శ్రియా శరన్ యొక్క పూర్తి పేరు శ్రియా శరణ్ భట్నాగర్. శ్రియా భారత దేశానికి చెందిన నటి, ఈమె తెలుగు, తమిళ్ మరియు హిందీ సినిమాలలో నటించారు.
బాల్యం :
శ్రియా శరణ్ భట్నాగర్ 11 సెప్టెంబర్ 1982 వ సంవత్సరంలో ఉత్తర భారతదేశంలోని హరిద్వార్ లో జన్మించారు. శ్రియా పుష్పేంద్ర శరణ్ భట్నాగర్ మరియు నీరజా శరణ్ భట్నాగర్ దంపతులకు జన్మించారు.
ఈమె తండ్రి భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్‌లో పని చేసేవారు. మరియు ఆమె తల్లి హరిద్వార్ మరియు న్యూఢిల్లీలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్, లో కెమిస్ట్రీ టీచర్ గా పనిచేసేవారు.
శ్రియా కూడా తన తల్లి చదువు చెపుతున్న స్కూళ్లలోనే తన చదువును పూర్తి చేసారు. శ్రియా యొక్క మాతృభాష హిందీ.
శ్రియా చిన్న తనంలో హరిద్వార్‌లోని చిన్న పట్టణం లోని BHEL కాలనీలో నివసించేది. ఆమె తర్వాత ఢిల్లీలోని లేడీ శ్రీ రామ్ కాలేజీలో చదువుకున్నారు. శ్రియా సాహిత్యంలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని పూర్తి చేసారు.
శ్రియా ఒక అద్భుతమైన నర్తకి. ఆమె చిన్నతనంలో ఆమె తల్లి ద్వారా కథక్ మరియు రాజస్థానీ జానపద నృత్యంలో శిక్షణ పొందారు. తరువాత శోవన నారాయణ్ ద్వారా కథక్ లో శిక్షణ పొందారు.
ఆమె కాలేజీ లో చదువుకునే సమయంలో అనేక డాన్స్ టీం లతో మరియు తన ఉపాధ్యాయునితో కలిసి పాల్గొనేవారు.
కెరీర్:
కాలేజీ లో చదువుతున్న సమయంలో తన టీచర్ యొక్క రికమెండేషన్ మేరకు “Thirakti Kyun Hawa” అనే మ్యూజిక్ వీడియో లో నటించారు.
ఈ వీడియో ను చూసిన రామోజీ ఫిలిమ్స్ శ్రియాను 2001 వ సంవత్సరంలో తెలుగు లో రొమాంటిక్ సినిమా అయినా “ఇష్టం (Ishtam)” లో నటించడానికి అవకాశం దొరికింది.
సినిమా విడుదల అవ్వక ముందే శ్రియాకి ఇంకో నాలుగు సినిమాలలో నటించడానికి అవకాశాలు వచ్చాయి.
2002 లో శ్రియా నువ్వే నువ్వే ( Nuvve Nuvve) సినిమాలో నటించారు. 2002 లో నటించిన సంతోషం (Santosham) సినిమా బాక్స్ ఆఫీస్ లో మంచి సక్సెస్ ను ఇచ్చింది.
సంతోషం సినిమాకు ఉత్తమ చలనచిత్రంగా నంది అవార్డు మరియు తెలుగు లో ఫిల్మ్‌ఫేర్ బెస్ట్ ఫిల్మ్ అవార్డ్ ను దక్కించుకుంది.
ఈ సినిమా లో శ్రియా నటనకు గాను CineMAA Award for Best Actor- Female అవార్డు లభించింది. ఫలితంగా తన కెరీర్ ప్రారంభంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి స్థానం లభించింది.
2003 వ సంవత్సరంలో Tujhe Meri Kasam అనే హిందీ సినిమాలో సపోర్టింగ్ రోల్ లో నటించారు. ఇదే సంవత్సరం టాగోర్ సినిమాలో చిరంజీవి మరియు జ్యోతిక తో పాటు కలిసి నటించారు.
ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ లో మంచి కల్లెక్షన్లను అందించింది. తరవాత Enakku 20 Unakku 18 అనే సినిమా తో తమిళ ఇండస్ట్రీ లో అరంగేట్రం చేసారు.
2005 లో నటించిన ఛత్రపతి సినిమా కు గాను Filmfare Best Telugu Actress Award లభించింది.
2007 వ సంవత్సరంలో రజినీకాంత్ తో కలిసి Sivaji: The Boss అనే సినిమా లో నటించారు. ఈ సినిమాకు కూడా శ్రియా కు బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు లభించింది. ఇదే సంవత్సరంలో Awarapan అనే హిందీ సినిమా లో నటించారు.
2008 వ సంవత్సరంలో ఇంగ్లీష్ సినిమా అయిన The Other End of the Line లో నటించి హాలీవుడ్ లో అరంగేట్రం చేసారు.
2010 వ సంవత్సరంలో Pokkiri Raja సినిమా తో మలయాళం సినిమా ఇండస్ట్రీ లో వారం గేట్రం చేసారు.
2013 నుంచి ఇప్పటి వరకు శ్రియా తమిళ్, తెలుగు, కన్నడ మరియు హిందీ సినిమాలలో నటిస్తున్నారు.
వ్యక్తిగత జీవితం:
19 మార్చి 2018 వ సంవత్సరంలో శ్రియా తన రష్యన్ ప్రియుడు ఆండ్రీ కొస్చీవ్ తో తన లోఖండ్‌వాలా నివాసంలో పెళ్లి చేసుకున్నారు. 10 జనవరి 2021 సంవత్సరంలో ఈ దంపతులు ఒక కూతురుకి జన్మినిచ్చారు.