హాజరయ్యారు. అక్కడ ఆమె భారత దేహంలో కరువు ద్వారా జరిగిన వినాశకరమైన ప్రభావాలను వివరించారు. 

గ్రేట్ బ్రిటన్ నుండి మానవ హక్కులు, సమానత్వం మరియు స్వయంప్రతిపత్తి కోసం ఆమె విజ్ఞప్తి చేసారు. తరవాత తాను పిలిచే “Flag of Indian Independence” ను అందరికి చూపించారు.

మేడం కామా యొక్క ఫ్లాగ్ కలకత్తా ఫ్లాగ్ ను సవరణ చేసి తయారు చేసారు. ఇదే ఫ్లాగ్ తరవాత భారత దేశం యొక్క నేషనల్ ఫ్లాగ్ యొక్క నమూనా అయ్యింది.    

 1909 వ సంవత్సరంలో మదన్ లాల్ ధింగ్రా, బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ విలియం హట్ కర్జన్ విల్లీ యొక్క హత్య (assasination) జరిగిన తర్వాత బ్రిటిష్ లో నివసించే పలు కార్యకర్తలను అరెస్ట్ చేసారు. 

ఆ సమయంలో మేడం కామా పారిస్ లో ఉన్నారు.  బ్రిటిష్ ప్రభుత్వం కామాను అప్పగించాలని కోరింది, అయితే ఫ్రెంచ్ ప్రభుత్వం సహకరించడానికి నిరాకరించింది.

ఫలితంగా బ్రిటిష్ ప్రభుత్వం కామా యొక్క వారసత్వ సంపదను స్వాధీనం చేసుకున్నారు. రష్యా విప్లవ రాజకీయ నాయకుడు అయిన  లెనిన్ మేడం కామా ను రష్యా కి వచ్చి ఉండమని కోరగా మేడం కామా నిరాకరించారు. 

మేడం కామా మహిళా హక్కుల కోసం పోరాటం చేసారు. 

మరణం :

1914 వ సంవత్సరంలో మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో ఫ్రాన్స్ మరియు బ్రిటన్ మిత్రదేశాలుగా మారాయి.  కామా మరియు సింగ్ రేవాభాయ్ రాణా మినహా పారిస్ ఇండియా సొసైటీలోని సభ్యులందరూ దేశం విడిచిపెట్టారు. 

కామా మరియు రాణా అక్టోబరు 1914 సంవత్సరంలో మార్సెయిల్స్‌కు ఎదురుగా వచ్చే మార్గంలో అప్పుడే వచ్చిన పంజాబ్ రెజిమెంట్ దళాల మధ్య ఆందోళనకు ప్రయత్నించినప్పుడు అరెస్టు చేయబడ్డారు.

రానా కరేబియన్‌కు బహిష్కరించబడ్డాడు, అయితే బిఖైజీ కామాను 1915లో దక్షిణ ఫ్రాన్స్‌కు పంపారు. ఆమె ఆరోగ్యం క్షీణించడంతో, ఆమె స్థానిక పోలీసు స్టేషన్‌లో ప్రతివారం ఫిర్యాదు చేస్తే బోర్డియక్స్‌లోని తన నివాసానికి తిరిగి రావడానికి అనుమతించబడింది.

భికాజీ కామా బహిష్కరణ యూరోప్ లో 1935 వరకు కొనసాగింది. పక్షవాతం కారణంగా British government ను  ఇంటికి వెళ్ళటానికి అనుమతించడానికి కోరారు. 

ఇండియా వెళ్లిన తరవాత స్వాతంత్య్రానికి సంబంచిన కార్యకలాపాలు చేయకూడదని అనే షరతు పై ముంబై తిరిగి వచ్చారు. 

1935 వ సంవత్సరంలో మేడం కామా ముంబై తిరిగి వచ్చారు.  13 August 1936లో  74 సంవత్సరాల వయస్సులో భికాజీ కామా  Parsi General Hospital లో చనిపోయారు.      

Source: Bhikaiji Cama – Wikipedia

Leave a Comment