కావ్య థాపర్ భారత దేశానికి చెందిన నటి మరియు మోడల్. ఈమె ప్రధానంగా తెలుగు, తమిళ్ మరియు హిందీ సినిమాలలో నటిస్తారు.
బాల్యం:
థాపర్ 1995 ఆగస్టు 20న మహారాష్ట్రలో జన్మించారు. ఆమె తన స్కూల్ చదువును బాంబే స్కాటిష్ స్కూల్, పవై (Powai) నుండి పూర్తి చేసింది. స్కూల్ చదువును పూర్తి చేసుకున్న తర్వాత ఆమె ఠాకూర్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ కామర్స్‌లో చేరింది.
కెరీర్:
కావ్య థాపర్ తన సినిమా కెరీర్ ను 2013 లో తత్కాల్ (Tatkal) సినిమా ద్వారా ప్రారంభించారు.
2018 వ సంవత్సరంలో ఈ మాయ పేరేమిటో (Ee Maaya Peremito) అనే రొమాంటిక్ తెలుగు సినిమాలో టాలీవుడ్ లో అరంగేట్రం చేసారు.
2019 వ సంవత్సరంలో మార్కెట్ రాజా MBBS (Market Raja MBBS) సినిమాలో నటించి తమిళ సినిమా ఇండస్ట్రీ లో అరంగేట్రం చేసారు.
2021 వ సంవ్సతరంలో ఏక్ మినీ కథ (Ek Mini Katha) అనే తెలుగు సినిమాలో నటించారు.
2022 వ సంవత్సరంలో హిందీ సినిమా Middle Class Love (మిడిల్ క్లాస్ లవ్) మరియు పంజాబి సినిమా CAT లో నటించారు.
2023 వ సంవత్సరంలో ఫర్జి (Farzi) అనే హిందీ వెబ్ సిరీస్ లో నటించారు.
2023 వ సంవత్సరంలో Pichaikkaran 2 (బిచ్చగాడు 2) తమిళ సినిమాలో నటించారు.
సినిమాలే కాకుండా పతంజలి, మేక్‌మైట్రిప్ మరియు కోహినూర్ బ్రాండ్ ల యొక్క యాడ్ లలో కూడా నటించారు.
Source: Kavya Thapar – Wikipedia