రిషబ్ పంత్ భారత దేశానికి చెందిన అంతర్జాతీయ క్రికెటర్. పంత్ ఇండియా క్రికెట్ టీం లో వికెట్ కీపర్ మరియు బ్యాట్స్ మ్యాన్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కి కెప్టెన్ గా ఉన్నారు.
Table of Contents
బాల్యం:
రిషబ్ పంత్ ఉత్తరాఖండ్‌లోని రూర్కీ నగరంలో రాజేంద్ర పంత్ మరియు సరోజ్ పంత్ దంపతులకు జన్మించారు.
12 సంవత్సరాల వయస్సులో పంత్ తన తల్లి తో కలిసి ఢిల్లీ కి క్రికెట్ ట్రైనింగ్ తీసుకోవడానికి వెళ్లేవారు. సోనెట్ క్రికెట్ అకాడమీలో తారక్ సిన్హా వద్ద ట్రైనింగ్ తీసుకొనేవారు.
ఢిల్లీ కి వచ్చినప్పుడు ఉండటానికి వసతి లేకపోవటం వల్ల పంత్ మరియు అతని తల్లి మోతీ బాగ్‌లోని ఒక గురుద్వారాలో ఉండేవారు.
U-13 మరియు U-15 క్రికెట్ ఆడటానికి పంత్ రాజస్థాన్‌కు మారాలని కోచ్ సిన్హా సూచించాడు, కానీ ప్రయోజనం లేకపోయింది.
మెరుగైన బ్యాట్స్‌మన్‌గా మారాలనే ఆశతో పంత్ తన మొత్తం బ్యాటింగ్ టెక్నిక్‌ని మార్చుకోమని అతని గురువు సలహా ఇవ్వటం జరిగింది.
అతను అస్సాంకు వ్యతిరేకంగా ఢిల్లీ తరపున U-19 క్రికెట్ అతని లైఫ్ లో టర్నింగ్ పాయింట్ ఇచ్చింది. పంత్ తన మొదటి ఇన్నింగ్స్‌లో 35 పరుగులతో అత్యధిక స్కోరు సాధించాడు మరియు రెండవ ఇన్నింగ్స్‌లో 150 పరుగులు చేశాడు, ఇది అతని కెరీర్‌లో అత్యంత ముఖ్యమైన మ్యాచ్ అని అతను పేర్కొన్నారు.
1 ఫిబ్రవరి 2016న, 2016 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ ఆడుతున్న సమయంలో, పంత్ నేపాల్‌పై 18 బంతుల్లో హాఫ్ సెంచరీ కొట్టాడు, అండర్-19 లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన బ్యాట్స్ మ్యాన్ గా నిలిచారు.
డొమెస్టిక్ కెరీర్:
22 అక్టోబర్ 2015 సంవత్సరంలో 2015–16 రంజీ ట్రోఫీ లో (Ranji Trophy) అరంగేట్రం చేసారు.
తరవాత నెలలో 2015–16 విజయ్ హజారే ట్రోఫీ (Vijay Hazare Trophy) ఆడి List A క్రికెట్ లో అరంగేట్రం చేసారు.
2016–17 రంజీ ట్రోఫీలో, మహారాష్ట్రతో మ్యాచ్ ఆడుతున్నప్పుడు, పంత్ ఒక ఇన్నింగ్స్‌లో 308 పరుగులు చేసారు.
ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ట్రిపుల్ సెంచరీ చేసిన మూడో అతి పిన్న వయస్కుడైన భారతీయుడిగా నిలిచారు .
8 నవంబర్ 2016న, ఢిల్లీ మరియు ఝార్ఖండ్ మధ్య జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో కేవలం 48 బంతుల్లో అత్యంత వేగవంతమైన సెంచరీని చేసారు.
2017 సంవత్సరంలో జరిగిన 2016–17 విజయ్ హజారే ట్రోఫీకి ఢిల్లీ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఢిల్లీ కోచ్ భాస్కర్ పిళ్లై మాట్లాడుతూ, పంత్‌ను భవిష్యత్తు కోసం సిద్ధం చేయడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నాము అని అన్నారు.
2018 సంవత్సరంలో జరిగిన 2017-18 జోనల్ T20 లీగ్ లో హిమాచల్ ప్రదేశ్ మరియు ఢిల్లీ మధ్య జరిగిన మ్యాచ్‌లో పంత్ 32 బంతుల్లో 100 పరుగులు చేసి ట్వంటీ20 మ్యాచ్‌లో రెండవ వేగవంతమైన సెంచరీని సాధించారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) :
2016 IPL సంవత్సరంలో ఢిల్లీ డేర్ డెవిల్స్ టీం ద్వారా పంత్ కొనుగోలు చేయబడ్డారు. ఈ సీజన్ లో జరిగిన మూడవ మ్యాచ్ లో పంత్ 40 బంతులలో 69 పరుగులు చేసారు. ఫలితంగా ఢిల్లీ గుజరాత్ లయన్స్ తో మ్యాచ్ గెలిచింది.
2017 లో జరిగిన IPL లో కూడా గుజరాత్ లయన్స్ పైనే 43 బంతులతో 97 పరుగులు చేసారు.
2018 లో జరిగిన IPL లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో పంత్ 63 బంతులలో 128 పరుగులు చేసారు. IPL హిస్టరీ లోనే ఇంత ఎక్కువ స్కోర్ చేసిన ఆటగాడిగా నిలిచారు.
2021 వ సంవత్సరంలో శ్రేయాస్ అయ్యర్ ఇంజురీ కారణంగా IPL ఆడకపోవడం వల్ల పంత్ ఢిల్లీ టీం కి కెప్టెన్ గా ఎంపికయ్యారు. 2022 లో కూడా పంత్ కెప్టెన్ గా ఎంపికయ్యారు.
ఇంటర్నేషనల్ కెరీర్:
2017 వ సంవత్సరంలో పంత్ ట్వంటీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ లో అరంగేట్రం చేసారు.
2018 సంవత్సరంలో 2018 Nidahas Trophy లో ఆడటానికి ఎంపికయ్యారు.
ఇదే సంవత్సరంలో పంత్ ఇంగ్లాండ్ కిఇంజురీ వ్యతిరేకంగా ఆడి టెస్ట్ క్రికెట్ లో అరంగేట్రం చేసారు.
21 అక్టోబర్ 2018 సంవత్సరంలో వెస్ట్ ఇండీస్ కి వ్యతిరేకంగా ఆడి ODI లో అరంగేట్రం చేసారు.
2019 వ సంవత్సరంలో Cricket World Cup లో ఇంజురీ కారణంగా శిఖర్ ధావన్ అందకపోవటం కారణంగా పంత్ వరల్డ్ కప్ లో అరంగేట్రం చేసారు .
కార్ క్రాష్:
30 డిసెంబరు 2022న, రూర్కీ సమీపంలోని ఢిల్లీ-డెహ్రాడూన్ హైవేపై పంత్ ఒక ఘోరమైన కారు ప్రమాదంలో బారిన పడ్డాడు. నప్పటికీ స్థిరంగా ఉన్నాడు.
ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, పంత్ తన మెర్సిడెస్ SUV కారును రూర్కీ నుండి న్యూఢిల్లీకి నడుపుతున్నాడని మరియు వాహనంలో ఒక్కడే ఉన్నాడని .రోడ్డుపై ఉన్న సెంట్రల్ డివైడర్‌ను ఢీకొనడంతో కారులో మంటలు చెలరేగాయి అని చెప్పటం జరిగింది.
Source: Rishabh Pant – Wikipedia