సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు మరియు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యవసాయ శాఖ మంత్రి. ఈయన తెలంగాణ శాసనసభలో వనపర్తి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తారు. ఈయన తెలంగాణ రాష్ట్ర శామితి పొలిట్‌బ్యూరో సభ్యుడు.
బాల్యం:
నిరంజన్ రెడ్డి తెలంగాణలోని వనపర్తి జిల్లాలోని రైతు రామ్ రెడ్డికి 1958 అక్టోబర్ 4 రోజున జన్మించారు. ఈయన ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి తన B.Sc మరియు LLB చేసారు. నిరంజన్ రెడ్డి 2001లో వ్యవస్థాపక సభ్యుడిగా టిఆర్ఎస్ పార్టీలో చేరడానికి ముందు ప్రాక్టీస్ చేసే న్యాయవాది.
కెరీర్:
సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలుగుదేశంపార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు.
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ఉన్నప్పుడు ఖాదీబోర్డు చైర్మన్‌గా పని చేసారు.
2001లో తెలంగాణ రాష్ట్రం కోసం ప్రయాణిస్తున్న టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. టీఆర్‌ఎస్ పార్టీ లోకి చేరిన తరవాత పార్టీను ముందుకు తీసుకు వెళ్ళటంలో చాలా కృషి చేసారు.
2014 లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పడ్డాక జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి 4291 స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయాడు.
అదే సంవత్సరంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడి గా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనకు బాధ్యతలు అప్పగించారు.
తెలంగాణ ఉద్యమంలో మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న సమస్యల పైన మంచి అవగాహన ఉంది.
కెసిఆర్ ముఖ్యమంత్రి అయ్యిన తరవాత కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 25 టీఎంసీలు ఉన్న నీటి కేటాయింపును 40 టీఎంసీలకు పెంపుదల చేయించి జీఓ విడుదలయ్యేలా కృషి చేసారు.
వనపర్తి నియోజకవర్గంలో 70 వేల ఎకరాలకు సాగునీరు అందించిన తరువాతనే ఎన్నికలలో నామినేషన్ వేస్తానని ప్రకటించి ఇచ్చినమాట నిలబెట్టకుని ఎన్నికలలో పోటీకి నిలబడ్డారు.
2018 ముందస్తు ఎన్నికల్లో వనపర్తి నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థి గా నిరంజన్ రెడ్డి పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డి పై 51,783 ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు.
2019లో కెసీఆర్ రెండవ మంత్రివర్గంలో వ్యవసాయ, సహకార, ఆహార & పౌర సరఫరా శాఖల మంత్రిగా ఉన్నారు.
Source: సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి – వికీపీడియా (wikipedia.org)