శ్రీదేవి జీవిత చరిత్ర – Sridevi biography in Telugu

శ్రీదేవి యొక్క పూర్తి పేరు శ్రీ అమ్మ యంగేర్ అయ్యప్పన్, సినిమా ఇండస్ట్రీ లో మాత్రం ఈమెను శ్రీదేవి అని పిలవటం జరుగుతుంది. 

శ్రీదేవి  తెలుగు, తమిళ, హిందీ, మలయాళం,మరియు కన్నడ సినిమాలలో నటించారు. ఈమెను ఇండియన్ సినిమా యొక్క మొదటి మహిళా సూపర్ స్టార్ అని కూడా కొనియాడుతారు.  

బాల్యం:

శ్రీదేవి 1963 వ సంవత్సరం ఆగస్టు 13న మీనంపట్టి గ్రామం లో అయ్యప్పన్ మరియు రాజేశ్వరి అనే దంపతులకు జన్మించారు. ప్రస్తుతం ఈ గ్రామం తమిళనాడు రాష్ట్రం లో శివకాశి ప్రాంతానికి దగ్గరలో ఉంది.

శ్రీదేవి తండ్రి తమిళనాడు రాష్ట్రం లోని శివకాశి నగరం లో లాయర్ గా పనిచేసేవారు, తల్లి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని తిరుపతి కి చెందిన వారు.

శ్రీదేవి తన కెరీర్ ను చైల్డ్ ఆర్టిస్ట్ గా 4 సంవత్సరాల వయస్సులో 1967 లో తమిళ సినిమా కంధన్ కరుణాయ్ (Kandhan Karunai) లో నటించారు.

శ్రీదేవి తన తెలుగు సినిమా యొక్క కెరీర్ ను 1970 వ సంవత్సరంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా మా నాన్న నిర్దోషి అనే సినిమా ద్వారా ప్రారంభించారు.

శ్రీదేవి తన మలయాళ సినిమా యొక్క కెరీర్ ను 1969 లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కుమార సంభవం అనే సినిమా ద్వారా ప్రారంభించారు.

శ్రీదేవి తన కన్నడ సినిమా యొక్క కెరీర్ ను 1974 వ సంవత్సరంలో భక్త కుంబర అనే సినిమా ద్వారా ప్రారంభించారు.

శ్రీదేవి తన హిందీ సినిమా యొక్క కెరీర్ ను 1972 వ సంవత్సరంలో రాణి మేర నామ్ అనే సినిమా ద్వారా ప్రారంభించారు.

శ్రీదేవి 1979 వ సంవత్సరంలో సోల్వా సావన్ (Solva Sawan) సినిమాతో హిందీ సినిమాలలో లీడ్ రోల్ లో  నటించడం ప్రారంభించారు. 

హిందీ సినిమా ఇండస్ట్రీ లో అగ్ర సినిమాలలో నటించడం మరియు సినిమాలు కూడా మంచి విజయం సాధించటం ఆమెకు మంచి పేరును సంపాదించి పెట్టాయి.   

కెరీర్:

శ్రీదేవి నటించిన హిందీ సినిమాలు మిస్టర్ ఇండియా (1987), చాల్‌బాజ్ (1989), ఖుదా గవా (1992), రూప్ కీ రాణి చోరోన్ కా రాజా (1993), గుమ్రా (1993) మరియు లాడ్లా (1994) అనే సినిమాలు మంచి పేరును విజయాన్ని సంపాదించి పెట్టాయి. 

వ్యక్తిగత జీవితం:

శ్రీదేవి యొక్క తండ్రి 1990 వ సంవత్సరంలో గుండె పోతూ కారణంగా మరణించారు.

1995 వ సంవత్సరంలో శ్రీదేవి తల్లి యొక్క బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్ వికటించడంతో 1996 వ సంవత్సరంలో మరణించారు.

1996 వ సంవత్సరంలో శ్రీదేవి ప్రొడ్యూసర్ బోనీ కపూర్ ను పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మొదటి కూతురు జాన్హవి (1997) లో మరియు రెండవ కూతురు ఖుషి 2000 వ సంవత్సరంలో జన్మించారు.

మరణం :

2018 వ సంవత్సరంలో శ్రీదేవి పెళ్లి కోసం దుబాయ్ వెళ్లారు. అక్కడ ఉంటున్న హోటల్ లో ఫ్రెష్ అవ్వటానికి వెళ్లిన శ్రీదేవి బాత్రూం లో ఉండగానే తుదిశ్వాస విడిచారు.

టాక్సికాలజీ రిపోర్ట్ లో ప్రమాదవశాత్తూ మునిగిపోవడం వలన చనిపోయారని తెలిసింది. ఈ రిపోర్ట్ లో శ్రీదేవి బాడీ లో మద్యం ట్రెసెస్ ఉన్నాయని మరియు లంగ్స్ లో కూడా నీరు ఉన్నట్టు తెలిసింది.

Reference: Sridevi – Wikipedia

 

Leave a Comment