గూగుల్ యాడ్ సెన్స్ అనేది గూగుల్ కి చెందిన ఒక advertising ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటంటే వెబ్ సైట్ లపై, యూట్యూబ్ వీడియో లపై మరియు యాప్ స్టోర్ లో ఉండే యాప్ లపై యాడ్స్ ను చూపించడం.
ఉదాహరణకి ఒక వెబ్ సైట్ ఓనర్ తన వెబ్ సైట్ నుంచి డబ్బులు సంపాదించాలంటే వివిధ రకాల మార్గాలు ఉన్నాయి.
ఇలా ఉన్న అనేక మార్గాలలో అత్యంత ప్రాముఖ్యత చెందినది గూగుల్ యాడ్ సెన్స్.
గూగుల్ యాడ్ సెన్స్ ద్వారా వెబ్ సైట్ ఓనర్ తన వెబ్ సైట్ పై యాడ్స్ చూపించటం జరుగుతుంది. ఈ యాడ్స్ ను చుసిన లేదా ఈ యాడ్స్ పై క్లిక్ చేసిన వెబ్ సైట్ ఓనర్స్ కి డబ్బులు వస్తాయి.
ఇలాగే యూట్యూబ్ లో వీడియోలు తయారు చేసే క్రియేటర్స్ కి కూడా తమ వీడియోలపై యాడ్స్ ఉంచే సదుపాయం కలిగిస్తుంది.
Table of Contents
గూగుల్ యాడ్ సెన్స్ ఎలా పనిచేస్తుంది ?
గూగుల్ యాడ్ సెన్స్ లో ముఖ్యంగా రెండు రకాల వ్యక్తులు ఉంటారు.
మొదటి రకం తమ ప్రోడక్ట్ ల ప్రకటన (Advertise) చేసే వారు మరియు రెండవ రకం ఈ ప్రోడక్ట్ లను తమ వెబ్ సైట్ లేదా యూట్యూబ్ వీడియో లపై ఉంచేవారు.
ఈ రెండు రకాల వ్యక్తుల గురించి డీటెయిల్ గా చూద్దాము.

Advertisers (అడ్వర్టైజర్స్):
స్టెప్ 1: అడ్వర్టైజర్స్ గూగుల్ యాడ్ సెన్స్ లో సైన్ అప్ చేసి తమ అకౌంట్ ను తయారు చేస్తారు.
స్టెప్ 2 : అడ్వర్టైజర్స్ తమ అకౌంట్ ద్వారా తమ ప్రొడక్ట్స్ కి సంబంధించిన కాంపెయిన్ ను మొదలుపెడతారు. ఈ కాంపెయిన్ (campaign) ద్వారా కీవర్డ్స్, ప్రదేశాలను మరియు ఒక ప్రత్యేక జనాభా ను టార్గెట్ చేయటం జరుగుతుంది.
స్టెప్ 3: అడ్వర్టైజర్స్ టెక్స్ట్ యాడ్స్, డిప్లాయ్ యాడ్స్, మరియు ఇతర ఫార్మాట్ లలో యాడ్స్ ను తయారు చేయటం జరుగుతుంది.
స్టెప్ 4 : అడ్వర్టైజర్స్ తమ కీవర్డ్స్ పై ఒక క్లిక్ కు (CPC- Cost for click) మరియు వెయ్యి ఇంప్రెషన్స్ కి (CPM – Cost per mille) ఎంత చెల్లిస్తారో నిర్ణయించుకుంటారు.ఇది బిడ్డింగ్ పద్దతి ద్వారా నిర్ణయించబడుతుంది.
స్టెప్ 5: బిడ్డింగ్ పద్దతి పూర్తి అయిన తరవాత తమ కాంపెయిన్ ను ఆక్టివేట్ చేయటం జరుగుతుంది.ఫలితంగా యాడ్స్ ఇప్పుడు వెబ్ సైట్స్ పై లేదా యూట్యూబ్ వీడియోలపై చూపించడానికి రెడీ గా ఉన్నాయని అర్థం.
వెబ్ సైట్ మరియు యూట్యూబ్ వీడియో ల కేటగిరీ మరియు ప్రాముఖ్యత ను బట్టి గూగుల్ యాడ్స్ ను చూపించటం జరుగుతుంది.
స్టెప్ 6:
యాడ్స్ ను చూసిన లేదా వాటిపై క్లిక్ చేసినా అడ్వర్టైజర్స్ గూగుల్ కి డబ్బులు చెల్లిస్తారు. ఇలా వచ్చిన డబ్బులలో గూగుల్ తమ వాటా ఉంచి మిగతాది వెబ్ సైట్ ఓనర్ కి ఇవ్వటం జరుగుతుంది.
పబ్లిషర్స్/ క్రియేటర్స్:
స్టెప్ 1: వెబ్ సైట్ ఓనర్లు మరియు యూట్యూబ్ క్రియేటర్ లు యాడ్ సెన్స్ వెబ్ సైట్ కి వెళ్లి తమ అకౌంట్ ను తయారు చేయటం జరుగుతుంది.
స్టెప్ 2 : వెబ్ సైట్ ఓనర్ మరియు యూట్యూబ్ క్రియేటర్స్ తమ వెబ్ సైట్ ను లేదా యూట్యూబ్ ను రివ్యూ కోసం గూగుల్ కి సబ్ మిట్ చేయటం జరుగుతుంది.
స్టెప్ 3 : వెబ్ సైట్ లేదా యూట్యూబ్ గూగుల్ యొక్క అన్ని పాలసీలను పాటిస్తే యాడ్ సెన్స్ ప్రోగ్రాం కోసం ఆమోదిస్తుంది.
స్టెప్ 4 : గూగుల్ తరపు నుంచి అప్రూవ్ (Approve) చేయబడ్డ యూట్యూబ్ ఫై గూగుల్ ఆటోమేటిక్ గా యాడ్స్ చూపిస్తుంది కానీ వెబ్ సైట్ పై యాడ్స్ చూపించడానికి గూగుల్ తరపు నుంచి ఇవ్వబడ్డ ఒక కోడ్ ను వెబ్ సైట్ లో పెట్టడం జరుగుతుంది.
స్టెప్ 5: వెబ్ సైట్ లేదా యూట్యూబ్ క్యాటగిరి ను బట్టి యాడ్స్ యూ చూపించటం జరుగుతుంది.
Step 6: ఇలా చూపించిన యాడ్స్ ను యూజర్స్ క్లిక్ చేసినా లేదా చుసినా డబ్బులు జెనరేట్ అవ్వటం మొదలవుతుంది.
ఇలా జెనరేట్ అయ్యిన డబ్బులలో గూగుల్ తమ వాటా ఉంచుకొని మిగతా డబ్బు క్రియేటర్స్ కి ఇవ్వటం జరుగుతుంది.
గూగుల్ యాడ్ సెన్స్ ఇంటరెస్టింగ్ ఫాక్ట్స్ :
1) గూగుల్ యాడ్స్ ను గూగుల్ సంస్థ ద్వారా మార్చ్ 2003 లో లాంచ్ చేయటం జరిగింది.
2) 2007 వ సంవత్సరంలో గూగుల్ యూట్యూబ్ ను కొనుగోలు చేసిన తరవాత యాడ్ సెన్స్ ప్రోగ్రాం ను లాంచ్ చేయటం జరిగింది.
3) పబ్లిషర్ యాడ్ సెన్స్ ద్వారా సంపాదించిన మొత్తంలో 68% ఉంచుకుంటారు మిగతా 32% గూగుల్ ఉంచుకుంటుంది.
4) ప్రతి సంవత్సరం గూగుల్ 10 బిలియన్ డాలర్లు పబ్లిషర్ లకు ఇవ్వటం జరిగింది.
5) ఇప్పుడు యాడ్ సెన్స్ ప్రోగ్రాం తెలుగు భాష ను కూడా సపోర్ట్ చేస్తుంది. తెలుగు లో రాసిన వెబ్ సైట్ లను ఇప్పుడు మోనిటైజ్ చేసుకోవచ్చు.
6) యాడ్ సెన్స్ మొత్తం 51 కరెన్సీలలో పేమెంట్ చేయటాన్ని సపోర్ట్ చేస్తుంది.