నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర – Nandamuri Taraka Ramarao Biography in Telugu

నందమూరి తారక రామారావు ను N. T. రామారావు లేదా ఎన్టీఆర్ (NTR) అనే పేర్లతో పిలవటం జరుగుతుంది. 

రామారావు భారత దేశానికి చెందిన ఒక గొప్ప నటుడు మరియు నిర్మాత. 1982 వ సంవత్సరంలో తెలుగు దేశం పేరుతో ఒక రాజకీయ పార్టీ ను స్థాపించారు.  సినిమాలలో పనిచేయటమే కాకుండా 3 సార్లు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం యొక్క ముఖ్య మంత్రిగా పదవి భాద్యతలు చేపట్టారు.   

బాల్యం: 

నందమూరి తారక రామారావు 1923 లో మే 28 వ తారీఖున ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, కృష్ణ జిల్లా, పామర్రు మండలంలోని నిమ్మకూరు గ్రామంలో లక్ష్మయ్య, వెంకట రామమ్మ దంపతులకు జన్మించారు.   

బ్రిటిష్ వారు  పరిపాలించే సమయంలో ఈ ప్రాంతం మద్రాస్ ప్రెసిడెన్సీ లో భాగంగా ఉండేది. 

ఆయన అత్త మామలకు సంతానం లేని కారణంగా మామకు దత్తతగా ఇవ్వబడింది. 

చిన్న తనంలో రామారావుకు చదువు చెప్పడానికి దగ్గరలో ఉన్న గ్రామం నుంచి ఒక మాస్టరు వచ్చేవారు. తనకు తెలుగు మీద మంచి పట్టు ఉండటానికి కారణం చిన్నతనంలో చదువు చెప్పిన మాస్టారు అని రామ రావు  అనేవారు.    

అలాగే తన తండ్రి కి కళ పై గల ఆసక్తి ను చూసి నటన గురించి నేర్చున్నారు. 

ఆ రోజులలో తల్లి తండ్రులు కేవలం ప్రాథమిక విద్య వరకే చదివించేవారు కానీ రామారావు ను మాత్రం మెట్రిక్యూలేషన్ ను పూర్తి చేయటానికి విజయవాడ వెళ్లి పూర్తి చేసారు.

చదువు పూర్తిచేసుకున్న తరువాత మద్రాస్ సర్వీస్ కమిషన్ లో గుంటూరు లోని పత్తిపాడు లో సబ్-రిజిస్ట్రార్ గా ఉద్యోగం లో చేరారు. 

కానీ నటనపై ఉన్న ఆసక్తి కారణంగా ఉద్యోగం మానేసారు. 

కెరీర్:

రామ రావు తన నటన జీవితాన్ని మన దేశం (1949) సినిమా ద్వారా ప్రారంభించారు. తరవాతి సంవత్సరం పల్లెటూరి పిల్ల (1950) లో నాగేశ్వర్ రావు తో కలిసి నటించారు. 

1957 వ సంవత్సరంలో మొట్ట మొదటి పౌరాణిక చిత్రం మాయా బజార్ లో నటించారు. ఈ సినిమా లో కృష్ణుడి పాత్రను చేసారు. ఆ సమయంలో ఈ సినిమా ఒక బ్లాక్ బస్టర్. తరవాత 17 సినిమాలలో కృష్ణుడి పాత్రను చేసారు. 

తరువాతి కెరీర్ లో ఒక సాధారణ వ్యక్తి ప్రస్తుతం ఉన్న వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడటంపై సినిమాలు చేసారు.      

రామారావు చివరి సినిమా శ్రీనాథ కవి సార్వభౌముడు,  తెలుగు కవి శ్రీనాథ జీవిత చరిత్ర ను ఆధారం చేసుకొని తీసారు. ఈ సినిమా 1993 లో విడుదల అయ్యింది. 

రామారావు నటుడి తో పాటు స్క్రీన్ రైటర్ గా కొన్ని సినిమాలకు కథలను కూడా రాసారు. 

రామారావు తన సినిమాలకు తానే నిర్మాతగా ఉన్నారు. తన ప్రొడక్షన్ హౌసెస్ అయిన నేషనల్ ఆర్ట్ థియేటర్ ప్రైవేట్ లిమిటెడ్, మద్రాస్ మరియు రామకృష్ణ స్టూడియోస్, హైదరాబాద్ ద్వారా తన సినిమాలు మరియు ఇతర నటుల సినిమాలకు నిర్మాతగా ఉన్నారు.        

పొలిటికల్ కెరీర్: 

 రామారావు తెలుగుదేశం పార్టీ (టీడీపీ) స్థాపించిన తరవాత సీనియర్ రాజకీయ నాయకుడు నాదెండ్ల భాస్కరరావు మార్చి 29, 1982 వ సంవత్సరం హైదరాబాద్‌లో టీడీపీ పార్టీ లో చేరారు.  భారత జాతీయ కాంగ్రెస్‌ అవినీతి మరియు అసమర్థతతో పాలించిందని అందుకే ఈ పార్టీ ను స్థాపించమని తెలిపారు. 

1982 లో ఎన్నికల సమయంలో సంజయ విచార మంచ్ పార్టీతో పొత్తు పెట్టుకుంది. ఎన్నికలలో గెలవటానికి సమాజంలో అవినీతికి పాల్పడని విద్యావంతులైన అభ్యర్థులకు టికెట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇలాంటి కొత్త ఆలోచన ఇంతకూ ముందు ఎవ్వరూ చేయలేదు. 

ఎన్నికల కోసం రథయాత్ర లాంటి వినూత్నమైన ప్రచార మార్గాలను ఎన్నుకునేవారు. 

తన వద్ద ఉన్న చెవర్లే (Chevrolet) కారును రథయాత్రకు అనుగుణంగా మర్చి చైతన్య రథం అని పేరు పెట్టారు. 

తన కొడుకు హరికృష్ణ తో కలిసి ఆంధ్రప్రదేశ్ మొత్తం రథ యాత్ర చేసారు.  తెలుగు వారి ఆత్మ గౌరవం అనే నినాదంతో ప్రచారం చేసారు. 

1983 లో జరిగిన శాసనసభ ఎన్నికలలో 294 స్థానాలకు గాను 202 స్థానాలను గెలుచుకుని భారీ మెజారిటీ తో గెలిచారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తరవాత పదవ మరియు మొదటి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు.   

తారక రామ రావు ఓపెన్ హార్ట్ సర్జరీ కోసం అమెరికా వెళ్ళినప్పుడు గవర్నర్  ఠాకూర్ రామ్ లాల్ ద్వారా పదవి నుంచి తొలగించబడ్డారు.  

 ఫైనాన్స్ మినిస్టర్ నాదెండ్ల భాస్కరరావు ఎమ్మెల్యే ల మెజారిటీ తో ముఖ్య మంత్రిగా ఎన్నుకోబడ్డారు.   

రామారావు తన శస్త్రచికిత్స తర్వాత వెంటనే భారతదేశానికి తిరిగి వచ్చాడు. కర్ణాటక ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే సహాయంతో రామారావు ఎమ్మెల్యే లను తీసుకొని మైసూర్ లోని ఒక హోటల్ లో ఉంచారు. 

ఒక నెల తరవాత, ఇందిరా గాంధీ హత్యకు గురైంది. తరవాత ఇందిరా గాంధీ కుమారుడు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తరవాత జరిగిన జాతీయ ఎన్నికలలో ఇందిరా గాంధీ హత్య యొక్క సానుభూతి వల్ల ఒక్క ఆంధ్రప్రదేశ్ తప్ప దేశమంతటా కాంగ్రెస్ గెలిచింది. 

ఆంధ్రప్రదేశ్ లో మాత్రం టీడీపీ గెలుపును కైవసం చేసుకుంది. 1985 వ సంవత్సరంలో రామ రావు తాజాగా ఎన్నికలను జరపాలని నిర్ణయించున్నారు. మళ్ళీ  ఈ సారి టీడీపీ భారీ మెజారిటీ తో గెలిచింది. 

1989 లో జరిగిన ఎన్నికలలో వ్యతిరేకత కారణంగా రామారావు ఓడిపోయారు. 

1994 లో జరిగిన ఎన్నికలలో టీడీపీ మళ్ళీ సత్తా లోకి వచ్చినప్పుడు రావు మూడవ సారి మరియు ఆఖరి సారి అధికారంలోకి వచ్చారు. 

1995 లో అల్లుడు చంద్రబాబు నాయుడు రావు కి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి ముఖ్యమంత్రి అయ్యారు.             

అవార్డులు: 

1968 వ సంవత్సరంలో భారతదేశ ప్రభుత్వం పద్మశ్రీ బిరుదుతో సత్కరించింది. 

1972 వ సంవత్సరంలో బడి పంతులు సినిమాకు ఉత్తమ నటుడు బిరుదు లభించింది. 

మరణం : 

రామ రావు 18 జనవరి,1996 వ సంవత్సరంలో గుండెపోటు కారణంగా చనిపోయాయారు.  

Source:   N. T. Rama Rao – Wikipedia  

Leave a Comment