మోహన్ భగవత్ జీవిత చరిత్ర – Mohan Bhagwat biography in Telugu

మోహన్ భగవత్ యొక్క పూర్తి పేరు మోహన్ మధుకరరావు భగవత్. ఈయన ఒక రాజకీయ కార్యకర్త మరియు పశు వైద్యుడు.  2009 నుండి భారతదేశంలోని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) యొక్క 6వ మరియు ప్రస్తుత సర్సంఘచాలక్‌గా ఉన్నారు. 

బాల్యం:

మోహన్ మధుకర్ భగవత్ భారత దేశం లోని మహారాష్ట రాష్ట్రంలో చంద్రాపూర్ నగరంలో మరాఠీ కర్హడే బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. 

మోహన్ భగవత్ యొక్క పూర్తి పేరు మోహన్ మధుకరరావు భగవత్. ఈయన ఒక రాజకీయ కార్యకర్త మరియు పశు వైద్యుడు.  2009 నుండి భారతదేశంలోని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) యొక్క 6వ మరియు ప్రస్తుత సర్సంఘచాలక్‌గా ఉన్నారు. 

చదువు:

మోహన్ మధుకర్ భగవత్ భారత దేశం లోని మహారాష్ట రాష్ట్రంలో చంద్రాపూర్ నగరంలో మరాఠీ కర్హడే బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. 

 ఈయన కుటుంబం RSS కార్యకర్తల కు చెందినది. ఈయన తండ్రి మధుకర్ రావ్ భగవత్, చంద్రపూర్ జోన్‌కు కార్యవాహ (కార్యదర్శి) తరువాత గుజరాత్‌కు ప్రాంత్ ప్రచారక్ (ప్రావిన్షియల్ ప్రమోటర్) గా ఉన్నారు. తల్లి మాలతి ఆర్‌ఎస్‌ఎస్ మహిళా విభాగం సభ్యురాలి గా ఉన్నారు.   

భగవత్ తన స్కూల్ చదువును  ‘లోకమాన్య తిలక్ విద్యాలయ’ నుండి పూర్తి చేసి, ఆపై చంద్రపూర్‌లోని జనతా కళాశాల నుండి BSc మొదటి సంవత్సరం పూర్తి చేసారు. ఈయన నాగ్‌పూర్‌లోని ప్రభుత్వ వెటర్నరీ కళాశాల నుండి వెటర్నరీ సైన్సెస్ ( Veterinary Sciences) మరియు పశుసంవర్ధక శాస్త్రంలో(Animal Husbandry) డిగ్రీ సంపాదించారు. మోహన్  భగవత్ వెటర్నరీ సైన్సెస్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సును  పూర్తి చేయకుండా మధ్యలోనే వదిలేసి 1975 వ సంవత్సరం చివరిలో పూర్తిగా RSS యొక్క ప్రచార కర్త గా అయ్యారు. 

RSS: 

ఎమర్జెన్సీ సమయంలో అండర్ గ్రౌండ్ లో ఉండి పనిచేసిన తరవాత 1977లో మహారాష్ట్రలోని అకోలా నగరంలో  ‘ప్రచారక్’ అయ్యాడు. 

నాగ్‌పూర్ మరియు విదర్భ ప్రాంతాలకు బాధ్యత వహించి RSS సంస్థలో క్రమంగా ఎదిగారు. 

మోహన్ భగవత్ 1991 నుండి 1999 వరకు భారతదేశానికి ‘అఖిల్ భారతీయ శరీరిక్ ప్రముఖ్’ (శారీరక శిక్షణ యొక్క ఇన్‌ఛార్జ్) అయ్యాడు. 

తరవాత ఈయన  ‘అఖిల్ భారతీయ ప్రచారక్ ప్రముఖ్’  గా ప్రమోట్ అయ్యారు. 

2000 సంవత్సరంలో, రాజేంద్ర సింగ్ మరియు H. V. శేషాద్రిల ఆరోగ్యం సరిగా లేకపోవడంతో RSS చీఫ్ మరియు జనరల్ సెక్రటరీ పదవి నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నారు. 

ఫలితంగా K. S. సుదర్శన్ కొత్త RSS చీఫ్‌గా నామినేట్ చేయబడ్డారు.   మరియు భగవత్ ‘Sarkaryavah’, (ప్రధాన కార్యదర్శి) గా నియమించబడ్డారు.  

21 మార్చి 2009 సంవత్సరంలో మోహన్ భగవత్  RSS యొక్క Sarsanghchalak (చీఫ్ ఎగ్జిక్యూటివ్)గా ఎంపిక చేయబడ్డారు.

 K. B. హెడ్గేవార్ మరియు M. S. గోల్వాల్కర్ తర్వాత అతి చిన్న వయస్సులో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌(RSS)కు నాయకత్వం వహించిన వ్యక్తిగా నిలిచారు. 

జూన్ 2015 సంవత్సరంలో వివిధ ఇస్లామిస్ట్ టెర్రరిస్టు సంస్థల నుండి అధిక ముప్పు ఉన్నందున, ఇండియన్ గవర్నమెంట్ భగవత్‌కు 24 గంటలపాటు రక్షణ కల్పించాలని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF)ని ఆదేశించింది.

మోహన్ భగవత్ ప్రస్తుతం Z+ VVIP సెక్యూరిటీ కవర్‌ కలిగిన మరియు  అత్యంత సురక్షితమైన భారతీయులలో ఒకరు.

మోహన్ భగవత్ ఆలోచనలు: 

2017 సంవత్సరం, సెప్టెంబరు నెలలో భగవత్  “ప్రపంచంలో హిందూమతం మాత్రమే నిజమైన మతం అని  మరియు ఇతర మతాలు హిందూమతం నుండి ఉద్భవించాయని” అని చెప్పారు. 

2022 వ సంవత్సరం అక్టోబర్ నెలలో, విజయదశమి సందర్భంగా చేసిన ప్రసంగంలో, దేశవ్యాప్తంగా కుటుంబ నియంత్రణ అవసరం అని చెప్పారు. 

దేశ జనాభాలో అసమతుల్యత గురించి భగవత్ స్ట్రెస్ చేసి చెప్పారు. జనాభా నియంత్రణ పై తగిన చట్టాలు తీసుకురావాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.   

Source: Mohan Bhagwat – Wikipedia

Leave a Comment