రాఖీ పండుగ అంటే ఏమిటి – What is Rakhi festival in Telugu?

రాఖీ పండుగ ను రక్షా బంధన్ అని కూడా అంటారు. ప్రతి సంవత్సరం హిందువులు ఈ పండగను జరుపుకుంటారు. 

ఈ రోజు అక్క చెల్లెల్లు తమ సోదరుల చేతులకు రాఖీ ను కడతారు. సోదరులు తమ అక్క చెల్లెళ్లను కాపాడుతారని బదులుగా బహుమతి గా రాఖి ను కట్టడం జరుగుతుంది.రాఖీ కట్టిన తర్వాత సోదరులు తమ చెల్లెళ్లకు మంచి బహుమతి ని లేదా డబ్బును కానుకగా ఇస్తారు.   

ఈ పండగను వివిధ ప్రాంతాలలో వివిధ పేర్లతో పిలుస్తారు. వేరే ప్రాంతాలలో సాలునో,సిలోనో, మరియు రాక్రి అనే పేర్లతో పిలుస్తారు. హిందీ భాష మాట్లాడే రాష్ట్రాలలోఈ పండగను  రక్షా బంధన్ అని పిలుస్తారు.   

ఈ పండగ రోజున పెళ్లి అయిన అమ్మాయిలు తమ పుట్టింటికి వెళ్లి సోదరులకు రాఖీ కడతారు. 

చరిత్ర:

రాఖీ అనే పదాన్ని సంస్కృత భాష లోని rakṣikā అనే పదం నుంచి తీసుకోవటం జరిగింది. ఈ పదం లోని rakṣā కి అర్థం రక్షణ.   

ఈ పండగను శ్రావణ మాసం నెల యొక్క ఆఖరి రోజున జరుపుకుంటారు. ఈ పండగ చాలా మటుకు ఆగస్ట్ నెలలోనే వస్తుంది. కొన్ని సందర్భాలలో సొంత చెల్లి కాకపోయినా, సొంత చెల్లెలా భావించే సోదరులు కూడా రాఖి కడతారు.  

1829 వ సంవత్సరంలో రాఖీ పండుగను ఆంగ్ల భాషలో వినియోగించటం మొదలుపెట్టారు.  1884 వ సంవత్సరంలో ఉర్దూ డిక్షనరీలో రాఖీ పండగను ఉపయోగించటం మొదలుపెట్టారు.  

ఇతర రాష్ట్రాలలో రాఖీ పండగ: 

మహారాష్ట్ర రాష్ట్రం లో రక్షా బంధన్ పండగ ను నరళి పౌర్ణిమ పండగ తో కలిపి చేసుకుంటారు. ఈ పండగను ముఖ్యంగా కోలీ కమ్యూనిటీ వారిచే జరుపుకోబడుతుంది. ఈ కోలీ కమ్యూనిటీ వారు కమ్యూనిటీ సంఘానికి చెందిన వారు. 

మత్సకారులు ఆకాశానికి మరియు సముద్రానికి చెందిన దేవుడు అయిన వరుణుడిని పూజిస్తారు. దేవుడి యొక్క ఆశీర్వాదం తీసుకోవటం కోసం నైవేద్యంగా కొబ్బరికాయలను సముద్రంలోకి విసిరేస్తారు. మహిళలు తమ సోదరులకు రాఖీ కడతారు. 

ఇలాగే ఒడిస్సా రాష్ట్రంలో ఈ పండగను రాఖి పౌర్ణిమ లేదా గమ పూర్ణిమ అని అంటారు.  ఇదే రోజున భగవంతుడు బలభద్రుడు పుట్టిన రోజును జరుపుకుంటారు.   

నేపాల్ దేశంలో రాఖీ పండగను జానై పూర్ణిమ (Janai Purnima) అని అంటారు. ఈ పండగను హిందువులు మరియు బౌద్ధులు జరుపుకుంటారు. 

పురాణాలలో కూడా ఈ పండుగ గురించి పలు కథలు ఉన్నాయి. 

ఒకసారి భగవంతుడు శ్రీకృష్ణుడు తన వేలును కోసుకున్నప్పుడు, ద్రౌపది తన చీర ను చింపి వెలికి కట్టింది,  రక్తస్రావం ఆగిపోయింది. ఈ సంఘటన తర్వాత, వస్త్రం యొక్క ముక్క పవిత్రమైన దారం అయ్యింది మరియు రక్షా బంధన్ యొక్క నిజమైన ప్రాముఖ్యతను తెలియజేస్తుంది.

ఇలాగే  రాజు బాలి మరియు లక్ష్మీ దేవి గురించి కూడా ఒక ప్రసిద్ధ కథ ఉంది, ఇది రక్షా బంధన్ యొక్క మూలాన్ని కూడా వర్ణిస్తుంది. 

రాక్షస రాజు మహాబలి విష్ణువు యొక్క భక్తుడు. బాలి రాజు భక్తితో తన రాజ్యాన్ని రక్షించే బాధ్యతను విష్ణువు తీసుకునేలా చేసాడు. దీనితో విష్ణువు వైకుంఠం వదిలివేయాల్సి వచ్చింది. 

శ్రీమహావిష్ణువు భార్య అయిన లక్ష్మీదేవి తన భర్తకు దూరంగా ఉండలేక బ్రాహ్మణ శరణార్థి మహిళ వేషంలో మహాబలి కోటకు చేరుకుంది. లక్ష్మీదేవి పౌర్ణమి రోజున మహాబలి రాజు చేతికి రాఖీ కట్టింది,ఈ సంఘటన శ్రావణ పూర్ణిమ రోజున జరిగింది. అలా ఈ రాఖి పండగ మొదలయ్యిందని అంటారు.   

Source: Raksha Bandhan – Wikipedia

Leave a Comment