ఆలన్ సిడ్నీ పాట్రిక్ రిక్‌మాన్ ఇంగ్లాండ్ కి చెందిన నటుడు మరియు డైరెక్టర్. లండన్ లోని డ్రామా స్కూల్ అయిన రాయల్ అకాడమీ ఆఫ్ డ్రమాటిక్ ఆర్ట్ లో శిక్షనను పొందారు. ఆధునిక మరియు శాస్త్రీయ థియేటర్ ప్రొడక్షన్‌లలో ప్రదర్శనలు ఇస్తూ రాయల్ షేక్స్‌పియర్ కంపెనీ (RSC)లో సభ్యుడు అయ్యారు.
బాల్యం:
ఆలన్ సిడ్నీ పాట్రిక్ రిక్‌మాన్ 1946 వ సంవత్సరంలో ఫిబ్రవరి 21 న లండన్ లోని ఆక్టన్ జిల్లా లో మార్గరెట్ డోరీన్ రోజ్ (Margaret Doreen Rose) మరియు బెర్నార్డ్ విలియం రిక్‌మాన్ (Bernard William Rickman) అనే దంపతులకు జన్మించారు.
రిక్‌మాన్ యొక్క తల్లి ఒక హౌస్ వైఫ్ మరియు తండ్రి ఫ్యాక్టరీ వర్కర్, డెకరేటర్ మరియు హౌస్ పెయింటర్ గా పనిచేసేవారు. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో ఎయిర్ క్రాఫ్ట్ ఫిట్టర్ గా కూడా పని చేసారు.
ఈయనకు డేవిడ్ మరియు మైఖేల్ అనే ఇద్దరు సోదరులు మరియు షీలా అనే సోదరి ఉన్నారు.
ఈయనకు 8 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు తండ్రి క్యాన్సర్ వ్యాధి కారణంగా చనిపోయారు. పిల్లలను పోషించే భాద్యత తల్లి పై పడింది. పోస్ట్ ఆఫీస్ లో పనిచేస్తూ చాలా కష్టపడి పోషించారు.
1960 వ సంవత్సరంలో రిక్‌మాన్ యొక్క తల్లి రెండవ వివాహం చేసుకుంది కానీ మూడు సంవత్సరాల తర్వాత విడాకులు ఇచ్చేసారు.
రిక్‌మాన్ చిన్న తనంలో కాలిగ్రఫీ మరియు వాటర్ కలర్ పెయింటింగ్‌లో బాగా రాణించారు.
తన స్కూల్ చదువును వెస్ట్ ఆక్టన్ ఫస్ట్ స్కూల్ లో తరవాత డెర్వెన్‌వాటర్ ప్రైమరీ స్కూల్ నుంచి పూర్తి చేసారు.
తన పై చదువులను లండన్‌లోని లాటిమర్ అప్పర్ స్కూల్‌లో డైరెక్ట్ గ్రాంట్ సిస్టమ్ ద్వారా చదువుకున్నారు. ఇక్కడ చదువుకునే సమయంలోనే నాటకాలలో పనిచేయటం మొదలుపెట్టారు.
1965 నుండి 1968 వరకు చెల్సియా కాలేజ్ ఆఫ్ ఆర్ట్ అండ్ డిజైన్ లో చదివారు. తరవాత 1968 నుండి 1970 వరకు రాయల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్‌లో చదివారు.
తరవాత ARK మరియు నాటింగ్ హిల్ హెరాల్డ్ పత్రిలకు గ్రాఫిక్ డిజైనర్ గా పనిచేసారు. ఆ రోజులలో 18 సంవత్సరాల వయస్సులో నటన చేయటం సరైనది కాదని భావించేవారు.
రిక్‌మాన్ యొక్క వాయిస్ చాలా డీప్ గా ఉండటం కారణంగా చాలా ఫేమస్ అయ్యారు.
కెరీర్ :
గ్రాడ్యుయేషన్ తర్వాత రిక్‌మాన్ తన స్నేహితులతో కలిసి గ్రాఫిటీ డిజైన్ స్టూడియో ను ప్రారంభించారు. ఈ బిజినెస్ ను సక్సెస్ గా మూడు సంవత్సరాలు చేసిన తరవాత యాక్టింగ్ ను ప్రొఫెషనల్ కెరీర్ గా ఎంచుకున్నారు.
1972 నుంచి 1974 వరకు రాయల్ అకాడమీ ఆఫ్ డ్రమాటిక్ ఆర్ట్ (RADA) లో ఆడిషన్ ఇచ్చి చేరారు.
RADA నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న తరవాత వివిధ నాటకాలలో నటించారు.
1985 వ సంవత్సరంలో రాయల్ షేక్స్‌పియర్ కంపెనీ నిర్మాణంలో వికామ్టే డి వాల్మోంట్ అనే మెయిన్ లీడ్ క్యారెక్టర్ పాత్రను ఇవ్వటం జరిగింది.
క్రమ క్రమంగా ఈయన పలు విజయవంత మైన సినిమాలలో నటించారు.
హరీ పాటర్ (Harry Potter), ఆలిస్ ఇన్ వండర్ లాండ్ (Alice in Wonderland) లాంటి ఫేమస్ సినిమాలలో నటించారు.
మరణం:
రిక్‌మాన్ 2005 వ సంవత్సరంలో ప్రోస్టేట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకోవటం ప్రారంభించారు. 2015 వ సంవత్సరంలో రిక్‌మాన్ కి హార్ట్ ఎటాక్ రావటం తో చెక్ చేయగా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఉన్నట్లు గా తెలిసింది.
2016 వ సంవత్సరం జనవరి 14 న లండన్ లో 69 సంవత్సరాల వయస్సులో తన తుది శ్వాస విడిచారు.
Source: Alan Rickman – Wikipedia