జగ్జీవన్ రామ్ భారతదేశానికి చెందిన స్వాతంత్ర్య కార్యకర్త మరియు బీహార్ కి చెందిన రాజకీయ నాయకుడు. ఈయన బాపూజీ గా ప్రసిద్ధి చెందారు. 1935 వ సంవత్సరంలో అంటరాని వారి సమానత్వం కొరకు ఏర్పాటు చేయబడ్డ అఖిల భారత అణగారిన తరగతులు (All India Depressed Classes League) స్థాపనలో కీలక పాత్ర వహించారు.
బాల్యం:
జగ్జీవన్ రామ్ బీహార్ రాష్ట్రం లోని అర్రా సమీపంలోని చందవాలో శోభి రామ్ మరియు వాసంతి దేవి దంపతులకు జన్మించారు. ఈయనకు ఒక అన్నయ్య మరియు 3 సోదరీమణులు ఉన్నారు. ఈయన చమార్ కులానికి చెందిన వారు.
ఈయన తండ్రి పెషావర్ లో బ్రిటిష్ ఇండియా ఆర్మీ లో పనిచేసేవారు. తరవాత అక్కడ నచ్చక ఉద్యోగాన్ని వదిలేసారు.
ఉద్యోగం మానేసి చందవాలోనే వ్యవసాయ భూమిని కొనుగోలు చేసి స్థిరపడ్డారు.అలాగే ఈయన శివ నారాయణి శాఖ యొక్క ఉన్నతాధికారిగా కూడా ఉన్నారు. చేతి రాత బాగుండటం వల్ల పలు పుస్తకాలను శాఖ కోసం రాయటం జరిగింది.
జగ్జీవన్ రామ్ చిన్న తనంలోనే తండ్రి మరణించారు. ఆర్థికంగా ఈ కుటుంబం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అర్రా టౌన్ స్కూల్ లో చదువుతునప్పుడు జగ్జీవన్ రామ్ మొదటి సారి కుల వివక్షతను ఎదుర్కొన్నారు.
ఆ రోజులలో స్కూల్ లో నీళ్లు తాగడానికి రెండు కుండలను ఉంచేవారు. ఒక కుండ హిందువుల కోసం మరియు ఒక కుండా ముస్లిం ల కోసం ఉండేవి.
జగ్జీవన్ రామ్ హిందువుల కోసం ఉంచిన కుండలో నుంచి నీళ్లు తాగేవారు . జగ్జీవన్ అంటరాని వాడని హిందువుల కుండలో నీళ్లు తాగవద్దని ఇతరులు ప్రిన్సిపల్ కి ఫిర్యాదు చేసారు.
ఫలితంగా మూడవ కుండను అంటరానివారికోసం ఉంచారు. నిరసనలు జరిగే సమయంలో ఈ కుండను జగ్జీవన్ రెండు సార్లు పగలగొట్టారు.
మెట్రిక్యూలేషన్ ను పూర్తి చేసుకొని 1927 లో బనారస్ హిందూ యూనివర్సిటీ లో చేరారు. యూనివర్సిటీ లో చదివే సమయంలో సామాజిక వివక్షకు వ్యతిరేకంగా నిరసనలు చేసారు.
యూనివర్సిటీ లో చదివే సమయంలో కూడా జగ్జీవన్ కులవివక్షతను ఎదుర్కొన్నారు. క్షవరం చేయడానికి కూడా ఒక దళితుడు వచ్చేవాడు. ఇదంతా నచ్చక ఆ యూనివర్సిటీ ను వదిలేసి కలకత్తా విశ్వవిద్యాలయం లో చేరారు.
ఈ యూనివర్సిటీ నుంచి B.sc డిగ్రీ ను పూర్తి చేసారు. ఈ కాలేజీ లో చదివే సమయంలోనే మహాత్మా గాంధీ ద్వారా మొదలుపెట్టిన అంటరానితనం వ్యతిరేక ఉద్యమం లో పాల్గొన్నారు.
కెరీర్:
కుల వివక్షతపై పోరాటం చేస్తున్న జగ్జీవన్ రామ్ ను నేతాజీ సుభాష్ చంద్రబోస్ గుర్తించారు. 1935 వ సంవత్సరంలో All-India Depressed Classes League ను స్థాపించారు.
1937 వ సంవత్సరంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో గెలిచారు. 1940 లలో సత్యాగ్రహ మరియు క్విట్ ఉద్యమంలో పాల్గొన్నందుకు జైలు పాలయ్యారు.
రాజ్యాంగ సభలో దళితుల హక్కుల కోసం పోరాడారు. 1946 వ సంవత్సరంలో జరిగిన జవహర్ లాల్ నెహ్రు తాత్కాలిక ప్రభుత్వం లో అతి చిన్న వయస్కుడైన మంత్రి అయ్యారు.