సనా ఖాన్ జీవిత చరిత్ర – Sana Khan biography in Telugu

సనా ఖాన్ భారతదేశానికి చెందిన బిజినెస్ ఉమెన్ మరియు మాజీ నటి. ఈమె హిందీ, తమిళ మరియు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో పనిచేశారు.

2020 వ సంవత్సరంలో సనా ఖాన్ టీవీ మరియు సినిమా ఇండస్ట్రీ నుంచి రిటైర్మెంట్ తీసుకొని తన మతం ఇస్లాం మతం ప్రకారం తన జీవితాన్ని గడపాలని అనుకున్నారు.

బాల్యం :

సనా ఖాన్ 21 వ ఆగస్ట్ 1988 వ సంవత్సరంలో ముంబై లో జన్మించారు. ఈమె తండ్రి కేరళ కి చెందిన ఒక మలయాళీ ముస్లిం మరియు తల్లి ముంబై కి చెందిన వారు.

కెరీర్:

2005 వ సంవత్సరంలో తక్కువ బడ్జెట్ తో కూడిన హిందీ అడల్ట్ సినిమా Yehi Hai High Society (యేహీ హై హై సొసైటీ) లో నటించి తన కెరీర్ ను ప్రారంభించారు. తరవాత టీవీ కమర్షియల్స్ లో మరియు యాడ్స్ లో పనిచేసారు.

తమిళ సినిమా Kettavan (కెట్టవన్) లో హీరోయిన్ గా అవకాశం వచ్చింది కానీ కొన్ని కారణాల వల్ల సినిమా హీరో సిలంబరాసన్ (Silambarasan) సనా ఖాన్ ను సినిమాలో తీసుకోలేదు.

సనా ఖాన్ షారుఖ్ ఖాన్ తో కలిసి తీసిన యాడ్ ను చూసి హీరో సిలంబరాసన్ తమిళ సినిమా సిలంబట్టం (Silambattam) లో అవకాశం ఇచ్చారు. ఈ సినిమా సనా ఖాన్ కి మంచి హిట్ ను ఇచ్చింది.

2010 వ సంవత్సరంలో తెలుగు సినిమా కళ్యాణ్‌రామ్ కత్తి లో నటించి అరంగేట్రం చేసారు.

2011 వ సంవత్సరంలో కూల్…సక్కత్ హాట్ మగా (Kool…Sakkath Hot Maga) అనే కన్నడ సినిమాలో నటించి అరంగేట్రం చేసారు.

2013 లో సిల్క్ స్మిత బయోగ్రఫీ పై ఆధారం చేసుకొని తీసిన మలయాళం సినిమా క్లైమాక్స్ (Climax) లో నటించి అరంగేట్రం చేసారు.

2014 లో విడుదల అయిన హిందీ సినిమా జై హో లో డానీ డెంజోంగ్పా యొక్క కూతురిగా నటించింది.

2014 వ సంవత్సరంలో వజా తుమ్ హో అనే సినిమా లో నటించారు. ఈ సినిమాలో సనా ఖాన్ చేసిన బోల్డ్ సీన్స్ చర్చనీయాంశం అయ్యాయి.

2017 వ సంవత్సరంలో Toilet: Ek Prem Katha (టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ) అక్షయ్ కుమార్ యొక్క గర్ల్ ఫ్రెండ్ గా నటించింది.

సినిమాలే కాకుండా సనా ఖాన్ 50 కన్నా ఎక్కువ యాడ్స్ లో నటించారు. 2012 వ సంవత్సరంలో హిందీ బిగ్ బాస్ ఆరవ సీజన్ లో సెలబ్రిటీ కంటెస్టెంట్ గా వెళ్లి టాప్ 3 స్థానాలలో ఒకరి గా నిలిచారు.

వ్యక్తిగత జీవితం:

2019 లో సనా ఖాన్ కొరియోగ్రాఫర్ మెల్విన్ లూయిస్ తో రిలేషన్ షిప్ లో ఉన్నారు. ఫిబ్రవరి 2020 లో పలు వివాదాల తరవాత వీరు బ్రేకప్ చేసుకున్నారు.

మెల్విన్ లూయిస్ తనను చాలా బాధపెట్టాడని సనా ఖాన్ వీడియో ద్వారా వివరించింది.

8 వ అక్టోబర్ 2020 వ సంవత్సరంలో సనా ఖాన్ తన ఇంస్టాగ్రామ్ లో ఇకపై తాను ఎంటెర్టైన్ట్మెంట్ ఇండస్ట్రీ వదిలేస్తున్నానాని, ఇకపై ఇస్లాం ప్రకారం తన జీవితాన్ని గడుపుతానని పోస్ట్ పెట్టారు.

21 వ నవంబర్ 2020 వ సంవత్సరంలో సనా ఖాన్ సూరత్ కి చెందిన
ఇస్లామిక్ స్కాలర్ ముఫ్తి అనస్ సయీద్ ను పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు 5 జులై 2023 లో ఒక బాబు పుట్టాడు, బాబు పేరు సయ్యద్ తారిఖ్ జమీల్ అని పెట్టారు.

ప్రస్తుతం సనా ఖాన్ “Face Spa by Sana Khan” మరియు “Haya By Sana Khan” అనే బిసినెస్ లను నడుపుతారు.

తన భర్త అనస్ సయీద్ తో కలిసి “Hayat Welfare Foundation” ను నడుపుతారు.

వివాదం:

మార్చి 2007లో, పురుషుల అండర్ వేర్ బ్రాండ్ అముల్ మాచో కోసం సన ఖాన్ చేసిన TV వాణిజ్య ప్రకటనలో రెచ్చగొట్టే విధంగా అండర్వేర్ ను రుద్దటం మరియు ఉతకడం వంటివి చూపించింది.

ఈ ప్రకటన వివాదాన్ని సృష్టించింది మరియు లైంగిక అసభ్యత కారణంగా భారత ప్రభుత్వంచే నిషేధించబడింది.

ఈ ప్రకటనకు వ్యతిరేకంగా నిరసనలు మరియు సనా ఖాన్ పోస్టర్లను తగలపెట్టారు.

కంపెనీ సనా ఖాన్‌ను తిరిగి నియమించుకొని ప్రకటనను షూట్ చేసింది. ఈ సారి కొత్త నేపథ్యంతో వాణిజ్య ప్రకటనకు తయారు చేసి ఫిబ్రవరి 2008లో విడుదల చేసింది.

Source: Sana Khan – Wikipedia

Leave a Comment