రాజీవ్ గాంధీ జీవిత చరిత్ర – Rajiv Gandhi biography in Telugu

రాజీవ్ గాంధీ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు మరియు ఆరవ ప్రధానమంత్రి. తల్లి ఇందిరాగాంధీ హత్య తరువాత 40 సంవత్సరాల వయస్సులో అతి చిన్న వయస్సులో ప్రధానమంత్రిగా ఎన్నుకోబడ్డారు. 

కెరీర్: 

రాజీవ్ గాంధీ 20 ఆగస్ట్ 1944 వ సంవత్సరంలో ముంబై లో ఇందిరా గాంధీ మరియు ఫిరోజ్ గాంధీ దంపతులకు జన్మించారు. 1951 లో రాజీవ్ గాంధీ మరియు సంజయ్ గాంధీ శివ నికేతన్ స్కూల్ కి వెళ్లారు. వీరి టీచర్ల   ప్రకారం రాజీవ్ గాంధీ సిగ్గు మరియు పిరికితనం కలిగి ఉండేవారు. 

రాజీవ్ గాంధీ డెహ్రాడూన్ లో తన స్కూల్ చదువును పూర్తి చేసుకున్నారు. పై చదువుల కోసం కేంబ్రిడ్జ్‌ కి వెళ్లారు.

తల్లి ఇందిరా గాంధీ ప్రధాన మంత్రి అయ్యిన తరవాత రాజీవ్ గాంధీ ఇండియా కి వచ్చారు. 

ఇండియా వచ్చిన తరవాత పైలట్ గా ట్రైనింగ్ తీసుకొని ఇండియన్ ఎయిర్లైన్స్ లో పైలట్ గా చేరారు. తమ్ముడు సంజయ్ గాంధీ లాగా రాజకీయాలలో ఆసక్తి చూపించలేదు.    

పొలిటికల్ కెరీర్: 

1980 వ సంవత్సరంలో రాజీవ్ తమ్ముడు సంజయ్ గాంధీ ఒక ప్లేన్ క్రాష్ లో చనిపోయారు. 

అదే సమయంలో శంకరాచార్య స్వామి శ్రీ స్వరూపానంద ఇందిరా గాంధీ ఇంటికి వచ్చి రాజీవ్ గాంధీ కూడా పైలట్ గా ఉద్యోగం మానుకొని దేశసేవ చేస్తే మంచిది అని సలహా ఇచ్చారు. 

పార్టీ సభ్యులు కూడా రాజీవ్ ను బలవంతం చేయటం వల్ల రాజీవ్ గాంధీ తల్లి ఇందిరా గాంధీకి  సహాయం అవుతుందని 16 ఫిబ్రవరి 1981 లో రాజకీయాలలో చేరారు. 

రాజకీయ నాయకుడు వసంతదాదా పాటిల్ అమేథీ నియోజకవర్గం అభ్యర్థిగా రాజీవ్‌ ను ప్రతిపాదించారు. ఎన్నికలలో రాజీవ్ గాంధీ గెలిచి ఎంపీ (MP) గా 17 ఆగష్టు కి శబదం తీసుకున్నారు. 

 ఇందిరా గాంధీ మరణం:

 31 వ అక్టోబర్ 1984 సంవత్సరంలో, ప్రధాన మంత్రి, రాజీవ్ గాంధీ తల్లి, ఇందిరా గాంధీ, ఆమె సిక్కు బాడీ గార్డుల చేత  హత్య చేయబడింది. ఫలితంగా సిక్కులకు వ్యతిరేకంగా హింసాత్మక అల్లర్లు దారి తీసాయి. 

తరవాత  ప్రసంగం లో రాజీవ్ గాంధీ అల్లర్ల గురించి మాట్లాడుతూ “ఇందిరాజీ హత్య తర్వాత దేశంలో కొన్ని అల్లర్లు జరిగాయి, ప్రజలు చాలా కోపంగా ఉన్నారని మాకు తెలుసు, కొన్ని రోజులు భారతదేశం వణికిపోయినట్లు అనిపించింది. కానీ, ఒక శక్తివంతమైన చెట్టు పడిపోయినప్పుడు, దాని చుట్టూ ఉన్న భూమి కొద్దిగా కంపించడం సహజం”.  

ఈ ప్రసంగం తరవాత రాజీవ్ గాంధీ అల్లర్లను సమర్ధిస్తున్నారని విమర్శించారు.  

తల్లి చనిపోయిన తరవాత రాజీవ్ గాంధీ ప్రధాన మంత్రి గా ఎన్నుకోబడ్డారు . 

మరణం :  

21 మే, 1991 వ సంవత్సరంలో తమిళనాడు లోని శ్రీపెరంబుదూర్ లో  పబ్లిక్ మీటింగ్ నిర్వహిస్తున్న సమయంలో LTTE కి చెందిన మహిళా మానవ బాంబు తనను తానూ పేల్చుకోగా రాజీవ్ గాంధీ మరియు ఇతర 14 మంది చనిపోయారు.    

Leave a Comment