మే డే అంటే ఏమిటి – What is May Day in Telugu?

మే డే ను ప్రతి సంవత్సరం మే 1వ తారీఖున జరుపుకోవడం జరుగుతుంది. ఈ రోజును కార్మికుల దినోత్సవం లేదా అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం అని కూడా అంటారు.

కార్మికులు మరియు కార్మిక ఉద్యమం చేసిన పోరాటాలు మరియు సాధించిన విజయాలను స్మరించుకునే రోజు. ఈ రోజును ప్రపంచమంతటా అనేక దేశాలలో జరువుకోవటం జరుగుతుంది.

అమెరికా మరియు కెనడాలో మాత్రం ఈ రోజును లేబర్ డే పేరు తో సెప్టెంబర్ నెలలోని మొదటి సోమవారం రోజున జరుపుకుంటారు.

పూర్వం మే డే ను ఒక యూరోపియన్ పండుగగా జరుపుకునేవారు. ఈ రోజు వసంత విషువత్తు మరియు వేసవి కాలం (spring equinox and summer solstice) మధ్య వస్తుంది. ఈ రోజున డాన్స్ లు చేస్తూ భోగిమంటలు వెలిగించి జరుపుకునేవారు.

మే డే మూలం (Origin):

మే 3, 1886 లో అమెరికా లోని చికాగో లో 8 గంటల పని దినాన్ని విధించాలని నిరసనలు చేస్తుండగా పోలీసులు నిరసనలు చేస్తున్న కార్మికులపై కాల్పులు జరిపారు. ఫలితంగా ఇద్దరు కార్మికులు చనిపోయారు.

నిరసనలు చేస్తున్న కార్మికులపై పోలీసులు కాల్పులు జరిపారని కార్మికులు మరుసటిరోజు మే 4 వ రోజున హేమార్కెట్ (Haymarket) వద్ద నిరసన చేయాలనుకున్నారు.

శాంతియుతంగా నిరసనలు చేస్తుండగా పోలీసులు వచ్చి నిరసనలు ఆపి అక్కడినుంచి వెళ్లిపోవాలని కోరారు. కార్మికులు వినకపోవడంతో పోలీసులు ముందుకు కదిలారు. పోలీసులు ముందుకు కదలటం చూసి ఓక గుర్తు తెలియని వ్యక్తి పోలీసులపై బాంబు విసిరాడు. ఫలితంగా ఒక పోలీసు ఆఫీసర్ చనిపోయాడు.

కొన్ని వార్త పత్రికల ప్రకారం బాంబు దాడి తరవాత పోలీసులు మరియు కార్మికులు ఒకరి పై మరొకరు గన్ను లతో దాడి చేసుకోవటం మొదలుపెట్టారు. ఫలితంగా 4 చనిపోయారు మరియు 70 మంది గాయపడ్డారు.

ఈ ఘటన రాత్రి సమయంలో జరగటం కారణంగా సరిగ్గా కనిపించక పోలీసులే ఒకరిపై మరొకరు కాల్పులు జరుపుకున్నారు.

7 మంది పోలీసులు మరియు 4 కార్మికులు ఈ ఘటనలో చనిపోయారు. అయిదు నిమిషాలలో హేమార్కెట్ కూడలి ఖాళీ అయిపోయింది.

ఇలా ఆ రోజున కార్మికులకు మరియు పోలీసులకు జరిగిన సంఘటనను స్మరించుకుంటూ 1889, 1 మే తారీఖు నుంచి మే డే ను జరుపుకోవటం మొదలుపెట్టారు.

పలు దేశాలలో ఈ రోజును పబ్లిక్ హాలిడే గా కూడా ప్రకటించటం జరిగింది.

Source: May Day – Wikipedia

Leave a Comment